‘‘గున్నా గున్నా మామిడి’’.. ఊపు తగ్గలేదు..

  • Published By: sekhar ,Published On : July 13, 2020 / 01:24 PM IST
‘‘గున్నా గున్నా మామిడి’’.. ఊపు తగ్గలేదు..

Updated On : July 13, 2020 / 2:20 PM IST

గున్నా గున్నా మామిడి.. ఈ పాట వింటే పిల్లల దగ్గరినుంచి పెద్దలవరకు అందరికీ ఓ ఊపు వస్తుంది. ఇక డీజే రీమీక్స్ పాటకు కుర్రకారు చేసే హంగామా అయితే చెప్పక్కర్లేదు. ఫంక్షన్ ఏదైనా ఈ పాట ప్లే చేసి తీరాల్సిందే. అందరూ కాలు కదపాల్సిందే.

మాస్ మహారాజ్ రవితేజ, మెహరీన్ జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో గున్నా గున్నా మామిడి పాటకు ప్రేక్షకులు థియేటర్లలో ధూం ధాం చేశారు. తాజాగా ఈ వీడియో సాంగ్ అక్షరాలా 10 మిలియన్ల వ్యూస్ రాబట్టుకోవడం విశేషం. అలాగే లైకులు కూడా 2 మిలియన్లకు పైగానే వచ్చాయి.

Raja The Great

ఇక ఈ పాటలో రవితేజతో కలిసి శ్రీనివాస రెడ్డి, సన, సురేఖావాణి, హరితేజ తదితరులు ఎంత ఎనర్జీతో స్టెప్పులు వేశారో తెలిసిందే. రవితేజ అంధుడిగా సరికొత్త పాత్ర పోషిస్తూనే తన స్టైల్ కామెడీతో అలరించాడు. దర్శకుడిగా అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’ హ్యాట్రిక్ ఫిల్మ్..

Read Here>>శివన్న ‘భజరంగీ 2’ టీజర్ అదిరిపోయిందిగా!