Increases Immunity : చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు అనారోగ్యాలను దరిచేరకుండా చేసే స్పైసీ మిల్క్!

శీతాకాలంలో తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లని పదార్ధాలకు కాస్త దూరంగా ఉండటం మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇటు శరీరానికి వెచ్చదనాన్నీ అందించే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

Increases Immunity : చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు అనారోగ్యాలను దరిచేరకుండా చేసే స్పైసీ మిల్క్!

Spicy milk that increases immunity and prevents diseases!

Updated On : October 13, 2022 / 8:25 AM IST

Increases Immunity : వచ్చేది శీతాకాలం. ఈ సమయంలో అనారోగ్య కారకాల ముప్పు పొంచి ఉంటుంది. చల్లని వాతావరణం కారణంగా వీటి వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించటం చాలా మంచిది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో చలి కారణంగా శీతాకాలంలో శ్వాస సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి. చలికాలంలో జలుబు, దగ్గుల ఆస్తమా ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

శీతాకాలంలో తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లని పదార్ధాలకు కాస్త దూరంగా ఉండటం మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇటు శరీరానికి వెచ్చదనాన్నీ అందించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. సీజనల్‌ మార్పుల వల్ల వచ్చే ఫ్లూను దూరం చేసుకోవాలంటే విటమిన్‌ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ కాలంలో అలసట, నీరసం, నిసత్తువలు ఉంటాయి. బాడీ అంత వీక్ అయిపోయి జ్వరం వచ్చినట్లుగా ఉంటుంది. అయితే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా అవసరం.

శీతాకాలంలో అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే స్పైసీ మిల్క్ ఎంతగానో తోడ్పడుతుంది. ఈ డ్రింక్ తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ స్పైసి మిల్క్ తో చలికాలంలో వచ్చే వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చు. పసుపు, మిరియాలపొడి, దాల్చిన చెక్క పొడి, సొంటిపొడితో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ స్పైసీ మిల్క్ చిన్నారులకు మంచి రోగనిరోధక శక్తిని పెంపొందించటంలో సహాయపడుతుంది.

శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే స్పైసీ మిల్క్ తయారీ ;

స్పైసీ మిల్క్ తయారు చేసుకోవడానికి 200మి.లీ నెయ్యి, 300 గ్రాముల పసుపు, 50 గ్రాముల సొంటి పొడి, 25 గ్రాములు మిరియాల పొడి 15 గ్రాముల దాల్చిన చెక్క పొడిని తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసి లో ఫ్లేమ్ లో వేడి చేయాలి. తర్వాత ఇందులో పసుపు వేసి మూడు నిమిషాలు కలుపుతూ ఉండాలి. తరువాత దాల్చినపొడి, సొంటిపొడి, మిరియాల పొడి, వేసుకుని కలుపుకోవాలి. కొద్ది సేపు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిని తరువాత ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రాత్రి సమయంలో నిద్రకు ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని పాలల్లో ఈ మిశ్రమాన్ని కలుపుకుని సేవించాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే ఇమ్మూనిటీ బాగా పెరుగుతుంది. చలికాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.