18 Pages: ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించేందుకు మేకర్స్ డేరింగ్ నిర్ణయం

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా మూవీ ‘18 పేజెస్’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, ఈ సినిమాలోని కథ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

18 Pages: ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించేందుకు మేకర్స్ డేరింగ్ నిర్ణయం

18 Pages Makers Decide To Decrease Ticket Prices

Updated On : December 22, 2022 / 6:07 PM IST

18 Pages: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా మూవీ ‘18 పేజెస్’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, ఈ సినిమాలోని కథ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

18 Pages Movie : 18 పేజెస్ ప్రీ రిలీజ్ బిజినెస్.. ఇంతేనా.. ఈజీగానే టార్గెట్ కొట్టేస్తానంటున్న నిఖిల్..

ఇక ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ఇప్పటికే భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తూ సందడి చేస్తోంది. అయితే తాజాగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు 18 పేజెస్ చిత్ర యూనిట్ మరో సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది. 18 పేజెస్ మూవీ టికెట్ రేట్లను రూ.150 అంతకంటే తక్కువ రేటుకు ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. మల్టీప్లెక్స్‌లో రూ.150, సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో ఈ సినిమా టికెట్ రేట్ ధర అంతకంటే తక్కువగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

18 Pages: నిఖిల్-అనుపమల ‘18 పేజెస్’ రన్‌టైమ్ ఫిక్స్.. ఎంతంటే..?

ప్రస్తుతం ఈ నిర్ణయం చిత్ర వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ‘18 పేజెస్’ వేసిన అడుగు ప్రశంసనీయమని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ కథను అందించగా, GA2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.