Lockdown”లాక్‌డౌన్ బోర్‌కొడుతోందా.. ఇంట్లో ఉల్లాసంకోసం ఈ 7 ఐడియాలను ట్రైచేయండి.

నెలఖరువరకు మీరు ఇంట్లోనే. మోడీ తేల్చేశారు. ఇంకా మూడువారాలు. ఖాళీగా ఉండటంకూడా కష్టమేనని ఇప్పుడు చాలామందికి అర్ధమవుతూనే ఉంది. లేవడం, కూర్చోవడ, టీవీచూడటం...మొబైల్...మళ్లీ బెడ్ ఎక్కడం.

Lockdown”లాక్‌డౌన్ బోర్‌కొడుతోందా.. ఇంట్లో ఉల్లాసంకోసం ఈ 7 ఐడియాలను ట్రైచేయండి.

Updated On : January 20, 2022 / 4:05 PM IST

Lockdown:నెలఖరువరకు మీరు ఇంట్లోనే. మోడీ తేల్చేశారు. ఇంకా మూడువారాలు. ఖాళీగా ఉండటంకూడా కష్టమేనని ఇప్పుడు చాలామందికి అర్ధమవుతూనే ఉంది. లేవడం, కూర్చోవడ, టీవీచూడటం…మొబైల్…మళ్లీ బెడ్ ఎక్కడం..రోజులు గడుస్తున్నా… ఈ రొటీన్ మారట్లేదు. మరేం చేయాలి? ఇంట్లోనే కాస్తంత ఉల్లాసం కోసం ఈ ఏడు ట్రిక్స్ ట్రైచేయండి. చేంజ్ రావడం ఖాయం.

Diet Tip Of The Day:
avocado, cold-pressed coconut oil, homemade ghee, fatty fish, nuts, seeds తింటే మెదడు చురుగ్గా ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ లాక్‌డౌన్ టైంలో ఇవెక్కడ దొరుకుతాయని అడగొద్దు. అన్నీకాకకపోయినా కొన్నయినా దొరుకుతాయేమో, ట్రైచేయండి.

Workout Tip Of The Day:
టైం ఉంది. జిమ్ కెళ్లలేం అని బద్ధకించొచ్చు. మీ ఫ్రెండ్స్‌తో కలసి ఛాలెంజ్ పెట్టుకోండి. రోజూ కనీసం ఐదు కిలోమీటర్లయినా నడవాలనుకోండి. ఏదో ఒకటి యాక్టీవిటీకాదు, కరెక్ట్ గా వ్యాయామం చేయకపోతే ఏ మాత్రం ప్రయోజనం ఉండదుకదా!

Game of the Day:
మీకు బాగా నచ్చిన గేమ్ ఆడండి.  PUBG  లాంటివి. ఈ మొబైల్ గేమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కొన్నిసార్లు మొబైల్ గేమ్స్, ఏకాగ్రతను పెంచుతాయి. చురుకుదనం వస్తుంది.

Haircare Tip of the Day:
ఇంట్లోనే ఈజీగా హెయిర్ కేర్ చిట్కాను ప్రయత్నించండి. egg జుట్టుకు చాలా మంచి చిట్కా. మన hair loss ఆపి ధృఢంగా చేస్తుంది.

Movie of the Day:
రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామా సినిమాలు నెట్ఫ్లిక్ లో అందుబాటులో ఉన్నాయి. Crazy Rich Asians లాంటి మూవీస్ చూడండి. Netflix, amazon primeలో ఉన్నాయి.

Series of the Day:
The Crown సీరీస్ చూశారా? క్వీన్ ఎలెజిబిత్ 2 చరిత్రను చూపిస్తుంది. ఇదో హిస్టారికల్ డ్రామా. Netflixలో ఉంది.

Reciepie of the Day:
ఎక్కువ సమయం పట్టకుండా టేస్టీ రెసిపిని క్షణాల్లో తయారు చేయగలం. అదే.. Moong Dal pakora . ఇలాంటి రెసిపీలను ట్రైచేయండి.

Work from Home Tip:
Work from homeలో కాల్, చాట్ చేసేటప్పుడు అటు ఇటు తిరుగుతూ మాట్లాడం అలవాటు చేసుకోండి. ఓకే దగ్గర కూర్చోవడం, పడుకొని పని చేయడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు.

Activity of the Day:
ఇంట్లో బోర్ కొట్టకుండా ఉండాలంటే మీకు నచ్చిన డ్రాయింగ్ గీయవచ్చు. డ్రాయింగ్ బోరింగ్ అనుకొంటే కలర్స్‌తో పెయింటింగ్ వేయొచ్చు.