Fish Pedicure : ఫిష్ పెడిక్యూర్ ప్రమాదకరమని మీకు తెలుసా?

ఫిష్ పెడిక్యూర్ గురించి చాలామందికి తెలుసు. పాదాల అందం కోసం తీసుకునే ఈ చికిత్స వెనుక మంచి గుణాలు ఎలా ఉన్నాయో.. ప్రమాదకర అంశాలు కూడా చాలా ఉన్నాయి. అవేంటో చదవండి.

Fish Pedicure : ఫిష్ పెడిక్యూర్ ప్రమాదకరమని మీకు తెలుసా?

Fish Pedicure

Fish Pedicure : ఫిష్ పెడిక్యూర్ గురించి చాలామందికి తెలుసు. పాదాల అందం కోసం చేపలతో ఉన్న టబ్‌లో పాదాలను ఉంచడం. ఇదో రకమైన చికిత్స. ఈ చికిత్స తర్వాత మీ పాదాల చర్మం అందంగా, పరిశుభ్రంగా ఉందని భావిస్తారు. నిజానికి ఈ చికిత్స వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోండి.

Tea Vs Coffee : మీ పంటి ఆరోగ్యానికి ఏది మంచిది? టీ.. లేదా కాఫీ?

ఫిష్ పెడిక్యూర్ అనేది టర్కీ నుండి ఉద్భవించిన చికిత్స. ఇందులో చేపలతో నిండిన టబ్‌లో పాదాలను ఉంచుతారు. వీటిలో వేసే చేపలను గుర్ర రాఫా అని కూడా పిలుస్తారు. ఈ చేపలు పాదాల నుండి డెడ్ స్కిన్‌ను తింటాయి. ఆ తర్వాత మీ పాదాలు చాలా క్లీన్‌గా కనిపిస్తాయి. ఈ చికిత్స సమయంలో కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది. అయితే ఈ చికిత్సలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయి.

ఫిష్ పెడిక్యూర్ కోసం వెళ్లినపుడు అక్కడ ఉండే బేసిన్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయరు. దాంతో అనేకమంది తమ పాదాలను అదే  బేసిన్‌లో ఉంచుతారు. ఇది అనేక పరిశుభ్రత సమస్యలకు దారి తీస్తుంది. రక్త సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇక టబ్‌లో వేసే చేపల్లో కూడా వ్యాధి కారక బాక్టీరియా ఉంటుంది. ఇది అనేక ఇన్ఫెక్షన్ల ప్రమాదానికి దారి తీస్తుంది.

Coconut Water : కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిది? ఎలాంటి వ్యక్తులు తాగకూడదు? మీకు తెలుసా

ఇక టబ్‌లో వేసే గుర్రా రుఫా చేప చనిపోయిన చేపలను తింటుందట. వాటికి ఈ ఆహారం ఇవ్వకపోతే అది ఆకలితో జనాల పాదాలపై ఉన్నస్కిన్‌ను కొరుకుతుందట. దీంతో ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. నిజానికి ఫిష్ పెడిక్యూర్ ప్రక్రియ మంచిది. మృదువైన చర్మాన్ని ఇస్తుంది. కానీ దీని చుట్టూ ఉన్న ఆరోగ్య సమస్యల్ని కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.