Men’s Health : మగవాళ్లూ… ఈ టెస్టులు మరువకండి

మగవాళ్లను వేధించే అతి సాధారణ క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ కూడా ముందు వరుసలో ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రొస్టేట్ గ్రంథిలో సమస్యలు రావడం సహజం. యాభయ్యేళ్లు దాటినవాళ్లలకు ప్రొస్టేట్ గ్రంథి వాపు గానీ, ప్రొస్టేట్ క్యాన్సర్ గానీ వచ్చే ప్రమాదాలు ఎక్కువ.

Men’s Health : మగవాళ్లూ… ఈ టెస్టులు మరువకండి

Men's Health

Updated On : July 27, 2023 / 1:09 PM IST

Men’s Health : కొన్ని రకాల జబ్బులు మగవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవచ్చు. ఇటీవలి కాలంలో హార్ట్ ఎటాక్స్ బారిన పడ్డవాళ్లు చాలామంది ఉన్నారు. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి దురలవాట్లు సాధారణంగా మగవాళ్లలో ఎక్కువ. కాబట్టి గుండెజబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ల వంటివి వీళ్లలోనే ఎక్కువ కనిపిస్తుంటాయి. అందుకే ప్రతివాళ్లూ కచ్చితంగా చేయించుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయి.

READ ALSO : Vitamin D Deficiency : విటమిన్ డి లోపంతో గుండెజబ్బులు వస్తాయా ?

ఉద్యోగ ఒత్తిళ్లు కొంత, ఆర్థిక లావాదేవీలు మరికొంత.. ఇలాంటి పనుల్లో బిజీ అయిపోయి, తమ ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తుంటారు. దేశ రాజకీయాలు, సినిమా తారలు, ఇతర సెలబ్రిటీల గురించిన విషయాల పట్ల వహించే శ్రద్ధలో వెయ్యో వంతు తమ ఆరోగ్యం పట్ల పెట్టినా సమస్యలు పెద్దగా కాకుండా నివారించవచ్చు.

బీపీ టెస్ట్

రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటప్పుడు కొంత పీడనంతో ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా లేకపోతే అనేక రకాల సమస్యలు చుట్టుముడతాయి. అధిక రక్తపోటు వల్ల గుండెపోట్లు, స్ట్రోక్ లాంటి సమస్యలన్నీ రక్తపోటు కంట్రోల్ లో లేకుండా పెరగడం వల్లనే.అధిక ఒత్తిడి, పొగతాగడం వంటివి రక్తపోటు పెరగడానికి కారణమవుతాయి. సాధారణంగా అధిక రక్తపోటు సైలెంట్ కిల్లర్ గా ఉంటుంది. అందుకే దీన్ని క్రమం తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలి. ఆహారంలో ఉప్పు తగ్గించి, జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, డాక్టర్ సూచించిన మందులను మానకుండా వాడుకుంటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. రెండేళ్లకు ఒకసారి బీపీ చెక్ చేయించుకుంటే అది కంట్రోల్ లోనే ఉందా లేదా, మందుల మోతాదు ఏమైనా మార్చాల్సి ఉంటుందా అనేది తెలుసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నా సరే చెక్ చేయించుకోవాలి.

READ ALSO : Artificial Sweetener : కృత్రిమ స్వీటెనర్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ? క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి పిల్లలు నివారించాల్సిన ఆహారాలు

కొలెస్ట్రాల్ టెస్ట్

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల గుండెపోట్ల ప్రమాదం ఉంటుంది. అంతేగాక, పక్షవాతం, రక్తనాళాల సమస్యలు కూడా వస్తాయి. అందుకే కొలెస్ట్రాల్ పరీక్ష కోసం లిపిడ్ప్రొఫైల్ టెస్టు చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ లో రెండు రకాలుంటాయి. లో డెన్సిటీ లిపోప్రొటీన్ (ఎల్ డి ఎల్) కొలెస్ట్రాల్ మనకు హాని చేస్తుంది. హై డెన్సిటీ లిపో ప్రోటీన్ (హెచ్ డి ఎల్) కొలెస్ట్రాల్ మంచి చేస్తుంది. కాబట్టి టోటల్ కొలెస్ట్రాల్ తో పాటుగా ఈ రెండింటి విలువలను కూడా టెస్టు చేయించుకోవాలి. ట్రై గ్లిజరైడ్స్ టెస్టు కూడా అవసరం. వీటన్నింటి విలువలు లిపిడ్ప్రొఫైల్ పరీక్ష లో తెలిసిపోతాయి. కొలెస్ట్రాల్ గానీ, ట్రై గ్లిజరైడ్స్ గానీ ఎక్కువ అవుతున్నాయంటేఇమీడియట్ గా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహా మీదట కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడుకోవాలి.

READ ALSO :  Weight Loss: సర్జరీ అవసరమే లేదు.. ఇవి తింటూ సులువుగా బరువు తగ్గించుకోండి!

ప్రొస్టేట్ స్పెసిఫిక్యాంటీజెన్ టెస్ట్

మగవాళ్లను వేధించే అతి సాధారణ క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ కూడా ముందు వరుసలో ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రొస్టేట్ గ్రంథిలో సమస్యలు రావడం సహజం. యాభయ్యేళ్లు దాటినవాళ్లలకు ప్రొస్టేట్ గ్రంథి వాపు గానీ, ప్రొస్టేట్ క్యాన్సర్ గానీ వచ్చే ప్రమాదాలు ఎక్కువ. అందుకే ఈ వయసు వాళ్లు ప్రొస్టేట్ క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవాలి. ఇందుకోసం మొట్టమొదట చేసే పరీక్ష పి ఎస్ ఎ అంటే ప్రొస్టేట్ స్పెసిఫిక్యాంటిజెన్ టెస్ట్. ఇది ఒక రక్త పరీక్ష. ఇదే కాకుండా డిఆర్ఈ టెస్టు కూడా చేస్తారు. ప్రొస్టేట్ గ్రంథిలో ఏ రకమైన సమస్య ఉన్నా ఈ టెస్టుల ద్వారా తెలిసిపోతుంది.

READ ALSO : Alzheimer’s Disease : అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించే రోజువారీ శ్వాస వ్యాయామాలు ?

కొలనోస్కోపీ

కోలన్ అంటే పెద్ద పేగులో ఏమైనా సమస్యలుంటే గుర్తించడానికి చేసే పరీక్ష కొలనోస్కోపీ. అంతేగాకుండా కోలొరెక్టల్ క్యాన్సర్ ను గుర్తించడానికి కూడా కొలనోస్కోపీ ఉపయోగపడుతుంది. మలంలో రక్తం పడుతుంటే అస్సలు అశ్రద్ధ చేయొద్దు. కోలొరెక్టల్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఇలాంటి లక్షణం కనిపించొచ్చు. ముఖ్యంగా పెద్ద వయసు వాళ్లలో ఇలాంటి సమస్య కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. కోలొరెక్టల్ క్యాన్సర్ ను గుర్తించడానికి మల పరీక్ష (ఎఫ్ఒబిటి) లేదా మల డిఎన్ఎ పరీక్ష, కొలనోస్కోపీ చేస్తారు. పెద్దపేగులో పాలిప్స్ ఉన్నా కూడా కొలనోస్కోపీలో తెలిసిపోతుంది.