Lasting Immunity : ఫైజర్, మోడెర్నా టీకాలు జీవితకాలం ఇమ్యూనిటీని అందించగలవు!

ఫైజర్-బయోఎంటెక్, మోడెర్నా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లు శరీరంలో నిరంతర రోగనిరోధక శక్తిని ప్రేరేపించే అవకాశం ఉందని ఓ కొత్త అధ్యయనం తేలింది. MRNA వ్యాక్సిన్లతో రోగనిరోధక శక్తి పొందిన చాలా మందికి బూస్టర్లు అవసరం లేదని పరిశోధనలు సూచిస్తున్నాయి.

Lasting Immunity : ఫైజర్, మోడెర్నా టీకాలు జీవితకాలం ఇమ్యూనిటీని అందించగలవు!

Pfizer And Moderna Vaccines

Updated On : June 29, 2021 / 7:26 AM IST

Pfizer and Moderna Vaccines Produce Lasting Immunity : ఫైజర్-బయోఎంటెక్, మోడెర్నా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లు శరీరంలో నిరంతర రోగనిరోధక శక్తిని ప్రేరేపించే అవకాశం ఉందని ఓ కొత్త అధ్యయనం తేలింది. కరోనా నుంచి ఏళ్ల తరబడి రోగనిరోధక వ్యవస్థను రక్షించుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. MRNA వ్యాక్సిన్లతో రోగనిరోధక శక్తి పొందిన చాలా మందికి బూస్టర్లు అవసరం లేదని పరిశోధనలు సూచిస్తున్నాయి. వైరస్, వేరియంట్లు అధిక స్థాయిలో మ్యుటేట్ చెందవని, కొంతకాలానికి అగిపోతాయని అంటున్నారు. కొవిడ్ -19 నుండి కోలుకున్న వ్యక్తులకు టీకా వేయడానికి ముందు బూస్టర్లు అవసరం లేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ టీకా ద్వారా రోగనిరోధక శక్తి దీర్ఘకాలం ఉంటుందనేది మంచి సంకేతమని సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ఇమ్యునోలజిస్ట్ అలీ ఎలెబెడి అన్నారు. ఈ అధ్యయనానికి ఆయన నేతృత్వం వహించారు.

ఈ అధ్యయనంలో జాన్సన్ & జాన్సన్ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్‌ను పరిగణించలేదన్నారు. రోగనిరోధకత mRNA టీకాల ద్వారా కంటే చాలా తక్కువ ఉందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. గత నెలలో కొవిడ్ -19 నుండి కోలుకున్న బాధితుల్లో గుర్తించిన రోగనిరోధక కణాలు ఎముక మజ్జలో కనీసం ఎనిమిది నెలలు ఉంటాయని తెలిపారు. మరో అధ్యయనం ప్రకారం.. మెమరీ-బి కణాలుగా పిలిచే వాటి వ్యాప్తి తర్వాత కనీసం ఒక ఏడాది వరకు బలంగా మారుతాయని అంటున్నారు. అందుకే కరోనా బారిన పడిన తరువాత టీకాలు వేసిన వ్యక్తులలో రోగనిరోధక శక్తి ఏళ్లు తరబడి అంటే.. బహుశా జీవితకాలం ఉండవచ్చు అని పరిశోధకులు సూచించారు. టీకాలు వేయడం వల్లే ఇమ్యూనిటీని దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుందా అనేది క్లారిటీ లేదు.

కరోనావైరస్ సోకిన తరువాత, జెర్మినల్ సెంటర్ ఊపిరితిత్తులలో ఏర్పడుతుందని డాక్టర్ ఎలెబెడి అంటున్నారు. ఆయన సహచరులతో కలిసి 41 మందిపై అధ్యయనం చేశారు. కరోనావైరస్ బారినపడి కోలుకున్నవారిని ఎనిమిది మందిపై అధ్యయనం చేయగా.. ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్ రెండు మోతాదులతో రోగనిరోధక శక్తిని పొందారు. ఈ 14 మంది వ్యక్తుల నుంచి బృందం మొదటి మోతాదు తర్వాత మూడు, నాలుగు, ఐదు, ఏడు నుంచి 15 వారాలలో వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. టీకా మొదటి మోతాదు తర్వాత 15 వారాల్లో.. ఆ 14 మందిలోనూ జెర్మినల్ సెంటర్ ఇప్పటికీ చాలా యాక్టివ్‌గానే ఉందని గుర్తించారు. కరోనావైరస్‌ను గుర్తించిన మెమరీ కణాల సంఖ్య తగ్గలేదని డాక్టర్ ఎలెబెడి బృందం పేర్కొంది. రోగనిరోధకత తర్వాత ఒకటి నుంచి రెండు వారాల వరకు జెర్మినల్ కేంద్రాలు గరిష్టంగా ఉంటాయని, ఆ తరువాత క్షీణిస్తాయని చెప్పారు.