Cashew Nuts : సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారా!.. ఈ పప్పు తింటే ?

జీడిపప్పును తినే విషయంపై లోతైన పరిశోధనలు సాగించిన స్పెయిన్ శాస్త్రవేత్తలకు ఓ ముఖ్యమైన విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే సంతానలేని వారు జీడిపప్పు తినటం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉన్నట్లు తేల్చారు.

Cashew Nuts : సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారా!.. ఈ పప్పు తింటే ?

Cashew

Updated On : February 18, 2022 / 3:50 PM IST

Cashew Nuts : జీవనశైలిలో మార్పు, ఆహారపు అలవాట్లు, లేటు వయస్సులో వివాహాల కారణంగా చాలా మంది సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారు. పిల్లల కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సంతానం కోసం తహతహలాడుతున్న వారికి శాస్త్రవేత్తలు కొంత ఉపశమనం కలిగించే విషయాన్ని పంచుకున్నారు. సంతనాలేమి సమస్యలకు జీడిపప్పు చక్కని ఔషదమని తేల్చారు.

జీడిపప్పును తినే విషయంపై లోతైన పరిశోధనలు సాగించిన స్పెయిన్ శాస్త్రవేత్తలు ఓ ముఖ్యమైన విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే సంతానలేని వారు జీడిపప్పు తినటం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉన్నట్లు తేల్చారు. జీడిపప్పు తోపాటు, వాల్ నట్స్, పిస్తా వంటివాటిని రోజుకు ఒక గుప్పెడు తినటం వల్ల వీర్యకణాలు వృద్ధి చెందినట్లు నిర్ధారించారు. అంతేకాకుండా వాటి కదలికలు కూడా బాగా ఉన్నట్లు విశ్లేషణలో తేల్చారు. పురుషులలో వీర్యంలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం, వీర్య కణాలు పూర్తిగా లేకపోవడం, వీర్య కణాలలో కదలికలు తగ్గడం, వీర్యకణాల స్వరూపం సరిగా లేకపోవడం మొదలైన లోపాలు నివారించటంలో సైతం జీడిపప్పు దోహదపడుతుందని చెబుతున్నారు.

జీడిపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి సంతానలేమి సమస్యకే కాదు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీడిపప్పులో కాల్షియం, ఐరన్ , జింగ్ , మెగ్నీషియంలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినటం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కడుపు నిండిన భావన వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు జీడిపప్పు తినటం వల్ల మంచి జరుగుతుంది.