Hypertension : హైపర్ టెన్షన్ ఉంటే ఈ 5 ఆహారాలు తినకపోవటమే మంచిది!

ఫిట్‌నెస్ ఔత్సాహికులు తమ క్యాలరీలను తక్కువగా తీసుకోవడానికి సూప్‌లను తాగుతుంటారు. సూప్ లలో సోడియం అధికంగా ఉంటుంది. హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నవారు వీటిని తీసుకోకుండా ఉండటం మేలు.

Hypertension : హైపర్ టెన్షన్ ఉంటే ఈ 5 ఆహారాలు తినకపోవటమే మంచిది!

Hypertention

Updated On : April 4, 2022 / 12:50 PM IST

Hypertension : ఇటీవలి కాలంలో హైపర్‌టెన్షన్‌ బారినపడే వారి నంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మందికి తమకు హైపర్‌టెన్షన్‌ ఉందన్న విషయం కూడా తెలియటంలేదు. తలనొప్పి, జ్వరం, దగ్గు శరీరపు నొప్పులతో వచ్చే వారికి పరీక్షలు చేస్తే హైపర్‌ టెన్షన్‌ బయట పడుతుంది. మధుమేహం, పక్షవాతం మరియు కిడ్నీ ఫెయిల్యూర్, థైరాయిడ్, ఆర్థో సమస్యలు ఉన్నవారు హైపర్‌టెన్షన్‌తో ఎక్కువగా బాధపడుతుంటారు. ఉప్పు ఉన్న ఆహార పదార్ధాలే ముఖ్యంగా ఈ హైపర్ టెన్షన్ కు కారణంగా వైద్యులు చెబుతున్నారు. జన్యుపరమైన కారణాలు కూడా కొన్ని దీనికి కారణంగా చెప్పవచ్చు.

ప్రానెస్‌ ఫుడ్‌, పీజ్జాలు, బర్గర్‌లు, రెడీమేడ్‌ మాంసం, కూల్‌డ్రింక్‌లు, ప్రిజ్‌లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారు,ఆల్కాహాల్‌ తాగేవారు, ట్రాఫిక్‌లో ఎక్కువగా తిరిగే వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మార్కెట్‌ ఫీల్డ్‌, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్, సేల్స్‌మెన్‌, డైవర్సు ఇలా తదితర వర్గాల్లో హైవర్‌టెన్షన్‌కు గురవుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బిపి అతి తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు వివరీతమైన తలనొప్పి నిద్రలేమి, చూపు మసకభారతం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వానతీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి. గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం రావచ్చు. కళ్లు దెబ్బతింటాయి. మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు రావచ్చు.

హైపర్ టెన్షన్ ఉన్నవారు ఈ 5 ఆహారలకు దూరంగా ఉండటం మేలు;

పిజ్జా: ప్రాసెస్ చేయబడిన మాంసం, చీజ్, సాస్ , క్రస్ట్ , పిజ్జాలోని ప్రతి పదార్ధం లో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది, తద్వారా ఇది హైపర్‌టెన్షన్ రోగులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

ఫాస్ట్ ఫుడ్: ఫాస్ట్ ఫుడ్‌కు సంబంధించి ర్రిటోస్ నుండి టాకోస్ వరకు, శాండ్‌విచ్‌ల నుండి హాంబర్గర్లు, చీజ్‌బర్గర్‌ల వరకు. ఈ ఆహారాలలోని ప్రతి పదార్ధం హైపర్‌టెన్షన్‌కు దోహదం చేస్తాయి. అందువల్ల, అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి వీటిని తినటం మానుకోవటం ఉత్తమం.

బ్రెడ్: బ్రెడ్, ముఖ్యంగా మల్టీగ్రెయిన్ ,హోల్ వీట్ రకాలు, ఆరోగ్యకరమైన ఆహారంగా భావించవచ్చు. కానీ వాస్తవానికి వీటిలో సోడియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది తీవ్రమైన హైపర్ టెన్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తపడటం మంచిది.

సూప్‌లు: ఫిట్‌నెస్ ఔత్సాహికులు తమ క్యాలరీలను తక్కువగా తీసుకోవడానికి సూప్‌లను తాగుతుంటారు. సూప్ లలో సోడియం అధికంగా ఉంటుంది. హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నవారు వీటిని తీసుకోకుండా ఉండటం మేలు.

ప్రాసెస్ చేయబడిన మాంసాలు: సాసేజ్‌లు, సీక్ కెబాబ్‌లు, పెప్పరోని, సలామీ, మాంసాలు వాటి ప్రోటీన్ కంటెంట్ కారణంగా ఆరోగ్యకరమైనవిగా చాలా మంది భావిస్తుంటారు. అయితే వాటి తయారీలో వినియోగించే ఉప్పు హానికలిగిస్తుంది. హైపర్ టెన్షన్ ఉన్న వారు ఇలాంటి వాటిని తీసుకోవటం వల్ల త్వరగా అనారోగ్యాలను కొనితెచ్చుకోవాల్సి ఉంటుంది.