Pomegranate Juice : 15నిమిషాల్లోనే షుగర్ లెవల్స్ తగ్గించే దానిమ్మ జ్యూస్
దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి . అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సి

Pomegranate Juice
Pomegranate Juice : ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని 15 నిమిషాల్లో తగ్గించవచ్చని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. డయాబెటిక్ పేషెంట్లను రెండు గ్రూపులుగా విభజించి, వారిలో ఒక గ్రూప్‌కు 230 మిల్లీలీటర్ల చక్కెర నీళ్లు, మరో గ్రూప్‌కు 230 మిల్లీలీటర్ల దానిమ్మ జ్యూస్ ఇచ్చారు. దానిమ్మ జ్యూస్ శరీరంలో గ్లూకోజ్‌ను తగ్గించడాన్ని పరిశోధకులు గమనించారు. దానిమ్మ జ్యూస్ తీసుకున్న వారిలో 15 నిమిషాల వ్యవధిలోనే షుగర్ లెవల్స్ తగ్గిపోగా, చక్కెర నీళ్లు తీసుకున్న వారి షుగర్ లెవల్స్‌లో ఎలాంటి తగ్గుదల కనిపించలేదు.
దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి . అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు దానిమ్మలో ఉంటాయి. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్, వక్షోజ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిస్ లేదా ఫ్రీ రాడికల్స్‌వల్ల కలిగే వ్యాధులతో పోరాడతాయి. దానిమ్మ గింజలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయని కూడా నిపుణులు చెప్పారు. అందుకే ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రత్యేకమైన, ప్రయోజనకరమైనని చెబుతున్నారు.
అధికరక్తపోటుతో బాధపడు తున్నా లేక ట్రైగ్లిసరైడ్స్ 100 దాటి వున్నా లేదా గుండెను కాపాడే హెచ్.డి.ఎల్. కొలెస్టిరాల్ 50 కన్నా తక్కువగా ఉన్నా… వారంలో ఒకసారి గ్లాసు దానిమ్మరసము తాగడము మంచిది. గుండెజబ్బులున్నవారికి మేలు చేస్తుంది . మూత్రపిండాల సమస్యలున్నవారికి బాధలను నివారిస్తుంది. దానిమ్మ జ్యూస్ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. దానిమ్మలో చాలా తక్కువ మొత్తంలో పిండి పదార్థాలుంటాయి. 100 గ్రాముల దానిమ్మలో పిండిపదార్థాలు కేవలం 19 శాతం మాత్రమే. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే దానిమ్మపండు మధుమేహులకు చాలా ప్రయోజనకరమైన పండు.