High Uric Acid : ఈ పండును రోజూ ఇలా తిన్నారంటే యూరిక్ యాసిడ్‌ ఇట్టే తగ్గిపోతుంది.. ఎప్పుడు ఎలా తినాలో తెలుసా?

High Uric Acid : యూరిక్ యాసిడ్‌ను నివారించాలంటే మీ ఆహారంలో అరటిపండును తప్పక చేర్చుకోండి. అరటి యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సాయపడుతుంది. ఇదేలా తీసుకోవాలో తెలుసుకుందాం?

High Uric Acid : ఈ పండును రోజూ ఇలా తిన్నారంటే యూరిక్ యాసిడ్‌ ఇట్టే తగ్గిపోతుంది.. ఎప్పుడు ఎలా తినాలో తెలుసా?

High Uric Acid

Updated On : January 28, 2025 / 5:45 PM IST

High Uric Acid : యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? శరీరంలోని రక్తంలో ఎక్కువగా కనిపించే ఒక రకమైన వ్యర్థం. రక్తంలో గౌట్, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో ప్యూరిన్స్ అనే రసాయనాలను శుద్ధి చేసే క్రమంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది.

సాధారణంగా ఈ యూరిక్ యాసిడ్ కరిగి కిడ్నీల ద్వారా వెళ్ళి మూత్రంతో బయటకి వచ్చేస్తుంది. కొన్నిసార్లు చాలామందిలో ఆ యూరిక్ యాసిడ్ వెళ్ళకుండా శరీరంలోనే ఉండిపోతుంది. దీన్నే హైపర్యూరిసెమియా అనే వ్యాధికి దారితీస్తుంది. ఈ వ్యాధి కారణంగా శరీర భాగాలతో పాటు అవయవాలకు కూడా తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది. స్పైసీ ఫుడ్ కూడా హైపర్ యూరిసెమియాకు కారణమవుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు.

Read Also :  Mental Health Study : మానసిక ఆరోగ్యంపై అధ్యయనం.. భారత్‌లో పురుషుల్లో కన్నా మహిళల్లోనే తీవ్ర ఒత్తిడి..!

మీ శరీరం ప్యూరిన్‌లను జీర్ణించుకోలేనప్పుడు.. అధిక యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ప్యూరిన్ అనేది శరీరంలో సహజంగా లభించే పదార్థం. ఇది కొన్ని ఆహారాలు, పానీయాలలో పెద్ద పరిమాణంలో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ ఆహార పదార్థాల వినియోగం మీ శరీరంలో యూరిక్ యాసిడ్ పెంచుతుంది.

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు, కీళ్లలో స్ఫటికాలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. కీళ్లలో వాపు, నొప్పిని కలిగిస్తుంది. దీంతో గౌట్ సమస్య పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో సమస్యను పరిష్కరించేందుకు మీ ఆహారంలో అరటిపండును చేర్చుకోండి. మీ ఆహారంలో అరటిపండు తీసుకోవడం తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్‌ తీవ్రతను తగ్గించగలదు. ఇంతకీ ఈ అరటిపండును ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

యూరిక్ యాసిడ్‌ తగ్గాలంటే అరటిపండు తినాల్సిందే :
అరటిపండులో చాలా తక్కువ ప్యూరిన్ ఆహారం ఉంటుంది. విటమిన్ సి కలిగి ఉంటుంది. శరీరంలో ఆల్కైల్ స్వభావాన్ని పెంచి యూరిక్ యాసిడ్ స్ఫటికాలను కరిగిస్తుంది. అరటిపండు మీ కీళ్లలో పేరుకుపోయిన ప్యూరిన్‌లను నిర్విషీకరణ చేయడంలో సాయపడుతుంది. నొప్పి, వాపును కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులోని సిట్రిక్ యాసిడ్ శరీరంలోని యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడంలో సాయపడుతుంది.

Read Also : Garlic Health Benefits : పచ్చి వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే అసలు వదిలిపెట్టరు.. ప్రతిరోజూ ఇలా తిన్నారంటే అద్భుతంగా పనిచేస్తుంది!

అరటిపండును ఎప్పుడు, ఎలా తినాలి? :
యూరిక్ యాసిడ్ తగ్గాలంటే లంచ్ తర్వాత అరటిపండు తినాలి. మీరు రోజూ రెండు మూడు అరటిపండ్లను తినవచ్చు. మీరు కొన్ని రోజులు క్రమం తప్పకుండా అరటిపండు తినడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. అరటిపండు తినడం వల్ల మలబద్ధకం నుంచి కూడా తొందరగా ఉపశమనం లభిస్తుంది.

అరటిపండు తింటే కలిగే ఇతర ప్రయోజనాలివే :
యూరిక్ యాసిడ్ సమస్యలో అరటిపండు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని జీవక్రియను వేగవంతం చేస్తుంది. పొట్టలోని ప్యూరిన్ కణాలను క్లీన్ చేయగలదు. మలంతో శరీరం నుంచి బయటకు పంపేస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా శరీరంలో తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది.