Supta Virasana : బ్యాక్ పెయిన్, తొడల కొవ్వు కరిగించే యోగాసనం ఇదే?…

ముందుగా వీరాసనం కూర్చోవాలి. మోకాళ్లు మడిచి పిరుదులను నేలకు ఆనించి కూర్చోవాలి. ఈ స్ధితో అరికాళ్లు దేహానికి రెండు వైపులా ఆకాశాన్ని చూస్తుండాలి.

Supta Virasana : బ్యాక్ పెయిన్, తొడల కొవ్వు కరిగించే యోగాసనం ఇదే?…

Suptha Vajrasana

Updated On : February 1, 2022 / 3:21 PM IST

Supta Virasana : మనిషి బ్రతకటానికి ఆహారం ఎంత అవసరమో, ఆరోగ్యంగా జీవించేందుకు వ్యాయామము అంతే అవసరం. వ్యాయామం అంటే జిమ్ లకు వెళ్ళి కసరత్తులు చేయాల్సిన పనిలేదు. ఇంట్లోనే సులభమైన యోగాసనాలు వేయటం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. అనేక రుగ్మతల నుండి మనశరీరాన్ని కాపాడుకోవచ్చు.

ముఖ్యంగా చాలా మంది తోడల మీద ఉన్న కొవ్వు కారణంగా నడవలేక ఇబ్బందులు పడుతుంటారు. దీనిని కరిగించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే యోగాసనాలలో సుప్త వీరాసనం తొడల కొవ్వను కరిగించేందుకు చక్కగా ఉపకరిస్తుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ఈ ఆసనం వేయటం ద్వారా నొప్పులను తగ్గించుకోవచ్చు. ఈ సుప్త వీరాసనం వేయటం ద్వారా మోకాళ్లు, తొడలు శక్తివంతం అవుతాయి. ఆస్మా, బ్యాక్ పెయిన్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. గొంతు సమస్యలు తొలగిపోయి స్వరం మధురంగా ఉంటుంది.

సుప్త వీరాసనం వేసే పద్దతి ; ముందుగా వీరాసనం కూర్చోవాలి. మోకాళ్లు మడిచి పిరుదులను నేలకు ఆనించి కూర్చోవాలి. ఈ స్ధితో అరికాళ్లు దేహానికి రెండు వైపులా ఆకాశాన్ని చూస్తుండాలి. అరచేతులను తొడల మీద బోర్లించాలి. వెన్నెముక నిటారుగా ఉంచి దృష్టిని నేరుగా ఒకే చోట కేంద్రీకరించాలి. దీనిని వీరాసనం అంటారు. తరువాత నిదానంగా వెనుకకు వంగుతూ రెండు మోచేతులను ఒకదాని తర్వాత మరొకటిగా నేలమీద ఆనించాలి.

ఈ స్ధితిలో రెండు పాదాల పక్కన రెండు అరచేతులను నేల మీద బోర్లించాలి. రెండు మోచేతుల సాయంతో శరీరాన్ని నేలమీద ఉంచి రెండు చేతులను మడిచి తలకింద ఉంచాలి. ఈ స్థితిలో పూర్తి శరీరం నేలకు తాకుతూ ఉంటుంది. పాదాలు శరీరానికి ఆనుకుని ఉంటాయి. మడమలు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంటాయి. శ్వాస సాధారణంగా తీసుకుంటూ వదలాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మోచేతులసాయంతో దేహాన్ని పైకిలేపుతూ సాధారణ స్ధితికి రావాలి. సుప్త వీరాసనం వల్ల ఛాతి పెరుగుతుంది. శ్వాసక్రియ మెరుగుపడుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వాళ్లు, స్ధూలకాయులు ఈ ఆసనాన్ని సాధన చేయరాదు. మొదటిసారి చేసే వాళ్ళు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.