Weight-Loss Device : ఇదో సరికొత్త డివైజ్.. బరువు తగ్గాలంటే.. నోటికి తాళం వేస్తుంది..!
బరువు తగ్గేందుకు ఎన్నో డైట్ విధానాలు ఉన్నాయి. కానీ, మొట్టమొదటిసారిగా సైంటిస్టులు బరువు తగ్గే సరికొత్త డివైజ్ కనుగొన్నారు. అదే.. వెయిట్ లాస్ డివైజ్ (Weight Loss Device) టూల్. ఈ టూల్ ద్వారా నోటి దవడ జాయింట్లను లాక్ చేయొచ్చు.

Scientists Develop Weight Loss Device That Locks People’s Jaws Shut
world-first weight-loss device : బరువు తగ్గేందుకు ఎన్నో డైట్ విధానాలు ఉన్నాయి. కానీ, మొట్టమొదటిసారిగా సైంటిస్టులు బరువు తగ్గే సరికొత్త డివైజ్ కనుగొన్నారు. అదే.. వెయిట్ లాస్ డివైజ్ (Weight Loss Device) టూల్. ఈ టూల్ ద్వారా నోటి దవడ జాయింట్లను లాక్ చేయొచ్చు. అతిగా తినేయకుండా ఇలా కంట్రోల్ చేయొచ్చునని అంటున్నారు. కేవలం లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకునేంతగా గ్యాప్ ఉంటుంది. నోరు తెరవాలంటే 2 మిల్లిమీటర్లు (0.079) పైగా మాత్రమే తెరుచుకుంటుంది. అయితే ఈ వెయిట్ లాస్ డివైజ్ విషయంలో కొందరు ట్విట్టర్ యూజర్లు ఫైర్ అవుతున్నారు.
ఇదో రకమైన medieval torture device అంటూ కామెంట్లు చేస్తున్నారు. పైదవడ, కింది దవడలను కలిపి క్లాంపింగ్ చేసేలా (jaw-clamping device) ఉంటుంది. అందుకే దీన్ని DentalSlim Diet Control అని పిలుస్తారు. ఇందులోని మ్యాగ్నేట్స్ ద్వారా రెండు దవడలను దగ్గరగా అటాచ్ అయ్యేలా చేస్తుంది. అత్యవససర పరిస్థితుల్లో మాత్రమే ఈ డివైజ్ ఓపెన్ చేయడానికి వీలుంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఈ డివైజ్ ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు సైంటిస్టులు. తక్కువ కేలరీలు కలిగిన లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకునేలా యూజర్లను ఈ టూల్ ప్రోత్సహిస్తుంది. న్యూజిలాండ్‌లోని University of Otagoకు చెందిన రీసెర్చర్లు దీన్ని క్రియేట్ చేశారు.
అంతేకాదు.. ఊబకాయ పేషెంట్లు ఏడుగురిపై కూడా ఈ డివైజ్ తో అధ్యయనం చేశారు. రెండు వారాల పాటు వారి రెండు దవడల మధ్య పళ్లకు ఈ వెయిట్ లాస్ డివైజ్ క్లాంపింగ్ చేశారు. కేవలం లిక్విడ్ డైట్ మాత్రమే అనుమతించారు. ఈ క్రమంలో అధ్యయనంలో పాల్గొన్నవారంతా సగటున 6.36 కిలోలు (14 పౌండ్లు) బరువు తగ్గినట్టు రీసెర్చర్లు గుర్తించారు. ఈ డివైజ్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవంటున్నారు. పరిశోధన కోసం ట్విట్టర్‌లో రీసెర్చర్లు పోస్ట్ చేయడంతో డివైజ్ పై యూజర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రొఫెసర్ల వేళ్లను కలిపి వైరింగ్ చేసేలా ఏమైనా ట్రై చేయండి అంటూ ట్విట్టర్ యూజర్ జోక్ పేల్చాడు. సైన్స్‌లో నీతి బోధించాలి.. ఏదైనా ఔషధం అయితే ఓకే.. ఈ రకమైన టార్చర్ డివైజ్ లు ఎందుకు అంటూ విమర్శించారు.
పరిశోధన ట్విట్టర్‌లో యూజర్ల నుంచి విమర్శలు రావడంతో ఒటాగో యూనివర్శిటీ స్పందించింది.. దీర్ఘకాలిక బరువు తగ్గించే టూల్ కాదిది.. అసలు దీని ఉద్దేశం.. బరువు తగ్గే వరకు సర్జరీ చేయలేని వ్యక్తులకు సాయం చేయడమే ఈ టూల్ లక్ష్యంగా పేర్కొన్నారు. రెండు లేదా మూడు వారాల తరువాత అయస్కాంతాలను తీసి పరికరాన్ని తొలగించవచ్చు. అప్పటివరకూ వారికి పరిమితమైన ఆహారం మాత్రమే ఇస్తారు. బరువు తగ్గిన తర్వాత సర్జరీకి తిరిగి వెళ్లవచ్చు. డైటీషియన్ సలహా మేరకు బరువు తగ్గాలనుకునేవారికి దశలవారీగా ఈ డివైజ్ అందిస్తారు.