Banana : వర్షకాలంలో అరటి పండు తినకూడదా ?

వర్షాకాలంలో అరటిపండు తినడం వల్ల అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఈ పిండి పదార్థాలు ఉన్న ఆహారం తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.

Banana : వర్షకాలంలో అరటి పండు తినకూడదా ?

Banana

Updated On : August 6, 2023 / 11:03 AM IST

Banana : అరటిపండు ఆరోగ్యానికి మేలు చేసే ఉత్తమమైన ఆహారాలలో ఒకటి. ఈ నోరూరించే పండును చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగంగా తీసుకుంటారు. అరటిపండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, అయితే ఈ పండును వర్షాకాలంలో తినటం వల్ల అనేక ఆరోగ్యా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Lavender Tea : లావెండర్‌ టీలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు !

మండుతున్న వేడి నుండి కొంత ఉపశమనం కోసం వర్షకాల సీజన్‌లో ఎంతగానో ఎదురుచూస్తారు. రుతుపవనాలు దానితో పాటు నీటి ద్వారా , గాలిలో వ్యాపించే వ్యాధులను కూడా తీసుకువస్తాయి, ఈ సమయంలో తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. అరటిపండ్లను రెగ్యులర్ గా తినేవారైతే వర్షాకాలంలో అరటిపండ్లు తినడం పూర్తిగా సురక్షితం. ఈ పండు అనేక విధాలుగా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

అమైనో ఆమ్లాలు, విటమిన్ B6, C, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలతో నిండిన ఈ పండును రోజూ తింటే ఆరోగ్యవంతమైన శరీరం, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. మెదడు పనితీరు, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్ట్రోక్స్ ప్రమాదం నివారిస్తుంది. అలాగని అరటిపండ్లను కొన్ని ఆహారాలతో జత చేసి తీసుకోవటం వల్ల అది మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది.

READ ALSO : Twin Bananas : జంట అరటిపండ్లు తింటే కవలపిల్లలు పుడతారా..? వెరీ ఇంట్రస్టింగ్..!

ఆయుర్వేదం ప్రకారం, అరటిపండ్లు ఏ సీజన్‌లోనైనా తినవచ్చు. కానీ అరటిపండ్లను సాయంత్రం, రాత్రి లేదా ఖాళీ కడుపుతో తింటుంటే అది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అజీర్ణం, దగ్గు లేదా ఆస్తమాతో బాధపడేవారు రాత్రిపూట అరటిపండ్లు తినడం మానేయాలి. ఎందుకంటే ఇది కఫ దోషాన్ని తీవ్రతరం చేస్తుంది. శరీరంలో శ్లేష్మం ఏర్పడటానికి దారితీస్తుంది.

వర్షాకాలంలో అరటిపండు తినడం వల్ల అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఈ పిండి పదార్థాలు ఉన్న ఆహారం తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటంతో గుండె ఆరోగ్యానికి బలాన్నిస్తుంది. రక్తపోటుని తగ్గిస్తుంది. అరటిపండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్‌ను తీవ్రతరం చేస్తుంది. విటమిన్ సి ఉండటం వల్ల హైపర్‌యాసిడిటీని కలిగిస్తుంది. అరటిపండ్లు తినడానికి ఉత్తమ సమయం అల్పాహారం సమయంలో లేదా మధ్యాహ్న భోజనంలో బాగం చేసుకోవచ్చు.

READ ALSO : Pawan Kalyan : అరటి పళ్ల స్టోరీ చెప్పిన పవన్..

అరటిపండులో 75 శాతం నీరు ఉంటుంది. దీని వల్ల బాడీ హైట్రేట్ గా మారుతుంది. అరటిలో విటమిన్ బి6, మెగ్నీషియం, పొటాషియంలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ బాడీని హైడ్రేట్ ఉంచుతాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్. ఫ్రీ రాడికల్స్ నుండి చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. ఆయుర్వేద గ్రంధాల ప్రకారం అరటిపండ్లను పాలు లేదా పాల ఆధారిత ఆహారాలతో తీసుకోవడం విషపూరితంగా పరిగణిస్తారు. శరీరంలో కఫా దోషాన్ని కూడా తీవ్రతరం చేస్తుంది.