2020లో జరగబోయే మార్పులేంటి? : సోషల్ మీడియాపై నిపుణుల జోస్యం

  • Published By: sreehari ,Published On : December 5, 2019 / 08:26 AM IST
2020లో జరగబోయే మార్పులేంటి? : సోషల్ మీడియాపై నిపుణుల జోస్యం

Updated On : December 5, 2019 / 8:26 AM IST

సోషల్ మీడియా.. పరిచయం అక్కర్లేనిది.. మనుషుల మధ్య సంబంధాలకు స్వస్తి చెప్పి.. సామాజిక మాథ్యమాల్లోనే కాలం వెల్లదీసే డిజిటల్ యుగమిది. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికి ఎంతో సుపరిచితమైన సోషల్ మీడియా.. ప్రతి ఇంటా సందడి చేస్తోంది. కుటుంబంలో తానొకటిగా కలిసిపోయింది. సోషల్ మీడియా అకౌంట్ లేని మనిషే లేడంటే అతిశయోక్తి కాదు.

తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాక ప్రతిఒక్కరూ సోషల్ మీడియాతో అనుబంధాన్ని పెంచేసుకున్నారు. ఏ స్మార్ట్ ఫోన్ చూసినా సోషల్ అకౌంట్లు ఉండాల్సిందే. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్, పింట్ రెస్ట్ వంటి ఎన్నో రకాల సామాజిక మాథ్యమాలతో బంధాలను పెనవేసుకున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు లేదా బంధువులతో మాట్లాడే పరిస్థితి లేదు. ఏదైనా సోషల్ అకౌంట్లలో మాట్లాడు కోవాల్సిందే. సోషల్ మీడియాకు అంతగా అడిక్ట్ అయి పోయారంతా.

2019లోనే ఇలా.. వచ్చే ఏడాదిలో మరెలా? :
ఇంతగా యూజర్లను ఆకట్టుకున్న సోషల్ మీడియాలో రోజురోజుకీ మిలియన్ల కొద్ది కొత్త అకౌంట్లు పుట్టకొస్తున్నాయి. ఎంతో మంది సోషల్ యూజర్లుగా మారిపోతున్నారు. రానున్న రోజుల్లో సోషల్ మీడియా మరింత మెరుగైన స్థితికి చేరుకుంటోంది. ఇప్పటివరకూ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై ఎన్నో విప్లవత్మాక మార్పులను చూస్తున్నాం.

భవిష్యత్తులో మరిన్ని పెనుమార్పులు కూడా జరిగే అవకాశం లేకపోలేదు. 2019లో సోషల్ మీడియా ప్రభంజనం ఎలా ఉంది. రాబోయే 2020లో సోషల్ మీడియా ఎలా మారబోతుంది, ఎలాంటి అద్భుతాలు జరుగబోతున్నాయి అనేదానిపై ముగ్గురు నిపుణులు జోస్యం చెప్పారు. 2020 సోషల్ మీడియా ప్రిడెక్షన్స్ ఇదిగో అంటూ జరగబోయే మార్పులను ముందుగానే సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

TikTok Appదే నేటి ట్రెండ్ :
2020లో సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎలా ఉండబోతోంది అందరిలో ఆసక్తిని రేపుతోంది. దశబ్దాలుగా సోషల్ ప్లాట్ ఫాంల్లో ఫొటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్, పింటెరెస్ట్ సర్వీసులు లాంచ్ చేసినప్పటి నుంచి ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. పర్సనల్ అకౌంట్లు లేదా ప్రొఫెషనల్ సోషల్ మీడియా మార్కెటింగ్ కు ఎన్నో ప్రయోజనాలను అందించాయని అనడంలో సందేహం అక్కర్లేదు. గత కొన్నేళ్ల నుంచి మైక్రో వీడియో యాప్ TikTok సృష్టిస్తున్న ప్రభంజనం అంతాఇంతా కాదు.

సోషల్ మీడియాను శాసించే స్థితికి చేరుకుంది. ఇతర సోషల్ యాప్స్ బీట్ చేసిన TikToK App.. ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. అదే సమయంలో కేంబ్రిడ్జి అనాలిటికా కుంభకోణంలో ఫేస్ బుక్ డేటా ప్రొటెక్షన్ ఉల్లంఘనకు పాల్పడినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

భవిష్యత్తులో సోషల్ మీడియాలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు సంభవిస్తాయో కచ్చితంగా చెప్పలేనప్పటికీ.. 2020లో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, పింటెరెస్ట్ ప్లాట్ ఫాంల నుంచి ఎలాంటి సరికొత్త ట్రెండ్స్ యూజర్లను ఎట్రాక్ట్ చేస్తాయో తెలియాంటే అప్పటివరకూ ఎదురుచూడక తప్పదు. వచ్చే ఏడాదిలో సోషల్ మీడియా ఎలా మారబోతుంది అనేదానిపై కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయిన్సెర్స్, ప్రొఫెషనల్స్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

1. Instagram నుంచి IGTV :
బిజినెస్ కోచ్, సోషల్ మీడియా ప్రొఫెషనల్ జేనాయ్ రోజ్.. మహిళలు ఆన్ లైన్ ఎంటర్ ప్రెన్యూర్స్ గా ఎలా మారాలో రోజ్.. టీచింగ్ చేస్తుంటారు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో 80వేల ఫాలోవర్లు ఉన్నారు. తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ప్రతిరోజు లక్షల మంది మహిళలకు ఆన్ లైన్ బిజినెస్ కు సంబంధించి ఎన్నో సూచనలు చేస్తుంటారు. ఇన్ స్టాగ్రామ్ నుంచి స్టాండ్ అలోన్ వీడియో యాప్ రాబోతుందని ఆమె చెబుతున్నారు.

2020లో సోషల్ మీడియా వీడియో మోడ్ లోకి మారిపోతుందని అంటున్నారు.దీని చుట్టే అంతా కేంద్రీకరించి ఉంటుందని రోజ్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు.. విద్యకు సంబంధించి కంటెంట్ ఎక్కువ మొత్తంలో షేర్ అవుతోంది. దీంతోపాటు అత్యధికంగా వైరల్ వీడియో కంటెంట్, ఫన్నీ కొటేషన్లు లేదా అర్థవంతమైన గ్రాఫిక్స్ కంటెంట్ భారీగా స్ప్రెడ్ అవుతోందని రోజ్ తెలిపారు. ఈ ట్రెండ్‌లో వేగవంతంగా దూసుకెళ్లగలిగేది కేవలం వీడియో కంటెంట్ మాత్రమేనని రోజ్ స్పష్టం చేశారు.

2. సబ్ స్ర్కైబ్, రేట్, పోడ్ క్యాస్ట్స్(more) డౌన్ లోడ్ :
వీడియోల తర్వాత పాపులర్ ట్రెండ్ ఏదంటే? పోడ్ క్యాస్ట్ (Podcasts)గా చెప్పవచ్చు. ఇవొక డిజిటల్ ఆడియో ఫైల్స్. ఎపిసోడ్ సిరీస్ మాదిరిగా ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్లు తమకు నచ్చిన ఎపిసోడ్ డౌన్ లోడ్ చేసుకుని వినవచ్చు. మరిన్ని పోడ్ క్యాస్ట్ కావాలంటే యూజర్లు సబ్ స్ర్కైబ్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. జేనోయ్ రోజ్ కూడా తన సొంతంగా ‘అలైన్ యూవర్ లైఫ్’ పేరుతో వీక్లీ పోడ్ క్యాస్ట్ రన్ చేస్తుంటారు.

పోడ్ క్యాస్ట్ ద్వారా ఈజీగా యూజర్లను ఎట్రాక్ట్ చేసేందుకు ఇదొక ఉన్నతమైన మార్గమని ఆమె తెలిపారు. యూజర్ అటెన్షన్ సుదీర్ఘకాలం పాటు క్రియేట్ చేసే కంటెంట్ ఎంతో యూనిక్ గా ఉండాలంటున్నారు. వ్యూయర్స్, లిజనర్స్ ఆసక్తిపై ఎప్పుడూ ఓ కన్నేసే ఉంచాలని రోజ్ చెబుతున్నారు. అప్పుడే యూజర్లు తమ ప్లాట్ ఫాంపై ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారని రోజ్ అభిప్రాయం.

3. TikTok.. 2020లో అతిపెద్ద సోషల్ ప్లాట్ ఫాం :
వీడియో షేరింగ్ యాప్ TikTok ఇదివరకే సాంకేతికంగా అత్యధిక యూజర్లతో సోషల్ మీడియా ప్లాట్ ఫాంగా అవతరించి ప్రభంజనం సృష్టించింది. చైనీస్ డెవలపర్ ByteDance TikTok యాప్ ను 2016లో లాంచ్ చేసింది. అప్పటి నుంచి అడల్ట్స్, జనరేషన్ Z వరకు అందరిని టిక్ టాక్ ఆకర్షిస్తోంది. ప్రతిఒక్కరూ టిక్ టాక్ జపమే చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 500 మిలియన్ల మంది టిక్ టాక్ యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. ప్రతి రోజు ఒక మిలియన్ (పది లక్షల) వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. 2020లో ఆ తర్వాత కూడా ఇదే స్థాయిలో టిక్ టాక్ దూసుకెళ్లి అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ ఫాంగా అవతరించనుంది. ఈ అకౌంట్లన్నీ తమ బ్రాండ్ వాయిస్ పెంచుకోవడం,ఆడియోన్స్ తో ఎంగేజ్ కావడం, యువ యూజర్లను ఎట్రాక్ట్ చేయడంపైనే ప్రధానంగా దృష్టి పెడుతుంటాయి.

4. influencer భాగస్వామ్యాల్లో మార్పులు :
ఇన్ స్టాగ్రామ్.. తమ ప్లాట్ ఫాంపై Likes తొలగించేందుకు నవంబర్ 2019లో టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. ఈ నిర్ణయం.. సైటు యూజర్లపై మానసిక స్థితి, ఒత్తిడి నుంచి రిలీఫ్ చేసే ప్రయత్నమేనని చెప్పవచ్చు. తద్వారా యూజర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. 

కానీ, సోషల్ మీడియా influencersకు మాత్రం తమ influencer మార్కెటెంగ్ ప్రయత్నాలను తిరిగి వ్యూహారచన చేసుకోవాలని దీని అర్థం. ఇన్ స్టాగ్రామ్ ప్లాట్ ఫాంపై లైక్స్ ఉన్నా లేకపోయినప్పటికీ బ్రాండ్‌లతో influencer భాగస్వామ్యాలు మారిపోతాయని Boutique కంటెంట్ మార్కెటింగ్ ఏజెన్సీ ఫోర్డ్ మీడియా ల్యాబ్ అధ్యక్షుడు రచెల్ ఫోర్డ్ అంచనా వేస్తున్నారు.Adsపై ఎలాంటి ఖర్చు చేయకుండా ఎంగేజ్ మెంట్ డ్రాప్ అయిన బిజినెస్ మార్కెటర్లతో ఫోర్డ్స్ పోల్చారు.

పే-టూ-పే మాదిరిగా influencer భాగస్వామ్యాల పనితీరు కూడా మారే అవకాశం ఉందని ఊహించవచ్చునని అన్నారు. అంటే.. influencer భాగస్వామ్యాలు ముగిసినట్టే అని అర్థం కాదన్నారు. ROI ని ప్రూవ్ చేసుకోవడానికి కంపెనీలు influencer లతో భాగస్వామిగా ఉండటానికి కొత్త, సృజనాత్మక మార్గాలను అన్వేషిస్తాయని భావిస్తున్నామని ఫోర్డ్ చెప్పారు.