Benefits Of Onion : ఉల్లిపాయతో ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే…
ఉల్లిపాయల్లో ఫోలెట్ బి9, పిరిడాక్సిన్బి6 వంటి బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవిక్రియతోపాటు, ఎర్ర రక్తకణాల ఉత్పత్తి, నరాల పనితీరులో కీలకపాత్ర పోషిస్తాయి.

Onion
Benefits Of Onion : ఆరోగ్యానికి అన్ని రకాల కూరగాయలు అవసరమౌతాయి. అయితే వాటిలో కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో ఉల్లిపాయ కూడా ఒకటి. ఉల్లిపాయ వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, శక్తివంతమైన సమ్మేళనాలను కలివుంది. ఆరోగ్యాన్ని కాపాడటంలో అనేక విధాలుగా దోహదపడుతుంది. వాస్తవానికి ఉల్లిపాయలోని ఔషదగుణాలను పురాతకాలంలోనే గుర్తించారు. ఉల్లిపాయలను నిత్యం మనం వంటల్లో ఉపయోగిస్తుంటాం. వీటిని వేస్తేనేగానీ కూరలకు రుచి రాదు. ఉల్లిపాయలను కొందరు పచ్చిగానే తింటుంటారు. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ వంటి వాటితోపాటు నాన్‌వెజ్ వంటకాల్లో వాడుతుంటారు.
తలనొప్పి, నోటిలో పుండ్లు, గుండె జబ్బులు వంటి వ్యాధుల చికిత్సలో ఉల్లిపాయలను వినియోగించేవారు. ఉల్లిపాయల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. కేలరీలు తక్కవగా ఉండి విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఒక మీడియం సైజు ఉల్లిపాయలో 44 కేలరీలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ గణనీయమైన మోతాదులో దొరుకుతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి, కణజాల మరమ్మత్తు, ఇనుము శోషణను నియంత్రించటంలో ఇది తోడ్పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.
ఉల్లిపాయల్లో ఫోలెట్ బి9, పిరిడాక్సిన్బి6 వంటి బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవిక్రియతోపాటు, ఎర్ర రక్తకణాల ఉత్పత్తి, నరాల పనితీరులో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో పొటాషియం కూడా లభిస్తుంది. సాధారణ సెల్యులర్ ఫంక్షన్, ఫ్లూయిడ్ బ్యాలెన్స్, మూత్రపిండాలు, కండరాల సంకోచానికి పోటాషియం అవసరత ఎంతో ఉంటుంది. ఉల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన సమ్మేళనాలు వాపుతో పోరాడటాయి. ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ స్ధాయిలను నియంత్రిస్తాయి. గుండెజబ్బుల ప్రమాదం నుండి కాపాడతాయి.
ఉల్లిపాయల్లో ఉండే శక్తవంతమైన శోథ నిరోధక లక్షణాలు అధిక రక్తపోటును తగ్గించటంతోపాటు, రక్తం గడ్డకట్టకుండా రక్షించటంలో సహాయపడతాయి. క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఫ్లెవనాయిడ్ ఉల్లిపాయల్లో అధికంగా ఉంటుంది. శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ రక్తపోటును నియంత్రిస్తుంది. అధిక రక్తపోటుతో ఉన్న 70 మందిపై జరిపిన అధ్యయనంలో ఉల్లిపాయ రోజుకు 162 మిల్లీ గ్రాముల మోతాదులో తీసుకున్న వారిలో రక్తపోటు తగ్గినట్లు గుర్తించారు.
అధిక బరువుతోపాటు , శరీరంలోని చెడు కొలస్ట్రాల్ ను తగ్గించటంలో ఇది ఎంతగానో దోహదం పడుతుంది. క్యాన్సర్, మధుమేహం వంటి వాటిని నియంత్రిస్తుంది. ఉల్లిపాయల్లో క్యాన్సర్ పై పోరాటం చేసే లక్షణాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. శృంగార కోర్కెలను పెంచడంలో ఉల్లిపాయ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవటం వల్ల జననావయవాలు పటిష్టంగా మారుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. పురుషుల్లో శృంగార సమస్యలు పోతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది.