Alcohol: మద్యం మంచిదే.. ఆల్కహాల్ తాగితే కిక్కే కాదు.. ఆరోగ్యం కూడా.. కానీ!

మితిమించనిది ఏదైనా మంచిదే.. ఎంతోమంది తప్పుగా భావించే మద్యం తాగడం కూడా మితంగా తాగడం మంచిదే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎక్కువగా మద్యం తాగితే, శరీరానికి ఎంత చెడ్డదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కువగా మద్యం తాగితే, కాలేయం దెబ్బతింటుంది.

10TV Telugu News

Surprising healthy: మితిమించనిది ఏదైనా మంచిదే.. ఎంతోమంది తప్పుగా భావించే మద్యం తాగడం కూడా మితంగా తాగడం మంచిదే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎక్కువగా మద్యం తాగితే, శరీరానికి ఎంత చెడ్డదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కువగా మద్యం తాగితే, కాలేయం దెబ్బతింటుంది. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ, మద్యం మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసా? ఎప్పుడైనా విన్నారా?

మద్యం తాగితే మంచి కూడా జరుగుతుందా? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ఆల్కహాల్ మీ శరీరానికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉదయం 9 గంటలకు వోడ్కాను తక్కువ పరిమాణంలో తినడానికి ముందు తాగితే, ప్రయోజనకరంగా ఉంటుందంట. చిన్న మొత్తంలో మహిళలు అయితే రోజుకు 1, పురుషులు అయితే రోజుకు 2 పెగ్గులకు మించి తాగరాదు. ఒక్క రోజుకు 12ఔన్సుల మందు మాత్రమే తాగితే మంచింది. బీర్ అయితే, 355 మి.లీ, వైన్ అయితే ఐదు ఔన్సులు(148 మి.లీ) లేదా 1.5 ఔన్సుల మద్యం(44.3 మి.లీ). ఈ మోతాదుల్లో తాగితే శరిరానికి ఎటువంటి ఇబ్బందీ జరగదు. సిఫార్సు చేసిన మొత్తం కంటే ఎక్కువ తాగడం చేస్తే మాత్రం ప్రయోజనాలు తగ్గి, నష్టాలు పెరుగుతాయి.

మద్యం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు:
కొన్ని పరిశోధనలు మితంగా తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది మరియు ఎక్కువకాలం జీవించడానికి సహాయపడుతుంది అని చెబుతున్నారు నిపుణులు. వారాంతంలో అతిగా తాగడం కంటే వారమంతా మితంగా తాగడం మంచిదని, మరియు మరణాల ప్రమాదం 25% తగ్గుతుందని చెబుతున్నారు. PLOS మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన 2018 అధ్యయనం ప్రకారం, మద్యం పూర్తిగా మానేసిన వారి కంటే మితంగా తాగేవారు చిన్న వయస్సులో చనిపోయే అవకాశం తక్కువగా ఉంది.

అతిగా తాగడం వల్ల తీవ్రమైన గుండె సమస్యలు వస్తాయి, అయితే మితమైన మద్యపానం గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మితమైన మద్యపానం గుండెపోటు, స్ట్రోక్ లేదా గట్టిపడిన ధమనులను 25% నుండి 40% వరకు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల కొలెస్ట్రాల్ స్థాయిలను(హెచ్‌డిఎల్) పెంచుతుంది, ఇది శరీరానికి మంచిది.

మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది:

క్రమం తప్పకుండా మితంగా మద్యం తాగేవారికి కిడ్నీలో రాళ్ళు వచ్చే ప్రమాదం తక్కువ అవుతుంది. అయితే, అధికంగా తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురై మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం పెంచుతుంది. కాబట్టి, మితంగా తాగుతూ శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

మితమైన మద్యపానం వల్ల శారీరక ప్రయోజనాలే కాకుండా, తాగడం వల్ల కొన్ని మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మితంగా తాగే వ్యక్తులు సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని అధ్యయనంలో కనుగొన్నారు. స్నేహితులతో మద్యపానం కూడా మానసిక స్థితిని అదుపులో ఉంచుతుంది. వారు మరింత సామాజికంగా ఉండటానికి మరియు వారి సామాజిక మరియు వ్యక్తిగత జీవితంలో సంతోషాలకు మితమైన మద్యం కారణం అవుతుంది.

10TV Telugu News