Breakup : బ్రేకప్ అయిందా..? ఇలా బయటపడండి..
జరిగినవన్నీ మంచికనీ జీవించడమే మనిషి పని అనేలా బ్రేకప్ అయితే కొత్త విషయాలు నేర్చుకోవాలి. అంతే తప్ప జీవితాన్ని విషాదం చేేసుకోకూడదు. బ్రేకప్ నుంచి ఎలా బయటపడాలి..? తిరిగి మంచి జీవితాన్ని ఎలా తిరిగి నిర్మించుకోవాలో..దాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో తెలుసుకోండి.

Breakup
Breakup : ప్రేమలో పడితే సంతోషమే సంతోషం. చాటింగులు, డేటింగులు, ముద్దులు, ముచ్చట్లు, సినిమాలు, షికార్లు ఇలా ప్రేమికులకు లోకమంది ఇంద్రధనుస్సులో కనిపిస్తుంది. ప్రేమలో ఎంత సంతోషంగా ఉంటారో..బ్రేకప్ అయితే మనస్సు ముక్కలై కుమిలిపోతారు. అంతకుముందు ఇంటిపట్టున ఉండకుండా తిరిగేవారు ఇంటినుంచి రూము నుంచి బయటకు రాకుండా జీవితమే కోల్పోయినట్లుగా కుమిలిపోతారు. డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. జీవితం ముక్కలైపోయిందని కృంగిపోతారు. ప్రేమ అనేది జీవితంలో భాగమే తప్ప ప్రేమే జీవితం ప్రేమికులు దూరం అయితే ఇక జీవితమే లేదని అనుకోకూడదు. బ్రేకప్ కు ప్యాకప్ చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి.. బ్రేక్ బీ బ్రేవ్ అనేలా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి..?
గతాన్ని ఎవ్వరు మార్చలేదు. కానీ భవిష్యత్తును మనం కావాల్సినట్లుగా తీర్చి దిద్దుకోవచ్చు. బ్రేకప్ అనేది జీవిత సమస్య కాదు నాకు మంచి జీవితం ఉంది..మంచి భవిష్యత్తు ఉందని అని తమకు తాము చెప్పుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే సెల్ఫ్ కౌన్సెలర్ గా మారాలి. బ్రేకప్ బాధనుంచి ఎంత త్వరగా బయటపడితే భవిష్యత్తును అతంత త్వరగా తీర్చి దిద్దుకోవచ్చు. మీకు బ్రేకప్ చెప్పినవారి ముందే మీరు ఉన్నతస్థాయికి వెళ్లి చూపించాలి. అదే సంకల్పంతో బ్రేకప్ నుంచి బయటపడాలి. బ్రేకప్ బాధ వల్ల వచ్చేది ఏమీ ఉండదు.మానసిక అశాంతి తప్ప.
International Left handers Day 2023 : వాచీని ఎక్కువమంది ఎడమ చేతికే ఎందుకు పెట్టుకుంటారు..?
టైమ్ తీసుకోండి : బ్రేకప్ నుంచి బయటపడటం చెప్పినంత ఈజీ కాదు. కానీ అది కష్టమూ కాదు..అసాధ్యమూ కాదు. కాబట్టి టైమ్ తీసుకోండి. బ్రేకప్ కావటానికి మీ తప్పు ఎంతుందో గ్రహించండి. మీ తప్పులేకపోతే చేయని తప్పుకు నేనెందు బాధపడాలి. ఆ బాధతో నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి? అని రివ్వ్యూ చేసుకోండి..మీకు మీరే సర్ది చెప్పుకోండి. గతాన్ని మార్చలేమన్న విషయాన్ని గుర్తించండి. ఖాళీగా ఉండొద్దు..ఏదోక వ్యాపకం క్రియేట్ చేసుకోండి..మరి ముఖ్యంగా మీకు ఇష్టమైన పనులు చేయటానికి యత్నించండి..
మనస్సులో బాధ షేర్ చేసుకోండి: మనసులోని భాదను పంచుకుంటే తగ్గుతుందంటారు. సో మీ ఫ్రెండ్స్, స్నేహితులు, శ్రేయోభిలాషులతో షేర్ చేసుకోండి.ఏడిస్తే మనస్సులో భారం తగ్గుతుందంటారు. తనివితీరా ఏడవండి.. మనసు తేలికచేసుకోండి. అంతే తప్ప ఏడుపే జీవితం అనుకోవద్దు. అటువంటి ఆలోచనే రానివ్వొద్దు. ఆ బాధను దాచుకున్న కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీ సన్నిహితులతో లేదా స్నేహితులకు షేర్ చేసుకోండి. రిలీఫ్ పొందండి.
రొటీన్ వద్దు థింక్ డిఫరెంట్ : రొటిన్ గా ఉంటే బోర్ కొడుతుంది. సో థింక్ డిఫరెంట్. బ్రేకప్ బాధనుంచి బయటపడాలంటే మాత్రం మీలో దాగున్న నైపుణ్యాన్ని బయటకు తీయండి. ఇష్టమైన పనులు చేయండి. వాయిదా వద్దు. అనుకున్న వెంటనే మొదలు పెట్టండి.ఏమాత్రం బద్దకించొద్దు..వాయిదా వేయొద్దు..
పాత గుర్తులు దూరం చేసుకోవాలి : బ్రేకప్ నుంచి బయటపడాలంటే మీ లవర్ వస్తువులను, గుర్తులు ఒక్కటి కూడా లేకుండా చేయండి. వాటిని చూస్తున్నంత సేపు వారే గుర్తొస్తారు. కాబట్టి అవి లేకుండా చేయండి. దూరమైనవారు ఇచ్చిన బహుమతుల్ని సాధ్యమైనంత వరకు చూడకుండా ఉండేలా..అవసరమైతే పారేయండి..
వ్యవసాలవైపు అడుగులేయొద్దు : బ్రేకప్ అయితే చాలు చాలామంది మద్యానికి బానిసలుగా మారిపోతారు. ఆ మత్తులో మర్చిపోవాలనుకుంటారు. కానీ మత్తు విడివడ్డాకు తిరిగి అవే ఆలోచనలు చుట్టుముడతాయి. కాబట్టి ఆల్కహాల్ కు, స్మోకింగ్ లకు అలవాటు పడకుండా జాగ్రత్తపడండి. కొంతమంది స్నేహం ముసుగులో ఓ పెగ్ ఎయ్ మామా అదే పోద్ది అంటారు. అటువంటి స్నేహితులకు దూరంగా ఉండటం మంచిది. వ్యవసనాల వల్ల ఆరోగ్యం చెడిపోవడమే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.
కొత్త వారితో కలవండి..: బ్రేకప్ అయ్యిందని ఇంట్లోనే మగ్గిపోవద్దు. మీకు తెలుసా కొత్త వారితో పరిచయాలు, కొత్త ప్రాంతాలకు వెళితే మనసు తేలికవతుంది. ఉన్న ప్రాంతంలోనే ఉంటే అవే ఆలోచనలు. అవే గుర్తులు మాటి మాటికి మనసుని తొలిచేసి మనసు గాయాన్ని మరింతగా పెంచుతాయి. కొత్తవారితో కలిస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. కొత్త ప్రాంతానికి వెళితే మనకు తెలియకుండానే మన మనస్సు ధ్యాస మరలుతుంది. పాత ఆలోచనలన్నీ పోయి కొత్త ఉత్సాహం వస్తుంది. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి.
జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వల్ల ఒరిగేది ఏదీ ఉండదు. బుర్ర పాడవ్వటం తప్ప. ఆలోచనలు పెరిగితే డిప్రెషన్ లోకి వెళ్లిపోయే ప్రమాదముంది. జరిగిందేదో జరిగిపోయింది. నాకూ ఒక లైఫ్ ఉందని గుర్తు పెట్టుకోండి. లైఫ్ లో ఏదీ శాశ్వతం కాదని మీరు బ్రేకప్ ద్వారా తెలుసుకోవచ్చు. బ్రేకప్ పెద్ద గుణపాఠం అని తెలుసుకోండి. బ్రేకప్ చాలా విషయాలు నేర్పిస్తుంది. కానీ మీరు వాటిని గుర్తించటం మీ బాధ్యత. బ్రేకప్ తర్వాత మీరు చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నిజానికి బ్రేకప్ చాలా చాలా విషయాలు నేర్పిస్తుంది..ఆలోచిస్తే మీకు ఆ విషయాలు తెలుస్తాయి..సో బ్రేకప్ బీ బ్రేవ్..