Telugu Girl : పదహారణాల తెలుగమ్మాయి అని ఎందుకంటారో తెలుసా?

అమ్మాయిలు చక్కని సంప్రదాయ వస్త్రధారణలో, అలంకరణలో కనిపించగానే పదహారణాల ఆడపిల్లలా ఉంది కాంప్లిమెంట్ ఇస్తాం. అసలు పదహారణాల ఆడపిల్ల... అని ఎందుకు అంటారు?

Telugu Girl : పదహారణాల తెలుగమ్మాయి అని ఎందుకంటారో తెలుసా?

Traditional Girl

Traditional Telugu Girl : చక్కని వస్త్రధారణ, అలంకరణతో కనిపించిన ఆడపిల్లని అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉందని, పదహారణాల అమ్మాయిలా ఉందని అంటారు. పదహారణాల తెలుగమ్మాయి.. అని ఎందుకు అంటారో మీకు తెలుసా?

Father and Daughter : ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవిస్తారట

లంగా వోణీ వేసుకుని, కళ్లకు కాటుక పెట్టి, ఆభరణాలతో అలంకరించుకుని.. వాలు జడ.. పూలతో ఆడపిల్లలు కనిపిస్తే పదహారణాల అమ్మాయిలా ఉంది అంటారు. ఎంత చక్కగా ఉందో అని అభినందిస్తాం. ఈ పదహారణాలు అనే పదం ఎందుకు వాడతారో మాత్రం  చాలామందికి తెలియకపోవచ్చు. ఒకప్పుడు మన కరెన్సీ అణాల రూపంలో ఉండేది. ఒక అణా 6.25 పైసలు. చారాణా (చార్, అణా) 4X6.26=25 పైసలు. ఆటాణా (ఆట్, అణా) 8×6.25=50 పైసలు. బారాణా (బారహ్, అణా) 12×6.25=75 పైసలు. ఇక 16 అణాలు అంటే 100 పైసలు. నూటికి నూరు శాతం తెలుగు అమ్మాయిలు సంపూర్ణంగా ఉంటారని చెప్పడానికి సంకేతంగా పదహారణాల అమ్మాయి అని వాడతారు.

Girl inspiring Video : ఆడపిల్లలకు చదువెందుకు? అన్న తండ్రికి కూతురి ధీటైన సమాధానం చూడండి

ఇక ఆడవారు చేసుకునే అలంకారాలు 16. పండ్లు తోముకోవడం దగ్గర్నుంచి నలుగు పెట్టి స్నానం చేయడం, పసుపు రాసుకోవడం, చీర, జాకెట్టు ధరించడం, కాళ్లకు పారాణి పెట్టుకోవడం, జుట్టు దువ్వుకుని జడలో నిండుగా పూలు పెట్టుకోవడం, పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం, నుదుటన బొట్టు పెట్టుకోవడం, చేతులకు గోరింటాకు, తాంబూలం, పెదవులకు ఎర్రటి రంగు, కళ్లకు కాటుక, పెళ్లైన స్త్రీలు మంగళసూత్రం, మెట్టెలు, నల్లపూసలు వేసుకోవడం వంటి 16 అలంకారాలు చేసుకునే ఆడపిల్లలను పదహారణాల అమ్మాయిలు అంటారు.