ఫిబ్రవరి 29: అమ్మాయిలు అబ్బాయిలకు ప్రపోజ్ చేసే రోజు

ఏడాదికి 365రోజులు.. ప్రతి రోజు ఓ ప్రత్యేకమే.. అయితే ఈ రోజు(29 ఫిబ్రవరి) మరింత ప్రత్యేకం.. నాలుగేళ్లకు ఓ సారి వస్తుంది ఈ రోజు. లీప్ సంవత్సరం అంటేనే ప్రత్యేకం.. 366రోజులు ఈ సంవత్సరానికి.. ఫిబ్రవరి నెలలో ప్రత్యేకమైన రోజు అంటే ఫిబ్రవరి 14 ఎందుకంటే ఆ రోజు వాలంటైన్స్ డే కాబట్టి. ఫిబ్రవరి 14 (ప్రేమికుల రోజు)న అబ్బాయిలు తమ ప్రేయసికి ప్రేమను వ్యక్తపర్చడం చూస్తుంటాం కదా? వాస్తవానికి ఫిబ్రవరి 8వ తేదీని ప్రపోజ్ డే గా ప్రపంచంలో ఎక్కువ మంది భావిస్తారు.
Also Read | ఫిబ్రవరి 29: ఎందుకు ప్రత్యేకం.. ఈరోజు పుట్టినవారికి ఉండే నైపుణ్యం ఏంటీ?
అయితే అమ్మాయిలు అబ్బాయిలకు ప్రపోజ్ చెయ్యడానికి కూడా ఒక రోజు ఉందట. అదే.. ఫిబ్రవరి 29. ఈ రోజున అమ్మాయిలు తమకు నచ్చిన వ్యక్తికి ప్రపోజ్ చేస్తారట. అమ్మాయిలు ఈ రోజు ప్రపోజ్ చేస్తే.. అబ్బాయిలు కచ్చితంగా ఒప్పుకొంటారని నమ్మకం.. ఒకవేళ అబ్బాయికి నచ్చకపోతే ఆ అమ్మాయికి ముద్దు.. కొత్త బట్టలు కొనివ్వాలనేది ఐదవ శతాబ్దం నాటి ఐరిష్ సంప్రదాయం అట.
మాములుగా అయితే అమ్మాయిలు అబ్బాయికి ప్రపోజ్ చెయ్యడం చాలా అరుదు.. అందుకే అరుదైన ఈ రోజునే ఆ రోజు జరుపుతారట.