అభినందన్ తరహా మీసం, హెయిర్ స్టైల్ పై యువత ఉత్సాహం
అభినందన్ మీసం, హెయిర్ స్టైల్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది.

అభినందన్ మీసం, హెయిర్ స్టైల్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది.
కర్నాటక : పాకిస్తాన్ అధికారుల ముందు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ దేశ యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆయన మీసం స్టైల్ ఇప్పుడు లేటెస్ట్ స్టైల్ అయిపోయింది. అభినందన్ తరహా మీసం, హెయిర్ స్టైల్ పై యువత ఉత్సాహం చూపిస్తున్నారు. బెంగళూరులో అభినందన్ తరహా మీసం కట్, హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి హెయిర్ సెలూన్ ల ముందు యువకులు క్యూ కడుతున్నారు. ఇన్ని రోజులూ బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లను అనుకరించేవారమని ఇప్పుడు నిజమైన హీరో అభినందన్ ను అనుకరిస్తామని అంటున్నారు.
Also Read : అభినందన్ అరుదైన రికార్డ్ : F-16 కూల్చిన తొలి IAF కమాండర్
భారత ఆర్మీ పోస్టులపై దాడికి యత్నించిన పాక్ యుద్ధ విమానాన్ని అభినందన్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అడ్డుకున్నారు. వాటిని తరిమి కొట్టారు. పాక్ ఆర్మీ ఓ విమానాన్ని కూల్చేసింది. ఈ క్రమంలో అభినందన్ ఉన్న మిగ్ 21 యుద్ధ విమానం కూలిపోయింది. అభినందన్ పారాచ్యూట్ ద్వారా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో దిగారు. వెంటనే ఆయనను చుట్టుముట్టిన కొందరు అతడిపై దాడి చేశారు. విచక్షణరహితంగా కొట్టారు. ఆ తర్వాత పాక్ ఆర్మీ అభినందన్ ను అదుపులోకి తీసుకుంది.
Also Read : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ : టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు
ఆ సమయంలో పాక్ ఆర్మీ విడుదల చేసిన వీడియో అభినందన్‌ని హీరోను చేసింది. పాక్ అధికారులు అడిగిన ప్రశ్నలకు అతను ఇచ్చిన సమాధానం భారతీయులను ఫిదా చేసింది. తాను దక్షిణ భారతీయుడిని అని మాత్రమే చెప్పిన అభినందన్.. ఆ తర్వాత పాక్ ఆర్మీ అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. శత్రువు చేతిలో బందీగా ఉన్నా.. ఏ మాత్రం బెదరకుండా అభినందన్ చూపిన ధైర్యసాహసాలకు యావత్ భారతీయులు హ్యాట్సాఫ్ చెప్పారు. ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత రావడం, జెనీవా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ అభినందన్ ను భారత్ కు అప్పగించింది.
Also Read : ఇదే భారతీయత అంటే : ఆకలితో ఉన్న పాక్ ప్రజలకు ఆహారం ఇచ్చిన పంజాబ్ పోలీసులు