Gain Weight : ఎంత తిన్నా బరువు పెరగటం లేదా! ఇందుకోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?
వేరుశనగ గింజల్లో ప్రోటీన్ మరియు కొవ్వు పుష్కలంగా ఉన్నాయి. బరువు పెరగాలనుకొనే వారు వీటిని తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. బంగాళ దుంప ఒక సాధరణమైన వెజిటేబుల్. బరువు పెరగాలనుకునేవారు దీనిని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Gain Weight
Gain Weight : ఆరోగ్యకరంగా ఉంటూనే బరువు పెరగడం అనేది ఉత్తమమైన మార్గం. బరువు పెరగాలి అంటే మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకోవాలి. అయితే ఈ ఆహారం ఆరోగ్యవంతమైనది కాకపోతే బరువు పెరగడంతో పాటు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంటుంది. బరువు పెరగాలనే కోరికను కలిగి ఉంటే మాత్రం అధిక ప్రోటీనులున్న ఆహారాలు తీసుకోవడం వల్ల మీ శరీరంలో కండరాలు ఏర్పడటానికి మరియు బరువు పెరగడానికి బాగా సహాయపడుతాయి.
డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ లో పుష్కలమైన క్యాలరీలు, పోషకవిలువలు, మరియు ఫైబర్ కలిగి ఉంది. పోషకవిలువలున్న డ్రై ఫ్రూట్స్ ను పెరుగు లేదా ఐస్ క్రీమ్ , సలాడ్లు మరియు ధాన్యాలలో ల మీద గార్నిషింగ్ గా వేసుకొని తినవచ్చు. ఎండుద్రాక్ష, బాదాం, వాల్ నట్స్ మరియు జీడిపప్పు వంటి వాటిని రోజువారీగా తీసుకోండి. వేరుశనగ గింజల్లో ప్రోటీన్ మరియు కొవ్వు పుష్కలంగా ఉన్నాయి. బరువు పెరగాలనుకొనే వారు వీటిని తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. బంగాళ దుంప ఒక సాధరణమైన వెజిటేబుల్. బరువు పెరగాలనుకునేవారు దీనిని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
వేయించిన ఆహారం, ఎక్కువ తీపి పదార్థాలు, ఎక్కువ కొవ్వులు ఉన్న మాంసం లాంటి వాటిని పరిమితంగానే తీసుకోవాలి. మీ బరువు నెలకు రెండు నుంచి మూడు కేజీల వరకు పెరిగేందుకు రోజుకు అరలీటరు పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. పెరుగు, పాలు వంటి డైరీ ప్రోడక్ట్స్ ను తీసుకోవడం పెంచండి. పాలు చాలా ఆరోగ్యం మరియు ఇందుల అధిక ప్రోటీనలు మరియు క్యాల్షియం ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన కండరాలు, ఎముకల పెరుగుదలకు సహాయపడుతాయి.
అలాగే రోజువారిగా రెండు గుడ్లు, రెండు వందల గ్రాముల చికెన్ లేదా చేప కూడా తీసుకోవచ్చు. వీటన్నింటితో పాటు, కనీసం రెండు, మూడు కప్పుల కాయగూరలు లేదా ఆకుకూరలు తీసుకోవాలి. అరగంట వ్యాయామానికి కూడా కేటాయిస్తే తీసుకున్న ఆహారం బాగా వంట బట్టి, బరువు పెరగడానికి ఉపయోగ పడుతుంది. అయితే ఈ విషయంలో నిద్ర కూడా చాలా అవసరం. రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర మంచిది. ఈ ఆహార నియమాలు పాటించటం ద్వారా ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.