జాతీయ జనాభా పట్టిక (NPR) అంటే ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన అంశాలు!

పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం కేంద్ర కేబినెట్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) జాతీయ జనాభా రిజిస్టరు అప్‌డేషన్ కోసం రూ.8వేల 500 కోట్ల నిధుల ఖర్చుకు ఆమోదం తెలిపింది. 2020 ఏప్రిల్ నుంచి ఈ NPR ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశీయ నివాసితులతో కూడిన NPR జాబితాను రెడీ చేయనుంది.
2015 నాటికి ఈ NPR డేటాను ఇంటింటికి వెళ్లి అప్ డేట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డిజిటైజేషన్ అప్ డెటేడ్ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి అయింది. ఇప్పుడు.. జాతీయ జనాభా రిజిస్టరు అప్ డేట్ చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2020 వరకు దేశంలోని అసోం మినహా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నివాసితుల వివరాలను 2021 నాటికి దశల వారీగా జాబితాను అప్‌డేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
NPR అంటే ఏంటి?
జాతీయ జనాభా రిజిస్టరు (NPR)అంటే.. దేశంలో పౌరులు ఎవరైనా ఒక ప్రాంతంలో 6 నెలల కన్నా ఎక్కువ సమయం ఉన్నవారందరినీ ఇందులో చేరుస్తారు. స్థానిక (గ్రామం/ఉప పట్టణం), ఉప జిల్లా, జిల్లా, రాష్ట్రం, జాతీయ స్థాయిలో పౌరసత్వ చట్టం 1955 కింది నిబంధనలు, పౌరసత్వం (పౌరుల నమోదు, జాతీయ గుర్తింపు కార్డుల జారీ) రూల్స్ 2013 ప్రకారం జాబితాను సేకరిస్తారు. దేశంలో నివసించే ప్రతి భారత పౌరుడు తప్పనిసరిగా NPRలో నమోదు చేయించుకోవాలి. NRP కింద ఒక నివాసి.. స్థానిక ప్రాంతంలో 6 నెలలు కన్నా ఎక్కువ రోజులు ఉండటం లేదా మరో ఆరు నెలలకు పైగా అదే ప్రాంతంలో ఉండాలని పౌరుడు భావిస్తే వారంతా తప్పనిసరిగా జాతీయ జనాభా పట్టికలో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
NPR ఉద్దేశమేంటి? :
దేశంలోని ప్రతి పౌరుడి డేటాబేస్‌ను సమగ్రంగా గుర్తించేందుకు వీలుగా జాతీయ జనాభా రిజిస్టరును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డేటాబేస్.. జనసంఖ్య పరంగా మాత్రమే కాకుండా బయోమెట్రిక్ వివరాలతో కలిపి ఉంటుంది. ఇందులో ఆధార్, మొబైల్ నెంబర్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ వివరాలు, భారత పాస్ పోర్టు నెంబర్లన్నింటినీ భారత నివాసితుల నుంచి సేకరిస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఆధార్ కార్డు వివరాలను షేర్ చేయాలా లేదా అనేది స్వచ్ఛందంగా పౌరుడే నిర్ణయం తీసుకోవచ్చు.
ఎలాంటి జనాభా వివరాలు అవసరం :
కుటుంబ పెద్దకు సంబంధించిన వ్యక్తి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, వివాహం అయితే (భార్య/భర్త)పేరు, లింగం, పుట్టిన తేదీ, వయస్సు, పుట్టిన తేదీ, వివాహ స్థితి, జాతీయుత(డిక్లేర్డ్), నివాసితుడి ప్రస్తుత చిరునామా, ప్రస్తుత చిరునామాలో ఎన్నాళ్లుగా ఉంటున్నారు, శాశ్వత నివాస చిరునామా, వృత్తి, విద్యా అర్హతలు అన్నింటిని తప్పక ఇవ్వాల్సి ఉంటుంది.
కరెంట్ స్టేటస్.. అంటే ఏంటి?
జనాభా లెక్కల(సెన్సస్)కు NPR అనుసంధానమై ఉంటుంది. దీని గణాంకాలను తొలుత 2010లో సేకరించారు. 2011 భారత జనాభా లెక్కల్లో నివాసితుల జాబితా దశలో భాగంగా NPRను కూడా నాటి యూపీయే ప్రభుత్వం సేకరించింది. 2015లో ఎన్‌పీఆర్ డేటాను ఇంటింటి సర్వే ద్వారా అప్‌డేట్ చేశారు. ఇప్పుడా ఆ డిజిటైజేషన్ సంబంధించి అన్ని వివరాల అప్ డేషన్ పూర్తి అయిపోయింది. 2021 ఇళ్ల జాబితా దశలో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో (అసోం మినహా) 2020 ఏప్రిల్-సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇదివరకే గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయగా అది కూడా అమల్లోకి వచ్చేసింది.
ఏ రాష్ట్రాలు NPR బ్లాక్ చేశాయి :
ఈ ఏడాదిలోనే పశ్చిమ బెంగాల్ NPR అప్ డేషన్ ప్రక్రియకు సంబంధించి అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి (CAA)కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం వెల్లడైంది. రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ.. పాన్ ఇండియా NRC ప్రతిపాదించే చట్టాన్ని తీవ్రంగా వ్యతిరికేస్తూ తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని పునరుద్ఘాటించారు. NRPకి సంబంధించి అన్ని కార్యకలాపాలను పశ్చిమ బెంగాల్ నిలిపివేసినట్టు స్పష్టం చేశారు. బెంగాల్ ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేంతవరకు NRP అమలు చేసేది లేదన్నారు. కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా బెంగాల్ బాటలోకి వచ్చేశాయి.
అసోం.. ఎందుకు మినహాయింపు? :
ఇప్పటివరకూ, NPR ప్రక్రియ అనేది అసోంలో ప్రారంభం కాలేదు. అక్రమ వలసదారులను గుర్తించేందుకు NRC ప్రక్రియను అసోంలో ప్రారంభించింది. కొంతమందిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. పాన్-ఇండియా NRC ఉద్దేశం కూడా ఇదే..అక్రమ వలసదారులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం.. విశ్వాసంతో సంబంధం లేకుండా దీన్ని అమలు చేయడం జరుగుతోంది. దీని కారణంగా అసలైన భారత పౌరులు కూడా తమ భారత పౌరసత్వం కోల్పోయే అవకాశాలు కూడా లేకపోలేదు.
NPR డేటా యాక్సస్ ఎలా :
జాతీయ జనాభా రిజిస్టర్ (NPR)ను పబ్లిక్ డొమైన్ లో పెట్టరు. కానీ, సంబంధిత యూజర్ ప్రొటెక్టడ్ ప్రొటోకాల్స్ పాస్ వర్డ్ ద్వారా మాత్రమే ఈ సెక్యూర్ డేటాబేస్ ను యాక్సస్ చేసుకోవచ్చు. లబ్దిదారుల ఆధారిత పథకాల కోసం ఈ డేటాను వినియోగించడంతో పాటు అంతర్గత భద్రతలో చిక్కులను మెరుగుపర్చడంలో NPR డేటాను యాక్సస్ చేసుకునే అవకాశం ఉంది.