Vivek Murthy : మద్యం బాటిళ్లపై ‘మద్యపానం క్యాన్సర్‌కు కారకం’ లేబుల్ ముద్రించాలి : అమెరికా సర్జన్ జనరల్ ప్రతిపాదన!
Vivek Murthy : అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ప్రతిపాదన ప్రకారం.. మద్యం బాటిళ్లపై మద్యపానం క్యాన్సర్‌కు కారకమని స్పష్టమైన లేబుల్‌ని సిఫార్సు చేస్తున్నారు.

cancer warning labels on alcohol
Vivek Murthy : మద్యపానం ఆరోగ్యానికి ప్రమాదకరం.. మద్యం బాటిళ్లపై ఈ హెచ్చరిక కనిపిస్తుంటుంది. అయినప్పటికీ చాలామంది మందుబాబులు ఈ మద్యాన్ని సేవించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో మద్యపానం సేవించేవారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ మద్యపానం కారణంగా అనేక మంది తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.
దీని కారణంగానే కొన్ని క్యాన్సర్లకు దారితీస్తుందని కూడా రుజువైంది. అయినప్పటికీ మద్యం సేవిస్తూనే ఉన్నారు. మరోవైపు.. ఆల్కహాల్ వినియోగంతో కాలేయం, రొమ్ము, గొంతు క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. దాదాపు ఒక మిలియన్ క్యాన్సర్ కేసులు దశాబ్ద కాలంలో నమోదయ్యాయి.
మద్యపానం క్యాన్సర్‌కు కారకం :
లేటెస్టుగా మద్యపానానికి సంబంధించి ఒక కీలక ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిపాదన చేసింది ఎవరో కాదు.. అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి. క్యాన్సర్ కారకాల్లో ఆల్కహాల్ ప్రధాన కారకమని ఆయన హెచ్చరిస్తున్నారు. అమెరికాలో కొనుగోలు చేసే మద్యం బాటిళ్లలపై ‘మద్యపానం క్యాన్సర్‌కు కారకం’ అని స్పష్టమైన లేబుల్ తప్పనిసరిగా ముద్రించాలని వివేక్ మూర్తి ప్రతిపాదించారు. అంతేకాదు.. ఆరోగ్య ప్రమాదాల గురించి అమెరికన్లకు మరింత సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
ఆల్కహాల్ వినియోగం క్యాన్సర్ వ్యాధికి కారకం :
మూర్తి ప్రతిపాదనతో మద్యపానం తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందనే పరిశోధనలను హైలైట్ చేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధికి కారణమవుతుందని యూఎస్ జనరల్ సర్జన్ హెచ్చరించారు. గత దశాబ్దంలో అమెరికాలో దాదాపు ఒక మిలియన్ క్యాన్సర్ కేసులకు ఆల్కహాల్ కారణమని, దాదాపు 20వేల వార్షిక మరణాల్లో ఆల్కహాల్ సంబంధిత క్యాన్సర్లు కారణమని ఆయన నొక్కి చెప్పారు.
ఆల్కహాలిక్ పానీయాలపై గర్భధారణ సమయంలో పుట్టుకతో వచ్చే లోపాలకు సంబంధించిన వార్నింగ్ లేబుల్స్ కలిగి ఉండగా, ఆల్కహాల్‌తో ముడిపడిన క్యాన్సర్ ప్రమాదాల నివారణకు అదనపు లేబుల్ ఉండాలని మూర్తి ప్రతిపాదించారు.
ఆల్కహాల్ తాగితే 7 రకాల క్యాన్సర్ల ముప్పు :
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం, రొమ్ము, గొంతు క్యాన్సర్‌లతో సహా కనీసం 7 రకాల క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మూర్తి ప్రతిపాదన ప్రకారం.. ఒక వ్యక్తి ఎంత ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే.. వారికి క్యాన్సర్ ముప్పు అంత ఎక్కువగా ఉంటుంది.
‘మీరు ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని గుర్తుంచుకోండి. మీరు ఎంత తాగాలి లేదా ఎంత తాగాలి అనే విషయాన్ని పరిశీలిస్తే.. క్యాన్సర్ ప్రమాదం వచ్చినప్పుడు తక్కువ ఉండాలని గుర్తుంచుకోండి’ అని మూర్తి పేర్కొన్నారు.