Calcium Foods : శరీరానికి కాల్షియం అందించే ఆహారాలు ఇవే !

నిత్యం ఒక కప్పు పాలను తాగడం వల్ల 280 మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి అందుతుంది. అలాగే నారింజ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగటంతోపాటు ఇందులో కాల్షియం, విటమిన్‌ డి కూడా ఉంటాయి.

Calcium Foods : శరీరానికి కాల్షియం అందించే ఆహారాలు ఇవే !

calcium

Updated On : October 17, 2023 / 7:36 PM IST

Calcium Foods : చిన్నారులు మొదలు పెద్ద వయసు వారి వరకు ఎవరికైనా సరే ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం కావాలి. ఎముకలు ఆరోగ్యం కోసం కాల్షియం అవసరం. కాల్షియం అవసరత ఎముకలకే కాదు నాడీ వ్యవస్థ పనితీరుకు, కండరాలకు అవసరమౌతుంది. అందుకే వైద్యులు కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలని సూచిస్తుంటారు. కాల్షియం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పాలు. పాలు సులభంగా జీర్ణమవ్వటమేకాకుండా, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాల్లో కీలకమనే చెప్పాలి.

READ ALSO : Navaratri 2023 : అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధాలు దేనికి సంకేతమో తెలుసా?

నిత్యం ఒక కప్పు పాలను తాగడం వల్ల 280 మిల్లీగ్రాముల కాల్షియం శరీరానికి అందుతుంది. అలాగే నారింజ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగటంతోపాటు ఇందులో కాల్షియం, విటమిన్‌ డి కూడా ఉంటాయి. అందుకే వీటిని తినటం వల్ల శరీరం కాల్షియాన్ని గ్రహిస్తుంది. కవల్లు చేపలు చేపల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. నాన్‌ వెజ్‌ ఇష్టపడేవారు ఈ చేపలను తీసుకోవటం ద్వారా కాల్షియం పొందవచ్చు.

READ ALSO : yasangi paddy Ownership : యాసంగిలో చలితీవ్రంగా ఉన్న సమయంలో వరి నారుమడి యాజమాన్యం !

సోయా మిల్క్‌లో కాల్షియం ఉంటుంది. ఈ పాలలో కాల్షియం, విటమిన్‌ డి రెండూ ఉంటాయి. బాదంపప్పులో ఉండే కాల్షియం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. కాల్షియం ఎక్కువగా అందుతుంది. ఆకుపచ్చని కూరగాయలను తినడం వల్ల కాల్షియం లభిస్తుంది. అత్తిపండ్లలోనూ కాల్షియం ఉంటుంది. నిత్యం ఒక కప్పు పెరుగు తినడం వల్ల కాల్షియం పెరగటమే కాకుండా పేగు వ్యవస్ధకు మేలు కలుగుతుంది. చీజ్‌లోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది.