Amla Powder : తెల్లజుట్టును నల్లగా మార్చే ఉసరిపొడి!

ఉసిరి పొడి, కొబ్బరి నూనెల మిశ్రమం చుండ్రు సమస్యను సైతం నివారిస్తుంది. అంతే కాకుండా జుట్టుకు తేమను అందించి మృధువుగా మారేలా చేస్తుంది.

Amla Powder : తెల్లజుట్టును నల్లగా మార్చే ఉసరిపొడి!

Black Hair

Updated On : April 23, 2022 / 3:29 PM IST

Amla Powder : జీవనశైలి, తినే ఆహారంలో మార్పులు, వాతావరణ కాలుష్యం కారణంగా చిన్న వయస్సులోనే చాలా మంది తెల్లజుట్టు సమస్య బాధిస్తోంది. నల్లగా నిగనిగలాడాల్సిన జుట్టు తెల్లగా మారిపోయి నలుగురిలో తిరగలేని పరిస్ధితి నెలకొంటుంది. తొలుత రెండు మూడు తెల్ల వెంట్రుకలతో ప్రారంభమై తరువాత తలమొత్తం తెల్లవెంట్రుకలతో నిండిపోతుంది. హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ , క్యాన్సర్ చికిత్సలో వాడే మందుల ప్రభావం వంటి అనేక కారణాల వల్ల చాలా మందిలో తెల్లజుట్టు సమస్య ఉత్పన్నం అవుతుంది.

మరికొంతమందిలో వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. తెల్లజుట్టుతో బాధపడుతున్నవారు ఎలాంటి రసానాలు వాడకుండానే జట్టును తక్కువ ఖర్చులో నల్లగా మార్చుకోవచ్చు. ఇందుకోసం కొబ్బరి నూనె, ఉసిరి పొడి చక్కగా ఉపకరిస్తాయి. అరకప్పు నూనెలో రెండు చెంచాల ఉసిరి పొడి వేసుకుని సన్నని మటపై నల్లగా అయ్యేంత వరకు మరగనివ్వాలి. చల్లారిన తరువాత ఆమిశ్రమాన్ని వారానికి రెండు సార్లు తలకు రాసుకోవాలి. అనంతరం తలస్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల క్రమేపి తెల్లజుట్టు కాస్తా నల్లగా మారుతుంది.

ఉసిరి పొడి, కొబ్బరి నూనెల మిశ్రమం చుండ్రు సమస్యను సైతం నివారిస్తుంది. అంతే కాకుండా జుట్టుకు తేమను అందించి మృధువుగా మారేలా చేస్తుంది. దెబ్బతిన్న జుట్టును సైతం తిరిగి మెరుగుపరుస్తుంది. ఉసిరిపొడిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు అమ్లాలు జుట్టుకు మేలు చేస్తాయి. కుదుళ్ళు బలంగా మారుతాయి. మెరిసే జుట్టు సొంతమౌతుంది.