Prevent Hair Loss : వర్షాకాలం జుట్టు రాలకుండా ఉండాలంటే ?
హెయిర్ కేర్ అనగానేషాంపూలూ, నూనెల కన్నా ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. ఎన్ని రకాల నూనెలూ, షాంపూలూ వాడినా పోషకాహారం తీసుకోకుంటే జుట్టు రాలడం ఆగదు. జుట్టు ఆరోగ్యం కోసం గుడ్డులోని తెల్లసొన, లీన్ మీట్, చిరుధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, బీన్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.

prevent hair loss
Prevent Hair Loss : జుట్టు రాలడం.. ఇప్పుడు ప్రతి ఒక్కరి సమస్య. దీనికి జెండర్ తేడా కూడా లేదు. ఎవరిని కదిలించినా ముప్పయి దాటలేదు.. జుట్టు బాగా రాలిపోతున్నదనేకంప్లెయింట్ చేస్తుంటారు. ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి. ఈ వర్షాల్లో అంటు వ్యాధులే కాదు.. జుట్టు రాలే సమస్యలు కూడా ఎక్కువే.
READ ALSO : Coffee and Tea : పిల్లలకు కాఫీ, టీ ఇస్తున్నారా… అయితే ఇది తప్పక చదవండి
మరి దీనికి పరిష్కారం..?
సాధారణంగా ఎండాకాలంలో చెమటకి కొంత, ఎండకి కొంత జుట్టు రాలిపోతుందని అనుకుంటాం. కానీ సీజన్ ఏదయినా సరైన కేర్ తీసుకోకపోతే జుట్టు రాలిపోవడం ఖాయం. వర్షాకాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగానే కనిపిస్తాయి. కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే జుట్టును కాపాడుకోవచ్చు.
సీజన్ మారినప్పుడు మన శరీరం కూడా అందుకు అనుగుణంగా మార్పులు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇదొక ఎత్తయితే వానలో తడవడం మరొక కారణం. వర్షంలో జుట్టు తడవడమే ఒక సమస్య అంటే.. ఈ చల్లని వాతావరణంలో తడిసిన జుట్టు ఆరడం ఇంకో సమస్య. ఇలా ఎక్కువ సేపు జుట్టు ఆరకుండా ఉండటం వల్ల దానికి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
READ ALSO : Hat Cause Hair Loss : క్యాప్ పెట్టుకుంటే జుట్టు రాలిపోవడం నిజమేనా?
ఏ నూనె మంచిదంటే…
తలకు నూనె తప్పనిసరిగా రాయాలి. అయితే నూనెను వేడి చేయడం మరవొద్దు. వేడి నూనెను తలకు బాగా పట్టించాలి. కుదుళ్ల దగ్గర నూనె బాగా ఇంకేలా చూడాలి. అప్పుడు జుట్టు మూలాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దానివల్ల జుట్టుకు సరైన పోషణ అంది ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా వారానికి రెండు సార్లయినా వేడి నూనెతో మసాజ్ చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. అయితే తలస్నానం చేసిన తర్వాత కాకుండా, షాంపూ చేయడానికి ఓ రెండు గంటల ముందే ఇలా వేడి నూనె బాగా పట్టించి మసాజ్ చేయాలి. ఆ తర్వాత తేలిక పాటిషాంపూతో తలస్నానం చేయాలి.
కండిషనర్ చాలా ముఖ్యం
చాలామంది షాంపూ చేసి వదిలేస్తారు. కానీ కండిషనర్ వాడటం కూడా అవసరమే. ఇది జుట్టును మాయిశ్చరైజర్ చేయడానికి సహాయపడుతుంది. స్కిన్ అయినా, హెయిర్ అయినా ఆరోగ్యంగా పెరగాలంటే మాయిశ్చరైజర్ చాలా అవసరం. దీనివల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. డ్రై అయితే జుట్టు సులువుగా చిట్లిపోతుంది. ఇది నివారించాలంటే కండిషనర్ వాడటం మంచిది.
READ ALSO : Effects of Smoking : చర్మం, జుట్టు , కంటి ఆరోగ్యంపై ధూమపానం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ?
మాయిశ్చరైజర్ చేయడం వల్ల జుట్టు బాగా ఒత్తుగా కూడా పెరుగుతుంది. అందుకే మీకు సరిపోయే సరైన కండిషనర్ ను వాడటం అవసరం. మీకు జుట్టు రాలుతుంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించి, మీకు సరిపోయే సరైన షాంపూ, కండిషనర్లను ఎంచుకోవాలి. కండిషనర్ వాడటం వల్ల జుట్టు కుదుళ్లలో పొడిబారడం తగ్గడమే కాకుండా, చుండ్రు కూడా తగ్గుతుంది.
ఒత్తయిన జుట్టుకి ఆహారం
హెయిర్ కేర్ అనగానేషాంపూలూ, నూనెల కన్నా ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. ఎన్ని రకాల నూనెలూ, షాంపూలూ వాడినా పోషకాహారం తీసుకోకుంటే జుట్టు రాలడం ఆగదు. జుట్టు ఆరోగ్యం కోసం గుడ్డులోని తెల్లసొన, లీన్ మీట్, చిరుధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, బీన్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ బి12, ఐరన్, జింక్ సరిపడా అందేలా ఆహారాన్ని తీసుకోవాలి. నీళ్లు తాగడం కూడా చాలా ఇంపార్టెంట్. వర్షాలు, చల్లదనం అని నీళ్లు ఎక్కువగా తాగరు. కానీ ఈ సీజన్ లో కూడా రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి.
READ ALSO : Fenugreek Seeds : వేసవికాలం జుట్టు నిర్జీవంగా మారుతుంటే మెంతులతో ఇలా చేసి చూడండి !
ఇవి పాటించండి
1. జుట్టు కుదుళ్లలో చుండ్రు రాకుండా చూసుకోవాలి.
2. మంచి వాసన ఉందని, రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూలు వాడొద్దు.
3. వర్షాకాలంలో జుట్టు వదులుగా ఉంచుకోండి. గట్టిగా జడ వేయవద్దు.
4. తడిసిన జుట్టు పూర్తిగా ఆరిపోయేవరకు జడ వేయడం, పోనీటెయిల్ కట్టడం చేయొద్దు. ఆరేవరకుజుట్టును అలానే వదిలేయండి.
5. తడిజుట్టును దువ్వి, అప్పుడే చిక్కులు తీసే ప్రయత్నం చేయొద్దు.
6. ఒకరి దువ్వెన ఇంకొకరు వాడకపోవడం మంచిది.
7. హెయిర్ కేర్ లో ఆహారం ఎంత ముఖ్యమూ నిద్ర కూడా అంతే ముఖ్యం. అందుకే టైంకి పడుకోండి.
8. తలస్నానానికి రెండు గంటల ముందు ముల్తానీ మట్టిని జుట్టుకు పట్టించి, ఆ తర్వాత మైల్డ్షాంపూతో తలస్నానం చేయొచ్చు.
9. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు పట్టించి, అరగంట తర్వాత కడిగేస్తే చుండ్రు సమస్య ఉపశమిస్తుంది.
10. ఉల్లిపాయ రసం జుట్టుకు మంచి హెయిర్ కండిషనర్ గా పనిచేస్తుంది. కుదుళ్లను ఇది స్ట్రాంగ్ చేస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. దీన్ని కూడా అప్పుడప్పుడు జుట్టుకు అప్లై చేయొచ్చు. గుడ్డులోని తెల్ల సొనను కూడా కండిషనర్ గా వాడొచ్చు.