Rejection : ఏ విషయంలో అయినా మనకి తిరస్కారం ఎదురయితే.. ఏం చేయాలి?

ప్రేమించిన వ్యక్తి రిజెక్ట్ చేయచ్చు.. జాబ్ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వచ్చు.. ఏదైనా పోటీలో సెలక్ట్ అవ్వకపోవచ్చు.. మనం అనుకున్నవి.. ఆశపడ్డవి అన్నీ జరగకపోవచ్చు.. రిజెక్షన్‌ను తట్టుకోవడం ఎలా?

Rejection : ఏ విషయంలో అయినా మనకి తిరస్కారం ఎదురయితే.. ఏం చేయాలి?

Rejection

Updated On : October 7, 2023 / 7:39 PM IST

Rejection : ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో తిరస్కారం (Rejection) ఎదురవుతుంది. అలాంటి సందర్భంలో చాలా బాధకు లోనవుతారు. డిప్రెస్ అయిపోతారు. ఆ బాధని వెంటనే తీసివేయలేం. కానీ జీవితాంతం బాధపడుతూ ఉండనవసరం లేదు. రిజెక్షన్ వల్ల కలిగిన పెయిన్ నుంచి ఎలా బయటపడాలి?

ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసింది.. జాబ్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది.. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రాలేదు.. రిజెక్ట్ అవ్వడానికి చాలా అంశాలు కనిపిస్తాయి. అందుకు కారణాలు నమ్మకం లేకపోవడం కావచ్చు. నచ్చకపోయి ఉండొచ్చు. కోపంతో తిరస్కరించి ఉండొచ్చు.. తగిన అర్హత లేకపోవడం కావచ్చు.. అలాంటి సందర్భాల్లోనే డిప్రెషన్‌కి లోనవకుండా ఆ తిరస్కారాన్ని అంగీకరించాలి. ఆ తిరస్కారం మనలో ఉన్న తప్పుల్ని సరి చేసుకునే అవకాశంగా కూడా భావించాలి.

Also Read: కోపంతో ఉన్నప్పుడు నివారించాల్సిన 6 ఆహారాలు ఇవే !

జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశంలో తిరస్కారానికి గురవుతారు. అది కేవలం జీవితంలో ఒక భాగం మాత్రమే. రిజక్షన్‌ని రిజెక్ట్ చేయకూడదు.. దానిని యాక్సెప్ట్ చేయాలి. తిరస్కరణ ఎంత బాధించినా తిరిగి ఇతరులను బాధపెట్టకూడదు. తమని తాము నిందించుకోవడం..తిట్టుకోవడం కూడా సరికాదు. తిరిగి మామూలు మనిషి కావడానికి సమయం పట్టినా రిజెక్షన్ వల్ల కొత్త అనుభవాలను నేర్చుకుంటారు.

తిరస్కరణ వల్ల నిరుత్సాహానికి లోనైతే శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. దానిని మర్చిపోవడానికి కొత్త అంశాలపై దృష్టి పెట్టడం ఎంతో మంచిది. అప్పుడే భవిష్యత్తుపై దృష్టి పెట్టి గతాన్ని మర్చిపోతారు. ఎంత ప్రయత్నించినా బాధను మర్చిపోలేకపోతే ఖచ్చితంగా మానసిక వైద్యులను సంప్రదిస్తే వారిచ్చే కౌన్సిలింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Also Read: కితకితలు పెడితే నవ్వు ఎందుకు వస్తుందో తెలుసా?

రిజెక్షన్ వల్ల మనసుకి గాయం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. తిరిగి పుంజుకోవడానికి సెల్ఫ్ లవ్ చాలా అవసరం. అప్పుడే ముందుకు వెళ్లగలుగుతారు. తిరస్కారం వల్ల ఎదురైన చేదు అనుభవం భవిష్యత్‌కి ఓ గుణపాఠంగా గుర్తు పెట్టుకోవాలి. అదే రిజెక్షన్ నుంచి బయటపడటానికి ఉత్తమమైన మార్గం.