Weight Loss: సర్జరీ అవసరమే లేదు.. ఇవి తింటూ సులువుగా బరువు తగ్గించుకోండి!
మన శరీర బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. తగినన్ని పోషకాలు అందిస్తూనే బరువు తగ్గడానికి తోడ్పడే ఆహార పదార్థాలివే..
Weight Loss Diet Plan: బరువు పెరగడం ఇప్పుడు ఒక రంగా చెప్పాలంటే ప్రపంచ సమస్యగా మారింది. అయితే అధిక బరువు (High Weight) తగ్గడానికి షార్ట్ కట్స్ ఉండవు. సింపుల్ డైట్ (Simple Diet) పద్ధతులతో బరువు తగ్గడం సులువవుతుంది. ఇందుకోసం కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. తగినన్ని పోషకాలు అందిస్తూనే బరువు తగ్గడానికి తోడ్పడే ఆహార పదార్థాలివే..
మన ముక్కూ, నోరూ చెప్పినట్టు కాకుండా కడుపు చెప్పినట్టు వినాలి.. అప్పుడే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోగలుగుతాం. రుచిగా ఉందని ఆకలి కాకపోయినా ఎక్కువ తినేస్తుంటాం. అలా తినడం అలవాటైపోయి, క్రమంగా పదే పదే ఆకలి అవుతూ ఉంటుంది. తద్వారా ఎక్కువ తినేసి, బరువు పెరుగుతుంటారు.
సర్జరీ వద్దు.. డైట్ ముద్దు
బరువు తగ్గాలంటే తినకుండా ఉండటం కాదు.. ఇలా అవసరం లేకపోయినా, అతిగా తినకుండా ఉండాలి. లేకుంటే కంట్రోల్ తప్పి, చివరికి స్థూలకాయం తగ్గించుకోవడానికి వెయిట్ లాస్ సర్జరీలు చేయించుకోవాల్సి వస్తుంది. ఒకసారి సర్జరీ చేయించుకుంటే, ఇక అనేక రకాలైన కాంప్లికేషన్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి సర్జరీల జోలికి వెళ్లే అవసరం రాకుండా రోజూ వ్యాయామం చేస్తూనే, సరైన డైట్ పద్ధతులు పాటించాలి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోనే మార్పు చేర్పులు చేసుకుంటే ఆకలిని అదుపులో ఉంచొచ్చు. ఇందుకోసం ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేసే ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది.
ఫైబర్ తప్పనిసరి
మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉంటే మలబద్ధకం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయని మనకు తెలిసిందే. అంతేకాదు, బరువు తగ్గడానికీ, డయాబెటిస్ కంట్రోల్ లో ఉండటానికి కూడా ఫైబర్ ఉపయోగపడుతుంది. ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ తీసుకుంటే చాలు కడుపు నిండిపోతుంది. అందుకే మన ఆహారంలో ప్రధానంగా చేర్చాల్సిందే పీచు పదార్థాలనే.
ఫైబర్ కోసం ఇవి తినండి
కార్బోహైడ్రేట్ పదార్థాల కన్నా కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా దొరుకుతుంది. వీటిలో కూడా లెగ్యూమ్స్ అంటే చిక్కుళ్లు, పచ్చి బఠానీ, చిరు ధాన్యాల్లో కూడా పీచు పదార్థాలు ఎక్కువే. శనగలు, పెసళ్లలో కూడా పీచు మెండు. ఆకు కూరలు, బీరకాయ, పొట్లకాయ లాంటి వాటిలో కూడా ఫైబర్ దొరుకుతుంది. భోజనం చేయడానికి ముందు ఒక కప్పు నిండా ఇలాంటి కూరగాయలతో కూడిన సలాడ్ తీసుకుంటే మంచిది. ఆ తరువాత కేలరీలు ఎక్కువగా తీసుకోకుండా ఉంటారు. అంతేకాదు, ఎక్కువ సమయం పాటు ఆకలి కాకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ ఏదో ఒకటి నములుతూ ఉండకుండా ఉంటారు.
Also Read: హ్యోంగోవర్ తగ్గించే పానీయాలు.. దెబ్బకు దిగిపోద్ది
కడుపు నింపే ఆయిల్స్
పీచు పదార్థాలే కాదు.. కొన్ని రకాల నూనెలు కూడా తొందరగా కడుపు నిండుతుంది. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ వంటివి ఆహారంలో భాగం చేయడం వల్ల త్వరగా కడుపు నిండినట్టు ఫీలవుతారు. అవకాడో కూడా ఇందుకు హెల్ప్ చేస్తుంది. ఇళా తొందరగా కడుపు నిండటం వల్ల ఎక్కువ మొత్తంలో తినకుండా ఉండటమే కాకుండా, త్వరగా ఆకలి కాదు. అందువల్ల బరువు పెరగకుండా ఉంటారు.
Also Read: చాలా స్పీడ్‌గా ఆహారం తింటున్నారా? బీ కేర్ ఫుల్
నేరం కార్బోహైడ్రేట్స్ దే
మన రోజువారీ ఆహారంలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే మన శరీరానికి ఎక్కువ మొత్తంలో కేలరీలు చేరుతాయి. అంతేకాదు.. వీటిని తిన్న కొద్దీ ఇంకా ఇంకాతినాలనిపిస్తుంది. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, నూనెలో బాగా వేయించిన స్నాక్స్ ఏవైనా కొంచెం నోట్లో పెట్టుకున్నామంటే చాలు.. మొత్తం అయిపోయేదాకా.. అలా తినేస్తూనే ఉంటాం. కార్బోహైడ్రేట్స్, ఫాట్స్ వల్ల ఫుడ్ క్రేవింగ్ ఎక్కువగా అవుతుంది. అందువల్లనే ఇలా అతిగా తినేస్తుంటాం. అందుకే ఇలాంటి ఫుడ్స్ తినాలని అనిపించినప్పుడల్లాకోడిగుడ్లు, సోయా ఉత్పత్తులు, పప్పులు, పెరుగు వంటివి తినడం వల్ల క్రేవింగ్ తగ్గుతుంది. ఆకలి నియంత్రణకు వచ్చి, బరువు తగ్గుతారు.
Also Read: ప్రాణదాతలైన డాక్టర్ల చేతి రాత బాగోదెందుకు..? ఇది చదివితే ఇంకెప్పుడు ఆ మాట అనరు
సూప్.. మంచిదే
మనం ఔటింగ్ కోసం ఏ రెస్టారెంట్ కి వెళ్లినా ముందు సూప్ ఇస్తుంటారు. నిజానికి ఇది మంచి అలవాటే. ఆహారానికి ముందు సూప్ తీసుకోవడం వల్ల కేలరీలు తక్కువగా రావడమే కాకుండా ఆకలి కంట్రోల్ అవుతుంది. అందువల్ల తరువాత తినే భోజనాన్ని మితంగా తీసుకోగలుగుతారు. సలాడ్స్ తర్వాత ఆకలి నియంత్రణలో ముఖ్యమైంది సూప్. అందుకే సూప్ తీసుకోవడం కూడా అలవాటు చేసుకోండి. ఇదే కాకుండా అల్లం రసం తాగడం కూడా మంచిదే. భోజనానికి ముందు డార్క్ చాక్లెట్, కాఫీ తాగడం వంటి అలవాట్ల వల్ల కూడా ఆకలి కంట్రోలై మితంగా తింటారు. కేలరీలు కూడా కంట్రోల్ లో ఉండి, బరువు తగ్గుతారు.