Piles Problem : ఫైల్స్ సమస్యా? తీసుకునే ఆహారంలో!

వ్యాధితో బాధపడే వాళ్ళు తమ ఆహారం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. పైల్స్ లక్షణాలు కనిపిస్తున్నాయంటే ముందుగా ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఫ్రెంచ్ ఫ్రైలు, వేయించిన సమోసాలు,డీప్ ఫ్రైలు, ఫాస్ట్ ఫుడ్స్, నూనె, మసాలాలు, నూడిల్స్, బర్గర్స్, పిజ్జాలు వంటి ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.

Piles Problem : ఫైల్స్ సమస్యా? తీసుకునే ఆహారంలో!

Piles

Updated On : July 18, 2022 / 12:01 PM IST

Piles Problem : జీవన శైలి, ఆహారపు అలవాట్లు వల్ల చాలా మందిలో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవలి కాలంలో పైల్స్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. సుదీర్ఘమైన మలబద్ధకం, ఊబకాయం, గంటల తరబడి కూర్చోవడం లేదంటే నిలబడటం వల్ల ఈ పైల్స్ వ్యాధి వస్తుంది. మలబద్ధకం వల్ల పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ ఏర్పడతాయి. పైల్స్ సమస్య ఉన్నవారిలో పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో మల విసర్జన సాఫీగా జరుగదు. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, మంట వుంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతుంది. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉంటుంది. విరోచనం కాకపోవడం వీరికి బాధ కలిగిస్తుంది. సుఖ విరోచనం కాకపోవడంతో చిరాకుగా, కోపంగా ఉండటాన్ని గమనించవచ్చు. జీవనశైలి, ఆహారం, నడవడికలో మార్పులు చేసుకుంటే కొంత వరకు సమస్య నుండి బయటపడవచ్చు.

వ్యాధితో బాధపడే వాళ్ళు తమ ఆహారం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. పైల్స్ లక్షణాలు కనిపిస్తున్నాయంటే ముందుగా ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఫ్రెంచ్ ఫ్రైలు, వేయించిన సమోసాలు,డీప్ ఫ్రైలు, ఫాస్ట్ ఫుడ్స్, నూనె, మసాలాలు, నూడిల్స్, బర్గర్స్, పిజ్జాలు వంటి ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. వీటిని తినడం వలన జీర్ణవ్యవస్థ అనేది బలహీనపడిపోతుంది. ఫలితంగా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. పైల్స్ ఉన్నవారు వైట్ బ్రెడ్ తీసుకోవడం మానేయాలి. వైట్ బ్రెడ్ తినడం వలన మలబద్ధకం సమస్య పెరుగుతుంది. శుద్ధి చేసిన పిండితో తయారుచేసిన వైట్ బ్రెడ్ జీర్ణక్రియకు అవరోధంగా మారుతుంది. టీ, కాఫీలు తాగకూడదు. టీ, కాఫీలు తీసుకోవడం వల్ల పైల్స్ లక్షణాలు తీవ్రమవుతాయి. హెర్బల్ టీ తాగవచ్చు. పైల్స్‌ ఉన్నవారు మత్తు పదార్థాలను తీసుకోవడం మానేయాలి. సిగరెట్ తాగడం , మందు తాగడం,గుట్కాలు, పాన్ పరాక్ లు నమలడం లాంటివి చేయకూడదు.

అంజీర పండు రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే మలబద్ధకం పోయి పైల్స్ వ్యాధి నయమైపోతుంది. పైల్స్ కు ఒక గ్లాసు ముల్లంగి రసం చాలా అద్భుతంగా చేస్తుంది. ముందుగా పావు కప్పుతో ప్రారంభించి, రోజుకూ అరకప్పు రసం వరకు తీసుకోవచ్చు. దానిమ్మ తొక్కను వేసి బాగా ఉడికించి, వడగట్టి రోజుకు ఒకటి రెండు సార్లు తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అల్లం, నిమ్మరసం, తేనె కలిపిన జ్యూస్ ను ప్రతి రోజూ రెండు సార్లు సేవించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే లెగ్యూమ్, అరటి, సిట్రస్ మరియు ఫింగ్ వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. దాంతో పైల్స్ ను నివారించవచ్చు. పచ్చి ఉల్లిపాయను తినడం , జ్యూస్ తాగడం వల్ల రక్తం పడటాన్ని తగ్గించి నొప్పి లేకుండా చేస్తుంది.