IPC Section 420 : మోసం చేసేవాళ్లను 420 అని ఎందుకంటారో తెలుసా?
మనల్ని ఎవరైనా మోసం చేసే 420 అనేస్తాం. కానీ ఆ నంబర్ ఎందుకు ఉపయోగిస్తాం. చాలామందికి తెలియకపోవచ్చు.

IPC Section 420
IPC Section 420 : ఎవరైనా మోసం చేసే వాళ్లను పక్కా 420 అంటాం. వాడుకలో ఈ నంబర్ ఉపయోగిస్తాం.. సరే.. ఆ నంబర్‌నే ఎందుకు అంటాం.. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.
Tamil Nadu : 11 ఏళ్లుగా 144 సెక్షన్ అమలువున్న ఆ గ్రామం.. ఎక్కడంటే?
మోసం లేదా మోసగాళ్లను 420 అనేస్తాం. దీనికి మూలం చాలామందికి తెలియకపోవచ్చును ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 420. దీని ప్రకారం ఎవరైనా నేరం చేస్తే వారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. లేదా జరిమానా విధించే అకాశం కూడా ఉంటుంది. ఈ విధంగానే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కూడా అమలులో ఉంది. ఎందుకంటే ఈ దేశాల శిక్షాస్మృతి బ్రిటీష్ ఇండియా వలస ప్రభుత్వంతో స్ధాపించబడిన భారతీయ శిక్షాస్మృతి నుండి అమలు అయ్యింది.
420 మోసం అంటే కొంతమంది ఇతరుల ఆస్తులు లాక్కోవడానికి చాలా ఇబ్బంది పెడతారు. ఒత్తిడి చేసి మరీ లాక్కుంటారు. ఇక కొందరు తమకు ప్రయోజనం చేకూరుతోంది అంటే చాలు ఫోర్జరీలు చేయడానికి కూడా సిద్ధం అవుతారు. ఆస్తులు లాక్కున్నప్పుడు నకిలీ సంతకాలు కూడా చేస్తారు. ఇవన్నీ కూడా సెక్షన్ 420 క్రిందకే వస్తాయి. నేరం చేసిన వ్యక్తిపై మొదట ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. విచారణ జరిపిన అనంతరం సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడితే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది.
ఇక 420 నంబర్‌తో చాలా భాషల్లో సినిమాలు కూడా వచ్చాయి. చాచీ 420, శ్రీ 420 రెండు బాలీవుడ్ సినిమాలు హిట్ అయ్యాయి. అయితే సినిమాలో చూపించే నేరం ఎంటర్టైన్‌మెంట్ కోణంలోకి వస్తుంది. అంత సీరియస్‌నెస్ ఉండదు. నిజ జీవితంలో నేరం చేసిన వ్యక్తులు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది.