Covid Duplicate Virus : కరోనాకే డూప్లికేట్ వైరస్ తయారీ.. అసలు కరోనాను ఏం చేస్తుందంటే?

కరోనాకే డూప్లికేట్ వైరస్ తయారు చేశారు అమెరికా సైంటిస్టులు. చూడటానికి అచ్చం కరోనా వైరస్ మాదిరిగానే ఉంటుందట. కాకుంటే చాలా చిన్నగా ఉంటుందట.. అసలైన కరోనాకు ఝలక్ ఇచ్చి దాన్ని లోపల వ్యాప్తిచెందకుండా అడ్డుకుంటుదట..

Covid Duplicate Virus : కరోనాకే డూప్లికేట్ వైరస్ తయారీ.. అసలు కరోనాను ఏం చేస్తుందంటే?

Us Scientists Creates Covid Duplicate Virus To Reduce Original Spread Of Coronavirus

Updated On : July 14, 2021 / 1:40 PM IST

Covid Duplicate Virus : కరోనాకే డూప్లికేట్ వైరస్ తయారు చేశారు అమెరికా సైంటిస్టులు. చూడటానికి అచ్చం కరోనా వైరస్ మాదిరిగానే ఉంటుందట. కాకుంటే చాలా చిన్నగా ఉంటుందట.. అసలైన కరోనాకు ఝలక్ ఇచ్చి దాన్ని లోపల వ్యాప్తిచెందకుండా అడ్డుకుంటుదట.. సాధారణంగా అసలైన కరోనా మన శరీరంలోకి వెళ్తే.. ఏదైనా ఒక కణాన్ని ఆకర్షిస్తుంది. అలాగే ఈ డుప్లికేట్ కరోనా కూడా అలానే అతుక్కుని ఉండిపోతుంది.

కరోనా ఎలాగైతే తన సంతతిని పెంచుకుంటూ వైరస్ కాపీలను సృష్టిస్తుందో ఇది కూడా కరోనా మమహ్మారిని అడ్డుకునేందుకు అదే స్థాయిలో పోరాడుతుందట.. అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ సైంటిస్టులు డిఫెక్టివ్ ఇంటర్‌ఫియరింగ్ విధానంలో డూప్లికేట్ కరోనాను రూపొందించారు.

అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ (Pennsylvania State University) సైంటిస్టులు… డిఫెక్టివ్ ఇంటర్‌ఫియరింగ్ విధానంలో… డూప్లికేట్ కరోనాను తయారుచేశారు. ఈ డుప్లికేట్ కరోనాను మనిషి శరీరంలోకి పంపిస్తారు. శరీరంలోకి వెళ్లిన తర్వాత అసలైన వైరస్ వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. అలాగే వైరస్ పునరుత్పత్తిని నిలిపివేస్తుంది. నిజమైన వైరస్ సామర్థ్యం తగ్గిపోతుంది.

డూప్లికేట్ వైరస్ అసలైన వైరస్ కంటే 90 శాతం చిన్నదిగా ఉంటుంది. మూడు రెట్లు వేగంగా వృద్ధి చెందగలదు. అసలైన వైరస్ ఒక్క రోజులోనే సగానికి తగ్గిపోతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. రెండు రోజులకే కరోనా పూర్తిగా పోతుందని, అనంతరం డూప్లికేట్ వైరస్ కూడా దానికిఅదే నశించిపోతుందని అంటున్నారు. ఈ డూప్లికేట్ వైరస్‌ని కరోనా సోకిన మానవుల ఊపిరితిత్తుల కణాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.