Vidya Balan Diet : డైట్ సీక్రెట్ రివీల్ చేసిన నటి విద్యా బాలన్.. 45ఏళ్ల వయస్సులో ఎలా బరువు తగ్గానంటే?
Vidya Balan Diet : అలా డైట్ కొనసాగిస్తూ వచ్చాను.. నా శరీరానికి పడని ఆహారాన్ని దూరం పెట్టాను. దాంతో బరువు అదుపులోకి వచ్చిందన్నారు.

Vidya Balan breaks silence on drastic weight loss
Vidya Balan Diet : బాలీవుడ్ నటి విద్యాబాలన్ డైట్ సీక్రెట్ రివీల్ చేసింది. తన డైట్ గురించి విద్యాబాలన్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇన్నాళ్లుగా తన డైట్ విషయంలో మౌనం వహించిన విద్యాబాలన్ ఇప్పుడు అసలు సీక్రెట్ బయటపెట్టేసింది. ఏడాదిలో ఎలాంటి వ్యాయామం చేయకుండానే బరువు తగ్గి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్ మాట్లాడుతూ.. 45 ఏళ్ల వయసులో తాను ఎలా బరువు తగ్గిందో రివీల్ చేసింది. అప్పటి నుంచి ఆమె ఎలా ఫిట్‌గా ఉన్నారో తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
అధిక బరువుతో అనేక అవమానాలు :
విద్యాబాలన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అధిక బరువు కారణంగా తాను ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ‘ఒక విలేకరుల సమావేశంలో నన్ను అవహేళన చేయడం గుర్తుంది. ‘మీరు మహిళా సెంట్రిక్ సినిమాలు చేస్తూనే ఉంటారా లేదా కొంచెం బరువు తగ్గుతారా’ అని అన్నారు. దానికి నాకు చాలా బాధగా అనిపించింది.
నా లుక్‌ని నిర్మాత-దర్శకుడు, ప్రేక్షకులు ఎప్పటినుండో ఇష్టపడతారని విద్యా చెప్పుకొచ్చింది. ‘నేను ఎప్పుడూ లావుగా ఉండాలని కోరుకోలేదు. నేటి కాలంలో లావు అనే పదాన్ని అవహేళన చేస్తున్నారు. కానీ అలా ఉండకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచంలో సన్నగా ఉండేవారిలాగే లావుగా ఉన్నవారు కూడా ఉంటారు’ అని తెలిపింది.
విద్యాబాలన్ డైట్ ప్లాన్ :
అధిక బరువు తగ్గేందుకు అనేక రకాల డైట్‌లు తీసుకున్నట్టు చెప్పింది. గంటల తరబడి వ్యాయామం చేసినప్పటికీ కూడా బరువు పెరుగుతూనే ఉన్నట్టు తెలిపింది. విద్యాబాలన్ మాట్లాడుతూ.. ‘నేను ఏమీ తినకపోయినా, నా బరువు పెరుగుతోంది. ఆ తరువాత ఈ ఏడాదిలో నేను చెన్నైలో ఒక న్యూట్రిషియన్‌ను కలుసుకున్నాను. మీ శరీరంలో కొవ్వు లేదు అని చెప్పారు. ఆ తర్వాత ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లేని డైట్‌ని తీసుకోవాలని సూచించారు.
అలా డైట్ కొనసాగిస్తూ వచ్చాను.. క్రమంగా బరువు తగ్గడం కనిపించింది. నా శరీరానికి పడని ఆహారాన్ని దూరం పెట్టాను. దాంతో బరువు అదుపులోకి వచ్చిందన్నారు. ‘నేను శాఖాహారిని. నాకు పాలక్ తెలియదు. (పాలకూర, సీసా పొట్లకాయ) నాకు పడవు. అన్ని కూరగాయలు మనకు మంచివని భావిస్తుంటారు. కానీ అది అలా కాదు. మీకు ఏది మంచిదో మీరు గుర్తించాలి. అది మరొకరికి మంచిది. మీకు మంచిది కాదు’ అని విద్యాబాలన్ పేర్కొన్నారు.
View this post on Instagram
బరువు తగ్గేందుకు వర్కవుట్ మానేశాను :
వర్కౌట్ చేయడం మానేశాను. గంటల కొద్ది వ్యాయామం చేయలేదు. ఒకప్పుడూ అధిక బరువు కారణంగా లావుగా ఉన్నావని అందరూ అనడంతో మానసికంగా చాలా బాధేసిందని విద్యా వివరించింది. “నేను ఏడాది పొడవునా వర్కవుట్ చేయలేదు. నేను చేయని మొదటి సంవత్సరం ఇదే. మన శరీరాలు మానసికంగా ఏమి చేస్తున్నామో వ్యక్తీకరిస్తాయి.
అందుకే చాలామంది వివిధ కారణాల వల్ల బరువు పెరుగుతారు. నేను జిమ్‌లో బాగా వర్కౌట్ చేస్తామని అంటారు.. నేను అయితే అలా అసలు చేయొద్దని అంటాను. నా బరువును అదుపులో ఉంచుకున్నాను. గతంలో కన్నా ఆరోగ్యంగా ఉన్నాను. మన వ్యక్తిత్వాన్ని మనం గౌరవించాలి” అని విద్యాబాలన్ చెప్పుకొచ్చారు.
నవంబర్ 1న ‘భూల్ భూలయ్యా 3’ విడుదల :
విద్యాబాలన్ మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘భూల్ భూలయ్యా 3’లో కనిపించనుంది. ఈ మూవీలో మంజూలిక పాత్రలో విద్య మరోసారి కనిపించబోతోంది. కార్తీక్ ఆర్యన్, మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రీ, విజయ్ రాజ్, రాజ్‌పాల్ యాదవ్, సంజయ్ మిశ్రా, అశ్విని కేల్కర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనీజ్ బజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం దీపావళి ప్రత్యేక సందర్భంగా నవంబర్ 1, థియేటర్లలో విడుదల కానుంది.
Read Also : Pushpa 2 : ఏపీలో పెద్ద ఈవెంట్‌కు పుష్ప టీమ్ ప్లాన్!