Happy New Year 2025: గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకోవడం అసలు ఎప్పుడు మొదలైందో మీకు తెలుసా?
సెల్ ఫోన్లో ఎన్ని సందేశాలు పంపుకున్నా అవి చెరిగిపోతాయి. అదే మీరు అభిమానించే వారికి పంపే గ్రీటింగ్ కార్డ్ భద్రంగా ఉండిపోతుంది. సాంకేతికత పెరిగి గ్రీటింగ్ కార్డ్ ని జనం మర్చిపోయిన వేళ వీటిని ఓసారి తల్చుకుందాం. వీలైతే గ్రీటింగ్ కార్డుకి పునర్వైభవం తెద్దాం.

Happy New Year 2025 Greeting Cards : కొత్త సంవత్సరం మొదలవగానే అందరూ తమ ఆప్తులకి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కొత్త సంవత్సరం వారి జీవితాల్లో మంచి జరగాలని ఆకాంక్షిస్తారు. గతంలో గ్రీటింగ్స్ కార్డ్స్ ఇచ్చి పుచ్చుకునేవారు . టెక్నాలజీ పెరిగిపోవడంతో గ్రీటింగ్స్ కార్డ్స్ మరుగున పడిపోయాయి. అన్నీ సెల్ ఫోన్ మెసేజ్‌లలో ఎక్ఛేంజ్ అయిపోతున్నాయి. అయితే గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చిపుచ్చుకోవడం ఎప్పుడు మొదలైందో మీకు తెలుసా?
గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి పుచ్చుకోవడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఈ సంప్రదాయం మొదట చైనాలో మొదలైందట. పురాతన ఈజిప్టులో శుభాకాంక్షలు లేదా, సంతాప సందేశాలు పంపుకోవాలంటే పట్టు లేదా వెదురు స్క్రోల్స్‌పై (పత్రాలపై) రాసి ఇచ్చుకునేవారట. ఆ తర్వాత వచ్చిన మోడర్న్ గ్రీటింగ్ కార్డ్స్ గురించి అందరికీ తెలిసినవే. అవి 15 వ శతాబ్దంలో జర్మనీలో మొదలయ్యాయట. మొట్టమొదటి గ్రీటింగ్ కార్డ్ 1477 లో జోహాన్ గుటెన్‌బర్గ్ అనే జర్మనీ ప్రింటర్ తయారు చేసారని చెబుతారు.
1800 వచ్చేసరికి టెక్నాలజీ మరింత పెరిగింది. గ్రీటింగ్ కార్డులు భారీ స్ధాయిలో ముద్రణ అవ్వడం మొదలయ్యాయి. మొట్ట మొదటి క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు 1843 లో ఇంగ్లాండ్‌లో హెన్రీ కోల్ రూపొందించారు. ఈ కార్డులకు సౌత్ అమెరికాలో మంచి గుర్తింపు లభించింది. వాలెంటైన్స్ డే, ఈస్టర్ వంటికి కూడా గ్రీటింగ్స్ ఇచ్చుకుని జరుపుకోవడం మొదలుపెట్టారు.
20 వ శతాబ్దం వచ్చేసరికి గ్రీటింగ్ కార్డులు తయారీ విపరీతంగా పెరిగింది. ప్రత్యేక సందర్భాల్లో తయారైన గ్రీటింగ్స్ మిలియన్ల కొద్దీ అమ్ముడవడం మొదలయ్యాయి. హాల్ మార్క్, అమెరికన్ గ్రీటింగ్స్ కంపెనీలు పాపులర్ అయ్యాయి. గ్రీటింగ్స్ ఇంతలా ప్రజల మనసు దోచుకోవడానికి అనేక కారణాలున్నాయి.
మాటల్లో చెప్పలేని మధురమైన భావాలను గ్రీటింగ్ కార్డ్స్ ఎదుటివారికి చేరవేస్తాయి. లెక్కలేనన్ని గ్రీటింగ్ కార్డులు అందుబాటులో ఉన్నా.. సందర్భానికి తగ్గట్లుగా కార్డుని పిక్ చేసుకుని ఆప్తులకు ఇవ్వడం సంతోషాన్నిస్తుంది. ఇదివరకు రోజుల్లో ఏళ్ల తరబడి స్నేహితులు, బంధువులు పంపిన గ్రీటింగ్ కార్డులను భద్రంగా దాచుకునేవారు.
ప్రతి ఏటా వాటిని తీసి మరల ఒకసారి చూసుకుని మురిసిపోయేవారు. డిజిటల్ కమ్యూనికేషన్ సోషల్ మీడియాకి ఎంతగా అలవాటు పడినా గ్రీటింగ్ కార్డులను ఎవరూ మర్చిపోలేరు. ఇప్పటికి గ్రీటింగ్స్ పంపుకునేవారు ఆన్ లైన్‌లో వాటిని కొనుగోలు చేసి ఆప్తులకు ఇచ్చే అలవాటును మానలేదు. గ్రీటింగ్ కార్డ్స్ పూర్తిగా మరుగున పడిపోకుండా ఉండాలన్నా.. భవిష్యత్తు తరాలకు వీటి గొప్పతనం తెలియాలన్నా గ్రీటింగ్ కార్డ్స్ గురించి వారికి చెప్పండి. సర్ప్రైజ్‌గా పంపించండి.