Small Uterus : గర్భసంచి చిన్నసైజులో ఉంటే గర్భందాల్చటం కష్టమా?

గర్భసంచి సైజు కొన్ని సార్లు జన్యు ఆధారితంగా ఉంటుండగా, కొన్నిసార్లు హార్మోన్ల లోపాల వల్ల చిన్నదిగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి సందర్భాలలో ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్లను వైద్యులు సూచించే అవకాశాలు ఉంటాయి.

Small Uterus : గర్భసంచి చిన్నసైజులో ఉంటే గర్భందాల్చటం కష్టమా?

Small Uterus

Updated On : July 29, 2022 / 4:35 PM IST

Small Uterus : మహిళల్లో చాలా మంది గర్భసంచి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక మందిలో గర్భవతి అయ్యే వరకు తమకు చిన్న గర్భాశయం ఉందని గ్రహించలేరు. ప్రినేటల్ పరీక్షలు, అల్ట్రాసౌండ్‌ ద్వారా వైద్యులు ఈ పరిస్థితిని గుర్తిస్తారు. గర్భాశయం చిన్నదిగా ఉండటం వల్ల గర్భం ధరించటంలో, బిడ్డ కు జన్మనివ్వటంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది.

యుక్తవయసు దాటిన స్ర్తీలలో గర్భసంచి సుమారు 8 నుండి 9 సెంటీమీటర్ల పొడవు, 5 నుండి 6 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. గర్భసంచి పరిమాణం విషయంలో వ్యక్తులకు , వ్యక్తులకు మధ్య తేడాలు ఉంటాయి. ఈ పరిమాణంలో ఉండే గర్భసంచి ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ బరువులో ఎనభై గ్రాముల నుంచి కేజీ వరకు పెరగుతుంది. అలాగే కొలతలో కూడా 8 నుంచి 9 సెంటీమీటర్లు ఉండే గర్భసంచి ప్రెగ్నెన్సీ సమయంలో 32 – 36 సెంటీమీటర్ల వరకు, కవలలు ఉన్న సందర్భాలలో ఇంకా కొంచెం ఎక్కువ పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

గర్భసంచి సైజు కొన్ని సార్లు జన్యు ఆధారితంగా ఉంటుండగా, కొన్నిసార్లు హార్మోన్ల లోపాల వల్ల చిన్నదిగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి సందర్భాలలో ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్లను వైద్యులు సూచించే అవకాశాలు ఉంటాయి. వీటి వల్ల సరైన సైజులో గర్భసంచి పెరుగుతుందన్న గ్యారెంటీ ఏమీ లేకపోయినప్పటికీ, పనితీరును మాత్రం క్రమబద్ధీకరించడానికి ఈ ట్యాబ్లెట్లు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.

స్వల్పంగా సైజు తక్కువగా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఇబ్బంది కలగకపోవచ్చు. కాని సైజు బాగా తక్కువ ఉన్న పరిస్థితులలో అబార్షన్లు అవడం, నెలలు నిండకుండానే బ్లీడింగ్ కావటం, ప్రీ టెర్మ్ డెలివరీ అవ్వటం, బరువు తక్కువగా ఉన్న పిల్లలు పుట్టడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చినట్లయితే సహజంగానే ప్రెగ్నెన్సీ వచ్చేందుకు అవకాశం ఉంది. చిన్న సైజు గర్భసంచి ఉన్నవారు వైద్యులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.

గమనిక; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.