50 ఏళ్లకు ‘యక్షి’ నగ్న విగ్రహానికి కొత్తరూపం

కేరళ ఐకానిక్ ‘యక్షి’ 30 అడుగుల ఎత్తైన స్త్రీ నగ్న విగ్రహం 50ఏళ్ల తరువాత తుది మెరుగులు దిద్దుకుంటోంది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో అతిపెద్ద టూరిస్ట్ ప్రాంతాల్లో ఇదొకటి.

  • Published By: sreehari ,Published On : February 5, 2019 / 01:06 PM IST
50 ఏళ్లకు ‘యక్షి’ నగ్న విగ్రహానికి కొత్తరూపం

Updated On : February 5, 2019 / 1:06 PM IST

కేరళ ఐకానిక్ ‘యక్షి’ 30 అడుగుల ఎత్తైన స్త్రీ నగ్న విగ్రహం 50ఏళ్ల తరువాత తుది మెరుగులు దిద్దుకుంటోంది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో అతిపెద్ద టూరిస్ట్ ప్రాంతాల్లో ఇదొకటి.

కేరళ ఐకానిక్ ‘యక్షి’ 30 అడుగుల ఎత్తైన స్త్రీ నగ్న విగ్రహం 50ఏళ్ల తరువాత కొత్త మెరుగులు దిద్దుకుంటోంది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో అతిపెద్ద టూరిస్ట్ ప్రాంతాల్లో ఇదొకటి. మిగతా టూరిస్ట్ ప్రాంతాల్లో కంటే ఇక్కడ కనిపించే ‘యక్ష’ నగ్న స్త్రీ విగ్రహం పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది. యాభై ఏళ్ల క్రితం మాలాంపుజ్హా డ్యామ్ కు సమీపంలోని మాలాంపుజ్హా గార్డెన్స్ లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. యక్ష స్త్రీ నగ్న విగ్రహాన్ని ఓ సీనియర్ ఆర్టిస్ట్ శిల్పకారుడు కణయ్ కున్హిరామన్ 1969లో మనోహారమైన రీతిలో చెక్కారు. లండన్ నుంచి తిరిగి స్వదేశానికి వచ్చిన శిల్పి కణయ్.. ఈ అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించి గార్డెన్ లో ప్రతిష్టించారు. 

‘యక్షి’ అంటే స్థానిక భాషలో స్థానిక దేవతగా పిలుస్తారు. ఇంద్రియాలను తట్టిలేపే భంగిమలో.. జాలువారే కురులు (జుట్టు).. రెండు కాళ్లు ముందుకు చాచిన భంగిమలో.. సగం కళ్లు తెరిచి ఉండినట్టుగా అద్భుతమైన రీతిలో శిల్పాన్ని రూపొందించారు. కన్హిరామన్ తన 30ఏళ్ల వయస్సులో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇప్పుడు 81ఏళ్ల వయస్సులో శిల్పి కణయ్ (50ఏళ్ల తరువాత) యక్షి విగ్రహానికి కాంస్యపు పూతతో తుది మెరుగులు దిద్దేపనిలో నిమగ్నమయ్యారు. 30 అడుగులు ఉండే ఈ యక్షి నగ్న విగ్రహానికి కాంస్యపు పూతను పూయాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో ఈ విగ్రహం చెక్కు చెదరకుండా ఉండాలంటే.. కాంస్యపు పూత తప్పనిసరిగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి కూడా తన విన్నపాన్ని తెలపగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. 

ఇప్పటివరకూ దేవాలయాల గోడలపైనే ఇలాంటి స్త్రీమూర్తుల నగ్న విగ్రహాలు దర్శనమివ్వడం చూశామని, స్త్రీ నగ్నంగా ఉన్న శిల్పాల్లో బయటకు వచ్చిన తొలి స్త్రీ నగ్న శిల్ప ‘యక్షి’ మాత్రమేనని ఆయన అన్నారు. 1969లో యక్షి నగ్న విగ్రహ ప్రతిష్టాపనను అక్కడి స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో ఈ నగ్న విగ్రహం నిర్మాణంపై ఎన్నో వివాదాలకు దారితీసింది. దీంతో శిల్పి కన్హిరామన్ కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు సాగాయి. కణయ్ ఆలోచనను తీవ్రంగా తప్పుబట్టిన స్థానికులు దాడికి కూడా యత్నించారు. అయినప్పటికీ కూడా కణయ్ ఎంతమాత్రం వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్టుగానే యక్షి స్త్రీ నగ్న విగ్రహాన్ని ప్రతిష్టించి చూపించారు. యక్షి నగ్న విగ్రహ ప్రతిష్టాపనకు ముందు ఇదే ప్రాంతంలో నంది విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావించినట్టు శిల్పి కణయ్ చెప్పారు. ఆ తరువాత తనకు యక్షి విగ్రహాన్ని నిర్మించాలనే ఆలోచన వచ్చిందని, దాంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిపారు.