Hand-Washing : 20 సెకన్ల పాటు చేతులు ఎందుకు కడుక్కోవాలి? సైన్స్ ఏం చెబుతోంది?

అసలే కరోనా టైం.. బయటకు వెళ్తే మాస్క్, సామాజిక దూరం పాటించాల్సిందే.. ఏదైనా ముట్టుకుంటే వెంటనే చేతులు శుభ్రంగా శానిటైజ్ చేసుకోవాల్సిందే.

Hand-Washing : 20 సెకన్ల పాటు చేతులు ఎందుకు కడుక్కోవాలి? సైన్స్ ఏం చెబుతోంది?

Wash Your Hands For 20 Seconds Physics Shows Why

Updated On : August 26, 2021 / 6:32 PM IST

Hand-Washing : అసలే కరోనా టైం.. బయటకు వెళ్తే మాస్క్, సామాజిక దూరం పాటించాల్సిందే.. ఏదైనా ముట్టుకుంటే వెంటనే చేతులు శుభ్రంగా శానిటైజ్ చేసుకోవాల్సిందే. లేదంటే.. కరోనా మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉంటుందని అందరికి తెలిసిందే. ఇంతకీ మీరు ఎన్ని సెకన్ల పాటు చేతులు శానిటైజ్ చేసుకుంటున్నారో చెక్ చేసుకోండి. సాధారణంగా 20 సెకన్ల పాటు చేతులు ఎందుకు కడుక్కోవాలంటారో తెలుసా? అసలు సైన్స్ ఏం చెబుతోందంటే.. చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా అనేక వ్యాధులు, వైరస్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చునని రుజువైంది. దీనికి వెనుక సైన్స్ కూడా ఉంది. చేతులు కడుక్కోవడం ద్వారా, వైరస్‌లు, బ్యాక్టీరియాలను నిరోధించే సమయ ప్రమాణాలను భౌతిక శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

దీనికి సంబంధించి గణిత నమూనాను వినియోగించారు. ఇది రెండు కోణాలలో పనిచేస్తుంది. రెండింటి మధ్య సన్నని లిక్విడ్ ఫిల్మ్ ఉంటుంది. ఈ రెండు ఉపరితలాలు చేతులను సూచిస్తాయి. కఠినమైన ఉపరితలాలపై కొన్ని కణాలు చిక్కుకున్నాయి. సాధారణంగా ప్రవహించే ద్రవం బలం కదిలే చేతుల వేగం మీద ఆధారపడి ఉంటుంది. బలమైన ప్రవాహం కణాలను సులభంగా తొలగిస్తుందని సైంటిస్టులు తేల్చారు. ఒక చొక్కా మీద మరకను రుద్దినప్పుడు కలిగే చర్యను పోల్చి చూశారు. వేగంగా రుద్దినప్పుడు మరకకు సంబంధించి కణాలు బయటకు రావడాన్ని గుర్తించారు.
హ్యాండ్ శానిటైజర్ చేతులు శుభ్రం చేసుకోవడానికే కాదు.. పదుల సంఖ్యలో ప్రయోజనాలు

అలాగే.. మీరు మీ చేతులను ఒకదానితో ఒకటి సాపేక్షంగా, చాలా నెమ్మదిగా రుద్దినప్పుడు.. రెండు చేతుల మధ్య ప్రవహించే ద్రవం అంటుకుపోయిన ధూళీ కణాలు తొలిగిపోతాయని కనుగొన్నారు. అయితే కణాలు పూర్తిగా తొలిగిపోవాలంటే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సాధారణ హ్యాండ్ వాషింగ్ మార్గదర్శకాల ప్రకారం.. కనీసం 20 సెకన్ల వరకు చేతులను కడుక్కోవాలని సూచిస్తోంది. ఈ మోడల్ ద్వారా వైరస్‌లు, బ్యాక్టీరియాను తొలగించడానికి 20 సెకన్ల సమయం సరిపోతుందని గుర్తించారు. సబ్బుతో కలిగే రసాయన లేదా జీవ ప్రక్రియలను ఈ గణిత మోడల్ పరిగణించలేదు.