Akhanda: ‘అఖండ’ కోసం 120 మంది సింగర్స్… 500 మంది మ్యుజిషియన్స్.. తమన్ ప్లాన్ మాములుగా లేదుగా

ఇందుకోసం భారీగా ప్లాన్ చేశాడు తమన్. దీని గురించి చెప్తూ.. 'అఖండ' సినిమా కోసం 120 మంది సింగర్స్ పాడారని, 'అఘోర' పాత్ర నేపథ్యంలో సాగే పాట కోసం అంతమంది.........

Akhanda: ‘అఖండ’ కోసం 120 మంది సింగర్స్… 500 మంది మ్యుజిషియన్స్.. తమన్ ప్లాన్ మాములుగా లేదుగా

Taman

 

Akhanda:  ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పటికే 100 సినిమాలకు పైగా సంగీతం అందించాడు తమన్. ‘అల వైకుంఠపురం’ సినిమా సాంగ్స్ బాగా హిట్ అవ్వడంతో, యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టించడంతో తమన్ దశ తిరిగి అప్పట్నుంచి పెద్ద సినిమాలే చేస్తున్నాడు. ప్రస్తుతం తమన్ చేతిలో దాదాపు 10 పెద్ద సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం తమన్ వర్క్ చేసిన ‘అఖండ’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్ నిన్న మీడియాతో మాట్లాడారు.

Bigg Boss 5 : బిగ్ బాస్‌లో సింహాసనం.. రసవత్తరంగా సాగుతున్న కెప్టెన్సీ టాస్క్

గతంలో పాటల్లో ఎక్కువగా కోరస్ ఉండేది. ఇందుకోసం కోరస్ పాడేవాళ్లు కూడా ఎక్కువ మంది ఉండే వాళ్ళు. కానీ ఇటీవల కాలంలో ఎక్కువగా సోలో లేదా డ్యూయెట్ పాటలే ఉంటున్నాయి. సింగర్లు పాడేసి వెళ్లిపోతున్నారు. దీంతో కోరస్ సాంగ్స్ మెల్లిమెల్లిగా కనుమరుగవుతున్నాయి. అయితే తమన్ అఖండలో కోరస్ సాంగ్స్ ని పట్టిస్తున్నాడు. ఇందుకోసం భారీగా ప్లాన్ చేశాడు తమన్. దీని గురించి చెప్తూ.. ‘అఖండ’ సినిమా కోసం 120 మంది సింగర్స్ పాడారని, ‘అఘోర’ పాత్ర నేపథ్యంలో సాగే పాట కోసం అంతమంది అవసరమయ్యారని తమన్ చెప్పాడు. అఘోర పాత్ర నేపథ్యంలో సాగే పాట ఎలా ఉండాలి? ఎలాంటి వాయిద్యాలు వాడాలి? ఎంతమందితో పాడించాలి? ఈ విషయాలపై బాగా రీసెర్చ్ చేసిన తరువాతనే పాటలను రికార్డ్ చేశామని తమన్ చెప్పాడు. అందుకే 120 మంది సింగర్స్ తో పాడించామని చెప్పాడు.

Brahmanandam : మీమ్స్ చేసే వాళ్లందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా : బ్రహ్మానందం

అంతేకాక ఈ సినిమా కోసం దాదాపు ఐదారు వందలమంది మ్యుజిషీయన్స్ పనిచేశారని, పాటల విషయంలో ఎక్కడా రాజీ పడలేదనీ, శివుడి మీద పాట కోసం శంకర్ మహదేవన్ ను తీసుకొచ్చామని, ఈ ఒక్క పాట కోసమే నెల రోజులు పట్టిందని చెప్పారు తమన్. తమన్ ఇంత గ్రాండ్ గా చెప్పడంతో ఆ పాట పై అంచనాలు పెరిగి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు.