Adolescence : యవ్వన దశలో ఎలాంటి ఆహారం అమ్మాయిలకు అవసరం
తల్లి దండ్రులు తమ ఎదిగే పిల్లల విషయంలో జాగ్రత్తలను పాటించాలి. వారికి అవసరమైన పౌష్టికాహారాన్ని అందించాలి. ఎక్కవ మొత్తంలో పండ్లు, కూరగాయాలు, రోజుకు అరలీటరు మేర పాలను అందించాలి.

Young Age (2)
Adolescence : జీవితంలో ముఖ్యమైన దశ యవ్వన దశ..పసివయసు ఛాయలు పోయి పెద్దలుగా రూపాంతరం చెందుతారు. బాల్యం నుంచి యవ్వన దశకు చేరే క్రమంలో శారీరకంగా, మానసికంగా అమ్మాయిల్లో ఎన్నో మార్పులు జరుగుతాయి. వీటన్నిటికీ కారణం హార్మోన్ల్లే. అయితే రజస్వల కావడానికి ముందు, అయిన కొత్తలో ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేసుకోవాలి. పోషక విలువలతో కూడిన డైట్ తప్పనిసరి.
చాలా మంది తల్లిదండ్రులు యవ్వన దశకు చేరుకున్న తమ పిల్లలు సన్నగా నాజుగ్గా ఉండాలన్న అకాంక్షతో వారు తినే తిండిపై అనేక నిబంధనలు పెడుతుంటారు. తక్కువ మొత్తంలో ఆహారం తినాలని లావుగా తయారవ్వొద్దని పదేపదే చెప్పటం వల్ల ఈ ప్రభావం ఎదిగే వయస్సు యవ్వనులపై మానసికంగా, భౌతికంగా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
కౌమారంలో శారీరకంగా, మానసికంగా ఒత్తిళ్లకు లోనవుతారు. అలాంటి సమయంలో వ్యాయామం లేకపోతే సులువుగా బరువు పెరుగుతారు. ఆ ఒత్తిడిలో కడుపు మాడ్చుకుంటారు. దీనివల్ల అనోరెక్సియా నర్వోసా, బ్యులీమియా మొదలైన ఈటింగ్ డిజార్డర్స్‌కు గురవుతారు. కొంతమంది బయటదొరికే ఫాస్ట్‌ఫుడ్స్ తినడంవల్ల క్యాల్షియం, ఐరన్, విటమిన్-ఎ లోపాలు తలెత్తుతాయి.
స్ధూలకాయులుగా మారకుండా, పోషకాల లోపం రాకుండా సమపాళ్లలో పోషకాహారం తీసుకోవాలి. క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారం తప్పనిసరి. దీనివల్ల ఎముకల సామర్థ్యం పెరుగుతుంది. శీతలపానీయాల జోలికి వెళ్ళకుండా ఉండటమే మంచిది. రక్తహీనత లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఐరన్ శాతం ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలి.
శారీరక ఎదుగుదలకు కావాల్సిన ప్రొటీన్లు, క్యాలరీలు అందించే ఆహార పదార్థాలను భోజనంలో భాగం చేసుకోవాలి. విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలను డైట్‌లో చేర్చుకోవాలి. వాకింగ్, స్కిప్పింగ్, స్పోర్ట్స్.. ఏదో ఓ వ్యాయామం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల అధిక బరువు సమస్య దరిచేరదు. ఆకలి కూడా పెరుగుతుంది.
తల్లి దండ్రులు తమ ఎదిగే పిల్లల విషయంలో జాగ్రత్తలను పాటించాలి. వారికి అవసరమైన పౌష్టికాహారాన్ని అందించాలి. ఎక్కవ మొత్తంలో పండ్లు, కూరగాయాలు, రోజుకు అరలీటరు మేర పాలను అందించాలి. ముఖ్యంగా తృణధాన్యాలతో కూడిన ఆహారం తీనేలా చూడాలి. అధిక కొవ్వులు కలిగిన ఆహారం తీసుకోకుండా ఉండాలి. భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉండాలంటే పోషకవిలువలతో కూడిన అహారం అవసరమన్న విషయం గుర్తుంచుకోవటం మంచిది.
యవ్వన దశలో ఉన్న వారు ఫాస్ట్ పుడ్స్, చిరుతిళ్ళ జోలికి వెళ్ళవద్దు, బోజనమో, టిఫినో ఒక పూట మానేస్తే సన్నబడతామన్న ఉద్దేశంతో వాటిని మానేసి చిరుతిళ్ళు తినటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలు డయేరియా, న్యూమోనియా, మలేరియా, మశూచి వంటి వ్యాధులకు త్వరగా లోనవుతున్నారు. మంచి ఆహారం అందకపోవడం వల్ల ఎదుగుదల సరిగా ఉండదు. దీనితో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. ఆరునెలలకొకసారి న్యూట్రిషన్ సలహా తీసుకోవాలి. మీకు తగిన ఆహారం గురించి నిర్ణయించుకోవాలి. రుచి కాదు, ఆరోగ్యం ముఖ్యమనే సూత్రం ప్రాతిపదికగా ఆహారం తీసుకునే అలవాటు చేసుకోవాలి.