Importance of Wearing Bangles : గాజులు ధరించని మహిళలు చాలా ఎమోషనల్‌గా ఉంటారట
ఆడవారు గాజులు ధరించడం అంటే ఇష్టపడతారు. గాజులు వేసుకోకపోవడాన్ని అరిష్టంగా భావిస్తారు. గాజులు వేసుకోని మహిళలు చాలా ఎమోషనల్‌గా ఉంటారట. గాజులు వేసుకోవడం వెనుక అనేక శాస్త్రీయ కోణాలు ఉన్నాయి.

Importance of Wearing Bangles
Importance of Wearing Bangles : ఆడపిల్లలకి రంగు రంగుల గాజులంటే భలే ఇష్టం. పెళ్లి కానివారైనా, పెళ్లిన వారైనా గాజులు ధరిస్తారు. ఆడపిల్లలు చేతికి గాజులు వేసుకోకుండా ఉండటం మంచిది కాదని నమ్ముతారు. పల్లెటూళ్లలో గాజులు వేసుకోకపోతే కీడుగా కూడా భావిస్తారు. ఆడవారు బంగారం, గాజు గాజుల్ని ఇష్టపడతారు. పెళ్లైన ఆడవారు గాజు గాజులు ధరించడం వల్ల భర్త, పిల్లల శ్రేయస్సుకి మంచిదని అంటారు. గాజులు ధరించడంలో వెనుక కొన్ని శాస్త్రీయ కోణాలు ఉన్నాయి.
స్త్రీలకు రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మణికట్టుపై గాజులు ధరించినపుడు రక్తప్రసరణ సరిగా జరిగి వారిలో కోపం, అసహనం వంటివి తగ్గుతాయట. రౌండ్‌గా ఉండే గాజులు ధరించడం వల్ల స్త్రీలలో ఉండే పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లదు. హిందువులలో ఏడవ నెల గర్భిణీకి సీమంతం చేసే వేడుక ఉంటుంది. ఈ సమయంలో చేతి నిండా గాజులు వేస్తారు. రంగురంగుల్లో మెరిసే గాజులు సృష్టించే శబ్దం శిశువు మెదడు కణాలను ఉత్తేజపరిచి అవి అభివృద్ధి చెందడానికి సహాయపడతాయట. ఏడు నెలల శిశువు శబ్దాలను గుర్తించగలదు. ఇక చేతికి ఉండే గాజులు స్త్రీలో సహనాన్ని పెంచి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడతాయట.
Falling Dreams : ఎత్తునుంచి పడిపోతున్నట్లు కలలు వస్తున్నాయా? కారణం ఏంటంటే…
గాజులు ధరించడం వల్ల స్త్రీలలో భావోద్వేగాలు కంట్రోల్‌లో ఉంటాయట. పాజిటివ్‌గా ఆలోచించగలుగుతారట. బ్యాంగిల్స్ ధరించని మహిళలు చాలా ఎమోషనల్‌గా ఉంటారట. గ్లాస్ బ్యాంగిల్స్ పాజిటివ్ ఎనర్జీని గ్రహించి నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తాయట. అంతేకాదు పరిసరాలను శుద్ధి చేయడంలో కూడా ఇవి సహకరిస్తాయట. గాజులు రకరకాల రంగుల్లో లభ్యమవుతాయి. అందులో కొన్ని రంగులు ముఖ్యమైనవి. ఎరుపు రంగు గాజులు పాజిటివ్ ఎనర్జీని అందిస్తే.. తెల్లటి గాజులు కొత్త ప్రారంభాన్ని సూచిస్తాయి. పసుపు రంగు ఆనందాన్ని, ఆకుపచ్చ గాజులు అదృష్టాన్ని, శ్రేయస్సుని అందిస్తాయి. నల్లటి గాజులు శక్తిని, పర్పుల్ బ్యాంగిల్స్ స్వేచ్ఛను సూచిస్తాయి. నీలిరంగు జ్ఞానాన్ని.. బంగారు గాజులు అదృష్టాన్ని , వెండి గాజులు బలాన్ని రక్షణను అందిస్తాయట.