Improve Your Grip Strength : చేతుల్లో బలం, పట్టుకోసం దోహదపడే వ్యాయామ సాధనం ఇదే !

చేతుల్లో గ్రిప్ కోసం జిమ్‌లలో వ్యాయామాలు చేయాలని చాలా మంది అనుకుంటారు. ఇందు కోసం ఉపయోగించే డంబెల్స్, బార్‌బెల్స్ ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు తమ చేతులలో పట్టు పెంచుకునేందుకు ఇంట్లో అందుబాటులో ఉండే సాధనాలను ఉపయోగించవచ్చు.

Improve Your Grip Strength : చేతుల్లో బలం, పట్టుకోసం దోహదపడే వ్యాయామ సాధనం ఇదే !

strength and grip in the hands

Updated On : April 9, 2023 / 11:44 AM IST

Improve Your Grip Strength : ప్రతి వ్యక్తికి రోజు వారిగా తమ పనులు చేసుకోవటం కోసం చేతులు కీలకంగా బరువులు ఎత్తాలన్నా, వస్తువలను ఒకచోట నుండి మరోచోట పెట్టాలన్నా, ఆహారపదార్ధాలను తీసుకోవాలన్నా చేతిలో పట్టు, బలం అవసరం. పనులు చక్కబెట్టేందుకు చేతుల్లో గ్రిప్ అవసరమవుతుంది. ఇంటిపని, వంటపని, తోటపని ఇలా ఏపనికైనా చేతులను ఉపయోగించాల్సి ఉంటుంది.

READ ALSO : Exercises : కఠినతరమైన వ్యాయామాలు నిపుణుల పర్యవేక్షణలోనే చేయటం మంచిదా?

చేతుల్లో గ్రిప్ కోసం జిమ్‌లలో వ్యాయామాలు చేయాలని చాలా మంది అనుకుంటారు. ఇందు కోసం ఉపయోగించే డంబెల్స్, బార్‌బెల్స్ ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు తమ చేతులలో పట్టు పెంచుకునేందుకు ఇంట్లో అందుబాటులో ఉండే సాధనాలను ఉపయోగించవచ్చు. చేతితోపాటు, చేతి ముంజేతిలోని కండరాలలో పట్టు ఉంటే చేతికి మంచి గ్రిప్ ఉంటుంది..

ప్రస్తుతం ఆన్‌లైన్ లో హ్యాండ్ గ్రిప్పర్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పోర్టబుల్ కాంపాక్ట్ లివర్ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి పరికరాలతో చేసే స్వల్పకాలిక వ్యాయామాలు చేతుల్లో బలాన్ని పెంచుతాయి. కండరాలను శక్తివంతంగా మారుస్తాయి. పోర్టబుల్ కాంపాక్ట్ లివర్ ను చేతిలో ఉంచుకుని గట్టిగా వేళ్లతో నొక్కటం ద్వారా హ్యాండ్ గ్రిప్ ని మెరుగుపరుచుకోవచ్చు.

READ ALSO : Fitness Exercisers : ఫిట్ నెస్ వ్యాయామాలు చేసే వారు శక్తి కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే?

మహిళలు రోజువారి పనులను ఎలాంటి సమస్య లేకుండా నిర్వహించడానికి హ్యాండ్ గ్రిప్ బలం అవసరమని నిపుణులు చెబుతున్నారు. మహిళలు తమ ముంజేతులు, మణికట్టు పట్టును బలోపేతం చేసుకుంటే కిరాణా సామాను తీసుకెళ్లడం, పిల్లలను ఎత్తుకోవటం, తోటపని చేయడం వంటి అనేక ఇతర కార్యకలాపాలు చేయడం సులభం అవుతుంది. చేతుల్లో గ్రిప్ పెంచుకునేందుకు తడిసిన టవల్స్ ను మెలితిప్పుతూ నీటిని పిండటం వంటివి చేయటం వల్ల కూడా చేతుల్లో పట్టును, బలాన్ని పెంచుకోవచ్చు.