Oranges : శరీరానికి మేలు చేసే నారింజ!
నారింజలో యాంటీ వైరల్, యాంటీ మైక్రోబల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు సహాయపడతాయి. శీతాకాలంలో పాటు అన్ని సీజన్లలో లభించే నారింజ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి.

Oranges
Oranges : నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్, విటమిన్ ఎ, బి, ఫైబర్, అమైనో అమ్లాలు, ఉన్నాయి. వేసవి కాలంలో శరీరానికి అవసరమైన నీటిని అందిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా నారింజ పండ్లను తీసుకోవడం వల్ల వేసవిలో ఎండల వల్ల వచ్చే సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గిన సమయంలో నారింజను తీసుకుంటే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. నారింజఅధిక రక్తపోటును నివారిస్తుంది.
నారింజ సులభంగా జీర్ణ అవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి నారింజ చాలా ప్రభావవంతంగా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకుంటే, నారింజను ఆహారంలో చేర్చుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. సులభంగా బరువు తగ్గవచ్చు. నారింజలో ఉండే విటమిన్ సి మీ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడుతున్నవారు నారింజ జ్యూస్ తీసుకోవటం వల్ల ఫలితం ఉంటుంది. జలుబు, దగ్గు మరియు కపం వంటి సమస్యలను తొలగిస్తుంది. చర్మ ఆరోగ్యానికి చాలా మంచి ఫలంగా నిపుణులు సూచిస్తున్నారు. గౌట్ రోగులకు శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గించటంలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారించటంతోపాటు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. వాత, కఫం, అజీర్ణాలను హరిస్తుంది. మెదడు చురుకుగా ఉండేలా చూస్తుంది.
నారింజలో యాంటీ వైరల్, యాంటీ మైక్రోబల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు సహాయపడతాయి. శీతాకాలంలో పాటు అన్ని సీజన్లలో లభించే నారింజ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కళ్ళు, ఎముకల ఆరోగ్యానికి మేలు చేయటంతోపాటు కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గిస్తుంది. పేగులో వచ్చే క్యాన్సర్లను నిరోధిస్తుంది. నారింజలో విటమిన్ బీ కాంప్లెక్స్ ఎక్కువగా లభిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. శరీరంలో సెరోటిన్ , ఇన్సులిన్ స్ధాయిలను క్రమబద్దం చేసే ఇనోసిటాల్ అనే పదార్ధం నారింజలో ఉంది. మానసిక ప్రశాంతతను చేకూర్చటంలోనూ దోహదపడుతుది. క్రుంగుబాటు, నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. కొవ్వు పదార్ధాలను కరిగించటంలో రక్తంలో కొవ్వును తగ్గించడంలో తోడ్పడుతుంది.