Platelets : ప్లేట్ లెట్స్ సహజంగా పెంచుకునేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు!

ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి దానిమ్మ పండు మంచి సహాయకారి. ప్టేట్ లెట్స్ తగ్గినవారు దానిమ్మని తీసుకుంటే త్వరితగతిన పెంచుకోవచ్చు. ఐరన్ అధికంగా ఉన్నపండ్లలో మరొకటి ఆప్రికాట్.. రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెరుగుతాయి.

Platelets : ప్లేట్ లెట్స్ సహజంగా పెంచుకునేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు!

Platelets

Updated On : June 13, 2022 / 1:20 PM IST

Platelets : రక్తంలో ప్లేట్ లెట్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. వీటి సంఖ్య తగ్గితే మనిషి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. సహజంగా డెంగ్యూవంటి జబ్బుల్లో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది. ఈ సమయంలో ఏమాత్రం నిరక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాపాయస్ధితికి చేరుకుంటారు. గాయం అయిన సందర్భంలో రక్తం త్వరగా గడ్డకట్టేందుకు , తొందరగా మానేలా ప్లేట్ లెట్స్ ఉపయోగపడుతాయి. వీటి సంఖ్య తగ్గినప్పుడు మనిషికి నీరసం, బీపీ ,జ్వరం వస్తుంది. ప్లేట్ లెట్స్ తగ్గకుండా చూసుకోవాలి. సాధారణంగా మన రక్తంలో 1,50.000 నుండి 4.50.000 వరకు ప్లేట్ లెట్స్ ఉంటాయి. శరీరంలో ఈ ప్లేట్ లెట్స్ జీవితకాలం 5 నుంచి 9 రోజులు ఉంటుంది.

మన రక్త కణాల్లో అతి చిన్నదైన ప్లేట్‌లెట్స్‌ను మైక్రోస్కోప్‌లో మాత్రమే చూడగలరు. అవి యాక్టివ్ కాని రూపంలో,చిన్న పలకల ఆకారంలో ఉంటాయి. రక్తనాళం దెబ్బతిన్నప్పుడు ఒక సంకేతాన్ని పంపుతుంది. ప్లేట్‌లెట్‌లు ఆ సిగ్నల్‌ను స్వీకరించినప్పుడు, అవి ఆ ప్రాంతానికి ప్రయాణించడం ద్వారా ప్రతిస్పందిస్తాయి. దెబ్బతిన్న రక్తనాళంతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి, ప్లేట్‌లెట్‌లు రక్షణగా నిలుస్తాయి.

సహజంగా ప్లేట్ లెట్స్ పెరగాలంటే ;

ప్లేట్ లెట్స్ తక్కువగా ఉంటే బొప్పాయి తీసుకోవడం మంచిది. ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గినప్పుడు వాటి సంఖ్యను పెంచుకోవడానికి బొప్పాయి, వాటి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. అతిస్వల్ప మోతాదులో బొప్పాయి ఆకు రసాన్ని తాగితే ప్లేట్ లెట్స్ సంఖ్యను పెంచుకోవచ్చు. వెల్లుల్లిలో సహజంగా ప్లేట్ట్ లెట్స్ అభివృద్ధి చేసే గుణం ఉంది. తినే ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే ప్లేట్ లెట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోవచ్చు. శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు.. విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది. ఆకుకూరలు రోగనిరోధక శక్తిని పెంపొందించటంతోపాటు ప్లేట్ లెట్స్ సంఖ్యను పెరిగేలా చేస్తాయి.

ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి దానిమ్మ పండు మంచి సహాయకారి. ప్టేట్ లెట్స్ తగ్గినవారు దానిమ్మని తీసుకుంటే త్వరితగతిన పెంచుకోవచ్చు. ఐరన్ అధికంగా ఉన్నపండ్లలో మరొకటి ఆప్రికాట్. రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెరుగుతాయి. ఎండు ఖర్జూరంలో ఐరన్ తో పాటు పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అంతేకాదు.. ఎండు ఖర్జురంలో ప్లేట్లెట్స్ మెరుగుపరిచే గుణాలు అధికంగా ఉన్నాయి. రోజూ గుప్పెడు ఎండు ద్రాక్షతింటే సహజంగా ప్లేట్లెట్ లెవల్స్ ను పెరుగుతాయి. క్యారెట్ కూడా ప్లేట్ లెట్స్ పెంచడంలో సహాయపడుతోంది. కనుక ఈ సీజన్ లో క్యారెట్ ను వారంలో కనీసం రెండు సార్లైనా తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రక్తహీనతతో బాధపడే వారు తప్పనిసరిగా తినే ఆహారంలో బీట్ రూట్ ను తీసుకుంటే ప్లేట్ లెట్స్ సంఖ్యను సహజంగానే పెంచుకోవచ్చు.