Sleepless Problem: రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బందిపడుతున్నారా..

రోజంతా ఎంత కష్టపడినా.. రాత్రి ప్రశాంతంగా నిద్రపట్టకపోతే ప్రయోజనముండదు. పైగా ఆ రాత్రి నిద్రలేమి ప్రభావం రెండో రోజు పనిలో స్పష్టంగా కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకూ చిన్నపాటి ఆరోగ్య చిట్కాలు పాటిస్తే హాయిగా, ప్రశాంతమైన నిద్ర మీకు దక్కుతుంది. 

Sleepless Problem: రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బందిపడుతున్నారా..

Lack of sleep

Updated On : June 12, 2022 / 10:28 PM IST

Sleepless Problem: రోజంతా ఎంత కష్టపడినా.. రాత్రి ప్రశాంతంగా నిద్రపట్టకపోతే ప్రయోజనముండదు. పైగా ఆ రాత్రి నిద్రలేమి ప్రభావం రెండో రోజు పనిలో స్పష్టంగా కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకూ చిన్నపాటి ఆరోగ్య చిట్కాలు పాటిస్తే హాయిగా, ప్రశాంతమైన నిద్ర మీకు దక్కుతుంది.

కిడ్నీల్లో రాళ్లు
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది. వీటిలో ఉండే ఆక్సలేట్లు.. క్యాల్షియంను గ్రహించి, రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి.

మలబద్దక సమస్య
రోజూ వంటల్లో గసగసాల్ని వాడడం వల్ల మలబద్దక సమస్య తగ్గుతుంది. ఇది పేగులు బాగా కదిలేలా చేస్తుంది.

నిద్రలేమి సమస్య
రోజూ ఆహారంలో గసగసాల్ని వాడడం వల్ల నిద్రలేమి సమస్య దరిచేరదు. రోజూ పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పొడిని కొద్దిగా వేసుకొని తాగితే చాలు చక్కగా నిద్ర వస్తుంది.

Read Also: నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతున్నారా? ఈ చిట్కాలు పాటించండీ..కంటినిండా నిద్రపోండి..‌!!

శ్వాస సంబంధిత సమస్యలు
శ్వాస సంబంధిత సమస్యలు కూడా గసగసాలతో తొలిగిపోతాయి. అస్తమా, దగ్గు ఉన్న వారికి ఇవి బాగా పనిచేస్తాయి.

గుండె సమస్యలు
గుండె సమస్యలు ఉన్నవారు గసగసాలు లైట్‌గా ఫ్రై చేసి, చక్కెర కలుపుకొని ఉదయం సాయంత్రం, అరచెంచాడు తీసుకుంటే గుండెపనితీరు మెరుగుపడుతుంది.

వేడి ఎక్కువగా ఉంటే
గసగసాలు చలువ చేస్తాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడితే ఉపశమనం పొందొచ్చు. కడుపులో మంట, ఎసిడిటీ ఉన్నవారు గసగసాల్ని వాడితే పేగుల్లో అల్సర్లు, పుండ్ల వంటివి తగ్గుతాయి.