Virtual Reality: కామన్ ఫోబియాల నుంచి బయటపడేస్తున్న వర్చువల్ రియాలిటీ యాప్

న్యూజిలాండ్ లోని ఓ యూనివర్సిటీ జరిపిన ప్రయోగంలో వర్చువల్ రియాలిటీ యాప్ కామన్ ఫోబియాల నుంచి బయటపడేస్తున్నట్లు తెలిసింది. క్రిస్ట్‌చర్చ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో జరిపిన ఈ ప్రయోగంలో 12మంది పాల్గొన్నారు. వీరంతా ఎగరడం, సూదులు, ఎత్తులు, సాలి పురుగులు, కుక్కలు వల్ల కలిగే ఫోబియా నుంచి బయటపడగలిగారట.

Virtual Reality: కామన్ ఫోబియాల నుంచి బయటపడేస్తున్న వర్చువల్ రియాలిటీ యాప్

Vr Headset

Updated On : July 21, 2022 / 10:10 AM IST

Virtual Reality: న్యూజిలాండ్ లోని ఓ యూనివర్సిటీ జరిపిన ప్రయోగంలో వర్చువల్ రియాలిటీ యాప్ కామన్ ఫోబియాల నుంచి బయటపడేస్తున్నట్లు తెలిసింది. క్రిస్ట్‌చర్చ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో జరిపిన ఈ ప్రయోగంలో 12మంది పాల్గొన్నారు. వీరంతా ఎగరడం, సూదులు, ఎత్తులు, సాలి పురుగులు, కుక్కలు వల్ల కలిగే ఫోబియా నుంచి బయటపడగలిగారట.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జర్నల్ ఆఫ్ సైకియాట్రికి చెందిన పబ్లికేషన్ లో ఈ పరిశోధనా ఫలితాలను ప్రచురించారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ కామెరన్ లాసీ నేతృత్వంలో ఈ ట్రయల్ జరిగింది. ఫోబియా పేషెంట్లు హెడ్ సెంట్ ధరించి స్మార్ట్ ఫోన్ యాప్ ట్రీట్మెంట్ ప్రోగ్రాం అయిన వర్చువల్ రియాలిటీ (VR), కాగ్నిటివ్ బిహేవియరల్ థెరఫీ (CBT)లో పార్టిసిపేట్ చేశారు.

Read ALso : ఈ పెళ్లి.. చాలా వెరైటీ గురూ, ఇలాంటి వేడుక ఇండియాలోనే జరగలేదు!

దీని కోసం పూర్తి సమాచారంతో ఉన్న “oVRcome” యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నారు. ఫోబియా, యాంగ్జైటీల కోసమే రూపొందించిన ఈ యాప్ ను హెడ్ సెట్ కు పెయిర్ చేశారు. ఇందులో 75శాతం ఫోబియా లక్షణాల నుంచి బయటపడేసినట్లు తెలిసింది. ట్రీట్మెంట్ ప్రోగ్రాం ఆరు వారాల పాటు జరిగిందని రికార్డులు చెబుతున్నాయి.