Natukodi Eggs : నాటుకోడి గుడ్డులో పోషకాలు అధికమా?…
ఎగ్ వైట్ లోపల ఉండే పచ్చని సొనలో అధికసంఖ్యలో ప్రోటీన్లు, కొలెస్ట్రరాల్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఎలాంటి మాంసాహారం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Eggs
Natukodi Eggs : కోడి గుడ్డులో బోలెడన్ని పోషక పదార్థాలు, ప్రొటీన్లు, కొలిన్ ఉంటాయి. అందుకే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తారు. ఒక గుడ్డు తినడం వల్ల 70-80 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్లు, 5 గ్రాముల కొవ్వులు, 190 గ్రాముల కొలెస్ట్రాల్ శరీరానికి అందుతుంది. ఇందులో అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్, అయోడిన్, సెలీనియం, ఐరన్, జింక్ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేస్తాయి. చాలామంది బాయిలర్ కోళ్లకు బదులుగా నాటి కోళ్ల గుడ్లను తినడానికి ఇష్టపడుతుంటారు. నాటు కోడి గుడ్లు ఆరోగ్యానికి మంచివని, వాటిని తినడం వల్ల సరైన పోషకాలు మన శరీరానికి అందుతాయని చాలామంది భావిస్తారు. ఈ క్రమంలోనే బాయిలర్ గుడ్డు తో పోలిస్తే నాటు గుడ్డుకు అధిక డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తారు.
ఈ కోడిగుడ్ల విషయంలో అయితే నాటి కోడి గుడ్లలో ఎక్కువ శాతం పోషకాలు,ప్రొటీన్లు దొరుకుతాయని భావించి వాటిని కొనుగోలు చేయడం అనేది కేవలం మీ అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. సాధారణ గుడ్లు నాటుకోడి గుడ్లలో ఒకే పరిమాణంలో పోషకాలు ఉంటాయి.కొన్నిసార్లు గుడ్డు పరిమాణంలో తేడా ఉంటుంది కానీ వాటిలో ఉన్నటువంటి పోషకాలు లో ఏమాత్రం తేడా ఉండదని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఎగ్ వైట్ లోపల ఉండే పచ్చని సొనలో అధికసంఖ్యలో ప్రోటీన్లు, కొలెస్ట్రరాల్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఎలాంటి మాంసాహారం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోళ్లు జన్మించిన ఆరు నెలల కాలం నుంచి రెండు రోజులకు ఒక గుడ్డు పెడుతుంటాయి. కోడి పుంజుతో కలవకపోయినా గుడ్లు పెట్టె విధానాన్ని అన్ ఫెర్టిలైజర్ అంటారని, ప్రస్తుతం మార్కెట్లో దొరికే ఎగ్స్ అన్‌ఫెర్టిలైజర్ ఎగ్స్ గా చెప్పవచ్చు.
సాధారణ కోడి గుడ్లు తెలుపు రంగులో ఉండగా నాటు కోడి గుడ్లు కొద్దిగా గోధుమ రంగులు కలిగి ఉంటాయి. సాధారణ గుడ్లతో పోలిస్తే నాటు కోడి గుడ్లు కొద్దిగా సైజులు చిన్నవిగా ఉన్నప్పటికీ రెండింటిలోనూ ఒకే విధమైనటువంటి ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం విలువలు ఉంటాయని కేవలం మన అపోహ వల్ల మాత్రమే నాటి కోడి గుడ్లకు అధిక డబ్బు వెచ్చించి మార్కెట్లో వాటికి డిమాండ్ కల్పిస్తున్నామని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు ఒక కోడిగుడ్డును తీసుకుంటే.. బరువును అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. అల్పాహారంలో తప్పకుండా కోడిగుడ్డును తీసుకుంటే మంచిది. కోడిగుడ్లను తరుచూ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే పెరిగే చిన్నారులకు రోజుకు ఓ కోడిగుడ్డును తినిపించాలి. గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది