Coronavirus : కరోనావైరస్ ఎప్పటికీ మనతోనే.. మహమ్మారితో ఇలా జీవించాల్సిందే!
కరోనావైరస్ ఎప్పటికి పోదు.. మనతోనే ఉంటుంది. ఇకపై భవిష్యత్తు తరాలు కూడా ఈ కరోనా మహమ్మారితో కలిసి సహజీవనం చేయాల్సిందే..

The Coronavirus Is Here Forever. This Is How We Live With It
Coronavirus live with Us : కరోనావైరస్ ఎప్పటికి పోదు.. మనతోనే ఉంటుంది. ఇకపై భవిష్యత్తు తరాలు కూడా ఈ కరోనా మహమ్మారితో కలిసి సహజీవనం చేయాల్సిందే.. కరోనావైరస్‌కు ఒకసారి మానవ రోగనిరోధక వ్యవస్థ అలవాటు పడ్డాక దానికితగినట్టుగా రోగనిరోధకత కూడా పెరిగిపోతుంది. ఎన్నో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా తాత్కాలికంగా మాత్రమే వైరస్ వ్యాప్తి, ప్రభావాన్ని తగ్గించగలం.. కానీ, పూర్తిగా నిర్మూలించలేమనేది తప్పక తెలుసుకోవాల్సిన వాస్తవం. Covid-19 వైరస్ ఇప్పటికే అనేక వేరియంట్లు, మ్యుటేషన్లతో మరింత తీవ్రంగా మారింది. రానున్నరోజుల్లో ఇలాంటి వైరస్ మ్యుటేషన్లు మరెన్నో విజృంభించే పరిస్థితి లేకపోలేదు. కరోనావైరస్ అనేది ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చింది కాదు.. గతంలోనూ కరోనావైరస్ కుటుంబానికి చెందిన ఎన్నో జాతులు మానవాళిపై విజృంభించాయి.
1980వ దశకంలో ఆసుపత్రి వైద్యులు ఉద్దేశపూర్వకంగా 15 మంది వాలంటీర్లకు కరోనావైరస్ సోకేందుకు ప్రయత్నించారట.. అప్పట్లో COVID-19 ఉనికిలో లేదు. అప్పట్లో 229E అనే వైరస్ విజృంభించింది. ఇది కరోనావైరస్ కుటుంబంలో ఒకటిగా గుర్తించారు. ఈ వైరస్ సోకితే సాధారణ జలుబు, జ్వరం వంటి లక్షణాలే కనిపిస్తాయి. మొదటిసారి చిన్నపిల్లల్లో ఈ వైరస్ సోకింది. తొందరగా గుర్తించడం కష్టమే. ఈ వైరస్ పై ప్రయోగంలో భాగంగా కొంతమంది వైద్యులు.. 15 మంది వాలంటీర్ల ముక్కులో 229E వైరస్ స్ప్రేరూపంలో ఇచ్చారు. అయితే కేవలం 10 మంది మాత్రమే ఈ వ్యాధి బారిన పడ్డారు. వారిలో కేవలం ఎనిమిది మందిలో మాత్రమే జలుబు లక్షణాలు కనిపించాయి.
Coronavirus Leak: చైనా ల్యాబ్ నుంచే కరోనావైరస్.. మానవులకు సోకించేందుకు శాస్త్రవేత్తలు పనిచేశారు.. అమెరికా సంచలన రిపోర్ట్..
మరో ఏడాదిలో వైద్యులు ఇదే ప్రయోగాన్ని మళ్లీ చేశారు. మొదటిసారి పాల్గొన్న వాలంటీర్లలో ఒకరు మినహా మిగిలిన వారందరినీ ట్రాక్ చేసారు. వారందరికీ మళ్లీ 229E ముక్కుకి అప్లయ్ చేశారు. ఇంతకు ముందు సోకిన వారిలో ఆరుగురికి మళ్లీ ఈ వ్యాధి సోకింది. కానీ రెండోసారి, ఎవరికీ లక్షణాలు కనిపించలేదు. కరోనావైరస్ రోగనిరోధకత త్వరగా క్షీణిస్తుందని గుర్తించారు. అందుకే మళ్లీ వైరస్ సంక్రమిస్తుందని వైద్యులు కనుగొన్నారు. కానీ తరువాతి ఇన్‌ఫెక్షన్‌లు స్వల్పంగా ఉంటాయని, లక్షణాలు కూడా చాలావరకు కనిపించవని పేర్కొన్నారు. ఒకటి కంటే ఎక్కువసార్లు కరోనావైరస్ సోకే అవకాశం ఉందని తేల్చేశారు.
కరోనా కుటుంబంలో కొవిడ్-19 ఐదవది :
1980-90లలో కరోనావైరస్‌లపై ఈ చిన్న అధ్యయనం అనేక పరిశోధనలకు ప్రోత్సహించింది. 2020లోనూ కొత్త కరోనావైరస్ ఉద్భవించినప్పుడు పరిశోధకులు సైతం దశబ్దాల నాటి పరిశోధనలను మరోసారి అధ్యయనం చేశారు. కరోనాకు మూలాలను వెతికే పనిలో పడ్డారు. సాధారణంగా COVID-19కి కారణమయ్యే SARS-CoV-2 ఆవిర్భావానికి ముందు.. కేవలం నాలుగు కరోనావైరస్‌లు మాత్రమే ఉన్నాయట.. అందులో 229E అనే వైరస్ ఒకటి. ఈ నాలుగు కరోనావైరస్‌లు సాధారణ జలుబుకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడీ ఈ కొత్త కరోనావైరస్ (SARS-CoV-2) ఐదోది. 229E వైరస్ నుంచి జలుబులానే COVID-19 వైరస్ లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పుడు అనేక కొవిడ్ వేరియంట్లు, స్ట్రెయిన్లు మ్యుటేషన్ చెందాయి. లక్షణాల్లో కూడా అనేక మార్పులు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచాన్ని డెల్టా వేరియంట్ వణికిస్తోంది. రానున్న ఏళ్లల్లో ఈ డెల్టా కేసులతో ఇంటెన్సివ్-కేర్ యూనిట్లతో ఆస్పత్రులు నిండిపోయే ప్రమాదం లేకపోలేదు. డెల్టా కరోనా మరణాల సంఖ్య, కేసుల్లో తీవ్రత కనిపిస్తోంది. మళ్లీ వైరస్ తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుకోవడమే సరైన మార్గం. టీకా లేదా ఇన్ఫెక్షన్ టీకా ద్వారా కొంత రోగనిరోధక శక్తిని పొందవచ్చు. అంతే తప్పా కరోనా పూర్తిగా నిర్మూలించలేం.. ఇకపై మన జీవితాలను కరోనాతోనే గడపాల్సిందేనని అంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదంటున్నారు. తద్వారా వైరస్ బారినపడినా ఆసుపత్రిలో చేరే అవకాశాలను తగ్గించుకోవచ్చు.. అలాగే COVID-19 మరణాలు కూడా తగ్గిపోతాయని అంటున్నారు. భవిష్యత్తులో బూస్టర్ వ్యాక్సిన్లు కూడా రోగనిరోధక శక్తిని మరింత పెంచే అవకాశం ఉందని అంటున్నారు.
UK Bats : యూకే గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ఇది మనుషుల్లో వ్యాపిస్తుందా?
కరోనాకు అంతమే లేదా అంటే:
కరోనావైరస్ కు అంతమే లేదా అంటే.. అది మనపైనే ఆధారపడి ఉందంటున్నారు నిపుణులు. కరోనావైరస్ బారినపడకుండా ఉండాలంటే అందుకు తగినవిధంగా జీవించాల్సి ఉంటుంది. ఎప్పటిలానే మాస్క్ ధరించడంతో పాటు సామాజిక దూరం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటివి భవిష్యత్తులోనూ కొనసాగించాలి. కరోనా టీకాలను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వేయించుకోవాలి. ప్రస్తుతానికి చిన్నారులకు కరోనా టీకాలు అందుబాటులోకి రాలేదు. పిల్లలకు కూడా టీకాలు వేయడం వల్ల భవిష్యత్తు తరాలకు కూడా ముందుగానే కరోనా వ్యాప్తిని నియంత్రించడం సాధ్యపడుతుంది.
టీకాలతో తీవ్రమైన అనారోగ్యం, మరణాల నుంచి రక్షిస్తాయి. శ్వాసకోశ వైరస్లపై టీకాలు అరుదుగా పూర్తి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి ఎందుకంటే.. ముక్కులో కంటే ఊపిరితిత్తులలో రోగనిరోధక శక్తిని ప్రేరేపించడంలో బాగా పనిచేస్తాయి. ఫైజర్ మోడెర్నా వ్యాక్సిన్‌లతో 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తాయని పలు అధ్యయనాల్లో రుజువైంది. బీటా, గామా, ఇప్పుడు డెల్టా వంటి కొత్త వేరియంట్లు విజృంభణతో టీకాలతో కొంత రక్షణ తగ్గించాయి. అయిననప్పటికీ టీకాలు తీవ్రమైన అనారోగ్యం నుంచి కాపాడతాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించడం సాధ్యపడుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటున్నారు. కరోనావైరస్ విషయంలో ప్రతిఒక్కరూ మానసికంగా జీవించేందుకు సిద్ధపడాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే కరోనా నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తుందని చెబుతున్నారు.
Covid : కరోనా పుట్టుకపై మాట మార్చిన WHO సైంటిస్ట్.. అప్పుడే అనుమానం వచ్చిందట!