Brittle Nails : మన గోళ్లు పెళుసుగా ఎందుకు మారతాయి ? సమస్యను ఎలా పరిష్కరించాలి.

కొబ్బరి నూనె  గోర్లు , క్యూటికల్స్ కోసం సహజ మాయిశ్చరైజర్ గా ఉపయోపడుతుంది. ఆలివ్ నూనె మంచి మూలం విటమిన్ ఇ. ఇది ఆరోగ్యకరమైన గోళ్లకు మేలు చేస్తుంది. కూటికల్స్ , గోళ్లకు ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల వాటిని హైడ్రేట్ గా , ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Brittle Nails : మన గోళ్లు పెళుసుగా ఎందుకు మారతాయి ? సమస్యను ఎలా పరిష్కరించాలి.

brittle nails

Brittle Nails : ఆరోగ్యకరమైన గోర్లు మన చేతుల రూపాన్ని పెంచడమే కాకుండా మన ఆరోగ్యాన్ని ప్రతిబింపచేస్తాయి. పురుషులు, మహిళలు ఇద్దరూ పెళుసుగా ఉండే గోర్లు సమస్యతో బాధపడుతున్నారు. బలహీనమైన, విరిగిపోయే గోర్లు, పొట్టుగా లెగిసిపోయే గురయ్యే అవకాశం కొన్నిసార్లు ఇబ్బంది కలిగిస్తాయి. బలమైన మరియు ఆరోగ్యకరమైన గోళ్లను పెంపొందించడానికి సమర్థవంతమైన వ్యూహాలను అమలు చేయటం అవసరం. చర్మం , జుట్టు లాగానే మన గోర్లు పైన కూడా శ్రద్ధ కనబరచటం అవసరం.

READ ALSO : Nails : గోర్లు వేగంగా పెరిగేలా చేసే…హోం రెమెడీస్!…

పెళుసుగా ఉండే గోర్లుకు కారణం ఏమిటి?

ఆహార లోపాలు, అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక రుగ్మతలు , హార్మోన్ల మార్పులు వంటి అనేక అంశాలు గోర్లు పెళుసుగా మారడానికి కారణమవుతాయి.

పోషకాహార లోపాలు: ఐరన్ లోపం, విటమిన్లు A, B, C, D మరియు E, అలాగే బయోటిన్ వంటి కొన్ని ముఖ్యమైన పోషకాలు లేకపోవడం వల్ల గోర్లు పెళుసుగా మారుతాయి. బలమైన గోర్లు అభివృద్ధికి ఈ విటమిన్లు అవసరం.

జీవనశైలి ఎంపికలు: కొన్ని అలవాట్లు అనగా గోళ్లను కొరకడం, కఠినమైన రసాయనాలను ఉపయోగించడం , వంటివి వాటిని బలహీనపరుస్తాయి.

శారీరక రుగ్మతలు: థైరాయిడ్ సమస్యలు, సోరియాసిస్, డెర్మటైటిస్, ఫంగల్ నెయిల్ ఇన్‌ఫెక్షన్లు వంటి కొన్ని అనారోగ్యాల వల్ల గోళ్లు పెళుసుగా , బలహీనంగా ఏర్పడతాయి.

హార్మోన్ల మార్పులు: హార్మోన్ స్థాయిలు , రుతువిరతి లేదా గర్భం తర్వాత కూడా గోళ్ల బలం , పెరుగుదలను ప్రభావితం చేస్తాయి.

READ ALSO : Covid-19: పెదవులు, గోర్లు, చర్మంపై కరోనా లక్షణాలు.. డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిందే!

బలమైన గోర్లు పెరగడానికి చిట్కాలు;

సరైన ఆహారం తీసుకోవడం ; సరైన పోషకాహారం మన గోళ్ళ ఆరోగ్యాన్ని మార్చుతాయి. వాటిని ఆరోగ్యవంతం చేస్తుంది. గోళ్ల ఆరోగ్యానికి తోడ్పడే పుష్కలమైన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. నట్స్, సాల్మన్, గుడ్లు , అవిసె గింజలు విటమిన్లు , ఖనిజాలు అధికంగా ఉండే కొన్ని ఆహారాలు, విటమిన్ ఇ బాదం, అవకాడోలు,పొద్దుతిరుగుడు గింజలతో సహా ఆహారాలలో పుష్కలంగా ఉంటుంది. ఇవి గోళ్లను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అదనంగా, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, ఆకు కూరలు పెళుసుగా ఉండే గోళ్లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.

హైడ్రేటెడ్‌గా ఉండడం ; సాధారణ ఆరోగ్యం, మన గోళ్ల ఆరోగ్యం రెండూ హైడ్రేటెడ్‌గా ఉండడంపై ఆధారపడి ఉంటాయి. గోళ్లను తయారు చేసే ప్రొటీన్ కెరాటిన్ అభివృద్ధి చెందడానికి ,బలంగా మారడానికి హైడ్రేట్ గా ఉండాలి. మనం తగినంత నీటిని తీసుకుంటే, మన గోర్లు బలంగా , ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి.

READ ALSO : గోర్లుపై తెల్లని మచ్చలు ఎందుకొస్తాయో?

కఠినమైన రసాయనాలను నివారించడం ;అసిటోన్‌తో కూడిన కఠినమైన క్లీనర్‌లు , నెయిల్ పాలిష్ రిమూవర్‌లను ఉపయోగించడం మానుకోవాలి. ఎందుకంటే అవి గోళ్లను పొడిగా చేయటంతోపాటు, బలహీనపరుస్తాయి. ప్రత్యామ్నాయంగా సహజ ఉత్పత్తులను మితంగా ఉపయోగించాలి.

గోళ్లను మాయిశ్చరైజ్ చేయడం ఎలా?

కొబ్బరి నూనె  గోర్లు , క్యూటికల్స్ కోసం సహజ మాయిశ్చరైజర్ గా ఉపయోపడుతుంది. ఆలివ్ నూనె మంచి మూలం విటమిన్ ఇ. ఇది ఆరోగ్యకరమైన గోళ్లకు మేలు చేస్తుంది. కూటికల్స్ , గోళ్లకు ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల వాటిని హైడ్రేట్ గా , ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

READ ALSO : Apple Cider Vinegar : ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటిలో దీనిని కలుపుకుని తాగితే ఏం జరుగుతుందో తెలుసా ?

డైటరీ సప్లిమెంట్స్ సహాయం చేయగలవా?

ఆరోగ్యకరమైన గోళ్ల కోసం విటమిన్ డి, బయోటిన్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్లను తీసుకోవాలి. గుడ్లు, బాదం, చిలగడదుంపలు వంటి ఆహారాల నుండి బయోటిన్ పొందవచ్చు. బయోటిన్ సప్లిమెంట్ తీసుకోవచ్చు.

ఆర్టిఫిషియల్ నెయిల్స్, నెయిల్ కలర్ వాడకం మానుకోవటం ;

నెయిల్ ఎక్స్‌టెన్షన్‌లు, గోళ్లను కఠినంగా హానికరంగా మారేలా చేస్తాయి. సాధారణ గోరు కృత్రిమ గోరును పెట్టటం వల్ల గోరు బలహీనంగా , సన్నగా మారుతుంది. గోరు సాధారణ జీవితకాలం రెండు నుండి మూడు వారాలు, ఆ తర్వాత వాటిని పూర్తిగా తొలగించాలి. సహజమైన గోరు , క్యూటికల్ మధ్య ఖాళీని మూసివేసే ప్రయత్నం చేయాలి. పెళుసుగా ఉండే గోళ్లను నివారించడానికి గోళ్లకు రంగు వేయకూడదు. ఇలా చేయటం వల్ల గోర్లు సహజంగా ఉండటానికి అవకాశం ఉంటుంది.

READ ALSO : High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ సమస్య గురించి కళ్లు, కాళ్ళు, నాలుకలో కనిపించే 5 సంకేతాలు !

అంతర్గత పోషణ, సున్నితమైన గోరు సంరక్షణ, గోర్లకు హానిచేసే అలవాట్లను నివారించడం ద్వారా బలమైన, అందమైన గోళ్లను ఆరోగ్యకరమైన గోర్లు మన చేతుల రూపాన్ని మెరుగుపరచడమే కాకుండా, మన సాధారణ ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తాయని గుర్తుంచుకోవాలి.