Dengue : మనీ ప్లాంట్ ఉందా..అయితే జాగ్రత్త

అందం, ఆహ్లాదం కోసం సిటీ జనులు పెంచుతున్న పూల, తీగజాతి మొక్కలు వాటి కోసం ఏర్పాటు చేసిన పూలకుండీలు ప్రస్తుతం ‘డెంగీ’ దోమలకు నిలయంగా మారుతున్నాయన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Dengue : మనీ ప్లాంట్ ఉందా..అయితే జాగ్రత్త

Health

Money Plant : ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడం అందరికీ అలవాటే. ఈ మొక్కల్లో ‘మనీ ప్లాంట్’ ఒకటి. ఈ మొక్క ఇప్పుడు ప్రతింట్లో ఉంటోంది. ఈ మొక్క పెట్టుకోవడం వల్ల డబ్బులు వస్తాయని, సంపద సంప్రాసిస్తుందని కొందరు నమ్మకం. ఈ మొక్క విషయంలో చాలా జాగ్రత్త అంటున్నారు వైద్యులు. అందం, ఆహ్లాదం కోసం సిటీ జనులు పెంచుతున్న పూల, తీగజాతి మొక్కలు వాటి కోసం ఏర్పాటు చేసిన పూలకుండీలు ప్రస్తుతం ‘డెంగీ’ దోమలకు నిలయంగా మారుతున్నాయన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Read More : One Daily Habit : ఒక్క అల‌వాటు చేసుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ‌తికేయొచ్చు..

హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు దేశంలోనే అత్యధికంగా 537 డెంగీ కేసులు నమోదు కావడం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పారిశుధ్యం లోపం ఎక్కువగా ఉన్న మూసీ పరివాహక ప్రాంతాల్లో డెంగీ జ్వరాలు అధికంగా వస్తాయని భావిస్తుంటారు. కానీ…జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో కేసులు నమోదవుతుండడం వైద్యులను ఆశ్చర్యపరుస్తోంది.

Read More : Shakeela Health : బతికే ఉన్నా..ఆరోగ్యం బాగానే ఉంది

దీనికి గల కారణాలు :-

సంపన్నుల నివాసాలు ఎక్కువగా విలాసవంతంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. వీరి నివాసాల్లో అందంగా, ఆహ్లాదకరంగా ఉండేందుకు వివిధ రకాల జాతి మొక్కలను పెంచుతుంటుంటారు. అందులో మనీప్లాంట్లు, రకరకాల మొక్కలు పెంచుకుంటుంటారు. వీటి కోసం భారీ కుండీలను ఏర్పాటు చేస్తుంటారు. వర్షపునీరు వీటిలో చేరి రోజుల తరబడి నిల్వ ఉంటుందనే సంగతి తెలిసిందే. వీటిలో డెంగీ దోమలు గుడ్లు పెట్టి…వాటి వృద్ధికి కారణమౌతుంటాయి. కొత్త కాలనీలు, నిర్మాణాలు, సెల్లార్లు ఎక్కువగా ఉన్న శివారు ప్రాంత మున్సిపాల్టీల్లోనూ డెంగీ కేసులు భారీగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Read More : Alcohol: మద్యం మంచిదే.. ఆల్కహాల్ తాగితే కిక్కే కాదు.. ఆరోగ్యం కూడా.. కానీ!

ఈ విషయంలో జీహెచ్ఎంసీపై పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు సిటీజన్లు. వారానికొకసారి కూడా ఫాగింగ్ చేయడం లేదని, ఇంటింటికి తిరిగి యాంటిలార్వా మందును పిచికారీ చేయడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంటింటికి తిరిగి యాంటిలార్వ మందును పిచికారీ చేయాల్సిన సిబ్బంది మంచినీటి ట్యాంకుల్లో మందు చల్లకుండానే..చల్లినట్లు ఇంటిగోడలపై పెన్సిల్ తో రాసి చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. రెండు వారాల్లోనే గాంధీ ఆసుపత్రిలో డెంగీతో 54 మంది చిన్నారులు ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరు షాకింగ్ సిండ్రోమ్ తో మృతి చెందడం కలవర పెడుతోంది.

దోమలకు నిలయాలు

ముంపు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం.
ఇంటి ఆవరణలో పూల కండీలు శుభ్రం చేయకపోవడం
మనీప్లాంట్స్, ఇతర చెట్ల పొదలు.

Read More : Buddhadeb Bhattacharya : క్షీణించిన కమ్యూనిస్ట్ దిగ్గజం ఆరోగ్యం

కొత్త నిర్మాణాలు, సెల్లార్లు.
తాళం వేసిన నివాసాలు.
టైర్లు, ఖాళీ సీసాలు, కొబ్బరి బోండాలు.
విద్యా సంస్థలు, ఫంక్షన్ హాళ్లు.