Money Plant : మనీ ప్లాంట్ దొంగతనం చేసి ఇంట్లో నాటితే నిజంగా అదృష్టం కలిసి వస్తుందా?
మనీ ప్లాంట్ చాలామంది పెంచుతారు. వీటిని పెంచితే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. ఇంకో నమ్మకం ఏంటంటే దొంగిలించిన మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచితే కలిసి వస్తుందంటారు. ఇది నిజమేనా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

Money Plant
Money Plant : మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే కలిసి వస్తుందని అందరూ నమ్ముతారు. అందరి ఇళ్లలో వీటిని పెంచుతారు. చూడటానికి ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా అవి ఉన్న చోట వాతావరణం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. బాల్కనీలు, వరండాలు, వంటగదుల్లో వీటిని పెంచుతుంటారు. మనీ ప్లాంట్‌ను చాలామంది దొంగిలించి ఇంట్లో నాటితే కలిసి వస్తుందని చెబుతారు. అది నిజమేనా? మనీ ప్లాంట్ గురించి కొన్ని అద్భుతమైన విషయాలు.
Dengue : మనీ ప్లాంట్ ఉందా..అయితే జాగ్రత్త
మనీ ప్లాంట్‌లు ఆకుపచ్చని ఆకులతో మాత్రమే ఉంటాయని అందరూ అనుకుంటారు. అయితే వీటిలో అందమైన పువ్వులు పూసే మొక్కలు కూడా ఉంటాయట. తెలుపు, క్రీమ్ కలర్‌లో ఉండే పువ్వులు గబ్బిలాలు, తేనెటీగల్ని ఆకర్షించే వాసనతో ఉంటాయట. మనీ ప్లాంట్ రసం చాలా విషపూరితమైనదట. కాబట్టి ఈ మొక్కను జాగ్రత్తగా పెంచాలి. ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉంచాలి
మనీ ప్లాంట్స్‌ని గదిలో ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఆగ్నేయ దిశలో యజమాని గణేశుడు..పాలించే గ్రహం శుక్రుడు. గణేశుడు యజమానిని కష్టాల నుంచి కాపాడతాడని సంపద, శ్రేయస్సు కలిగిస్తాడని అందరూ నమ్ముతారు. మనీ ప్లాంట్ గురించి విచిత్రమైన అంశం ఏంటంటే ఈ మొక్క ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే వేరొకరి ఇంట్లో నుంచి దొంగిలించాలని చెబుతారు. ఇది విచిత్రంగా అనిపించిన వాస్తవమట. కానీ వాస్తు శాస్త్రం మాత్రం దీనిని అంగీకరించదు. ఖచ్చితంగా మనీ ప్లాంట్‌ని కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకోవాలట.
Lucky plants : అదృష్టం మీ తలుపు తట్టాలా? ఇంట్లో ఈ లక్కీ ప్లాంట్స్ పెట్టండి
మనీ ప్లాంట్ ప్యూరీ ఫైయర్‌గా పనిచేస్తాయి. కలుషితమైన గాలిని శుద్ధి చేస్తాయి. ఈ మొక్కలు ఏ సీజన్‌లో అయినా పెరుగుతాయి. నిర్ధిష్టమైన వాతావరణ పరిస్థితులు వీటికి అవసరం లేదు. ఇతర మొక్కలతో పోలిస్తే మనీప్లాంట్లు ఎక్కువకాలం బ్రతుకుతాయట. ఈ మొక్కలకు డైరెక్ట్‌గా సూర్యకాంతి అవసరం ఉండదు. ఇవి మట్టిలేకపోయినా నీటిలో కూడా పెరుగుతాయి. మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమీ లేకపోయినా ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి.